swamy paripoornananda

టీఆర్ఎస్, మహాకూటమిపై పరిపూర్ణానంద విమర్శలు

Submitted by arun on Sat, 11/03/2018 - 16:40

టీఆర్ఎస్, మహాకూటమిలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని స్వామి పరిపూర్ణానంద ఎద్దేవచేశారు. హైదరాబాద్‌లో బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాసమావేశం నిర్వహించారు. హిందువుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ బీజేపీనే గెలిపించాలని పరిపూర్ణానంద అన్నారు. తెలంగాణలో తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీసస్ పరిపాలన తీసుకొస్తామని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అంటుంటే,, టీఆర్ఎస్ వాళ్లయితే తెలంగాణ అంటే నిజామేనని ఆయన చరిత్ర ప్రతిఒక్కరూ చదువుకోవాలని చెబుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

హైకోర్టుకు స్వామి పరిపూర్ణానంద

Submitted by arun on Wed, 07/11/2018 - 16:35

స్వామి పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించారు. తనను హైదరాబాద్‌ నుంచి బహి‌ష్కరిస్తూ తెలంగాణ పోలీస్‌ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేశారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేసిన పరిపూర్ణానంద తనపై బహిష్కరణ వేటు తొలగించేలా తెలంగాణ పోలీస్‌ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌ నుంచి బహిష్కరించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపిన స్వామి పరిపూర్ణానంద ఇది భావ ప్రకటన స్వేచ్ఛను, రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనన్నారు.