tollywood

బన్నీ పబ్ లో కలిస్తే..అదే అడిగేవారు : అపూర్వ

Submitted by arun on Thu, 06/14/2018 - 11:52

తాను సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో పబ్ కల్చర్ చాలా బాగా అనిపిచ్చేదని, నిత్యం పబ్‌లకు వెళ్లేవాళ్లమని నటి అపూర్వ చెప్పారు. తాము రెగ్యులర్‌గా వెళ్లే టచ్ పబ్‌కు బన్నీ కూడా వచ్చేవారని వెల్లడించారు. ఓ వెబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అపూర్వ ఈ విషయాలు చెప్పుకొచ్చారు. తాము రెగ్యులర్‌గా వెళ్లే టచ్ పబ్‌కు బన్నీ కూడా వచ్చేవారని వెల్లడించారు. మేం వెళ్లే టచ్ బప్ కి బన్నీ కూడా వచ్చేవారని..నేనెప్పుడైనా ఎదురుపడితే ఏంటండీ పబ్‌లో కనిపించట్లేదు అంటూ బన్నీ సరదాగా అనేవారు. అంత ఫన్నీగా ఉండేవాళ్లం. ఒక ఏజ్‌లో ఆ రకమైన కల్చర్ ఉంటుంది  అని అపూర్వ వెల్లడించారు.

చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన పోసాని

Submitted by arun on Mon, 06/11/2018 - 16:37

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మరోసారి సినీ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారన్న పోసాని....  23మంది వైసీపీ ఎమ్మెల్యేలను సిగ్గులేకుండా కొనుగోలు చేశారని మండిపడ్డారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు తెలుగుదేశం జెండా కప్పడం అభివృద్ధిలో భాగమా అంటూ ప్రశ్నించారు. ప్రత్యేకహోదా వద్దన్న చంద్రబాబు ఇప్పుడు ప్రధాని మోదీని విమర్శించటం ఏంటని నిలదీశారు. ప్రతిపక్ష నేత జగన్ అవినీతి వ్యవహారం కోర్టులే చూసుకుంటాయని, చంద్రబాబు తన అవినీతిపై నార్కోఎనాలసిస్ టెస్ట్‌కు సిద్ధమా అంటూ మరోసారి పోసాని ప్రశ్నించారు.

ముగిసిన సినీ పెద్దల సమావేశం

Submitted by arun on Sat, 04/21/2018 - 14:13

అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల సమావేశం ముగిసింది. క్యాస్టింగ్ కౌచ్, టాలీవుడ్ సమస్యలపై చర్చించారు. రెండు గంటలకు పైగా సమావేశం జరిగింది. పవన్ కల్యాణ్ డెడ్ లైన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మీటింగ్ తర్వాత ఏమి మాట్లాడకుండానే వెళ్లిపోయారు సినీ పెద్దలు. 

పవన్ డెడ్‌లైన్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ

Submitted by arun on Sat, 04/21/2018 - 09:52

పవన్ డెడ్‌లైన్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. పవన్ ఇచ్చిన అల్టిమేటంపై చర్చించేందుకు సినీ ప్రముఖులు ఇవాళ అన్నపూర్ణ స్టూడియోలో భేటీకావాలని భావించారు. అయితే, తాము భేటీకావడం కన్నా..  మంత్రి తలసానిని కలవాలని ఇండస్ట్రీ ప్రముఖులు నిర్ణయించారు. దీంతో పవన్ డెడ్ లైన్ పై ఎలాంటి సమాధనం ఇవ్వనున్నారనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 

డైరెక్టరా.. బ్రోకరా..శ్రీ ఎపిసోడ్‌లో వర్మ ప్లానేంటి?

Submitted by arun on Thu, 04/19/2018 - 13:41

టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. థ్రిల్లర్‌ సీరియల్‌కి ఏమాత్రం తగ్గకుండా కథ ఆసక్తికరంగా నడుస్తోంది. రోజుకో కొత్త పాత్ర ఎంటరవుతుంటే లేటెస్ట్‌గా పొలిటికల్‌ డ్రామా కూడా జతకలిసింది. ఇప్పుడు తాజాగా ఓ బ్రోకర్‌ కూడా వచ్చిచేరాడు. అతనెవరో కాదు ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ. 

ప్రముఖ దర్శకుడి పేరు బయటపెట్టి బాంబు పేల్చిన శ్రీరెడ్డి

Submitted by arun on Mon, 04/02/2018 - 12:57

టాలీవుడ్ లో హీరోయిన్లకు ఎదురవుతున్న లైంగిక వేధింపుల గురించి బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ, సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోంది హీరోయిన్ శ్రీరెడ్డి. తాజాగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములపై ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. ఫేస్ బుక్ ద్వారా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

హోదా పోరులో మేము సైతం..

Submitted by arun on Sat, 03/31/2018 - 10:38

ఏపీ సీఎం చంద్రబాబుకు పలువురు సినీ ప్రముఖులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విభజన హామీల అమలు కోసం సీఎం చేస్తున్న పోరాటానికి బాసటగా ఉంటామని తెలిపారు. ప్రత్యేకహోదా సాధన కోసం తమవంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఏపీకి న్యాయం కోసం కేంద్రంతో సీఎం చంద్రబాబు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలిచేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందుకు వచ్చింది. పలువురు టాలీవుడ్ ప్రముఖులు నిన్న సీఎంతో సమావేశమై సంపూర్ణ మద్దతును ప్రకటించారు.