BJH

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం ....

Submitted by nanireddy on Sat, 07/07/2018 - 18:10

తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య సఖ్యత లేకపోవడం ఆ పార్టీకి తీరని నష్టం కలిగిస్తోంది. ప్రజా సమస్యలపై కలిసి పోరాడాల్సిన నాయకులు విభేదాల కారణంగా ఏకతాటిపై నడవలేకపోతున్నారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన నాయకులు కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమౌతున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న ఈ పరిస్థితి ఇంకా ఎంత కాలం కొనసాగుతుంది ? నాయకులు కలిసికట్టుగా పోరాటం చేసే ఛాన్సే లేదా ? ‌పార్టీ నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఒకరితో ఒకరు కలిసి పనిచేసే వాతావరణమే కరువైంది. ప్రజాసమస్యలపై మూకుమ్మడి పర్యటనలు చేపట్టాల్సిన నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారయ్యారు.