Sports Quota

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

Submitted by arun on Fri, 07/06/2018 - 17:32

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. గత నెల 21న ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.7పై కోర్టు స్టే విధించింది. ఏడాది పాటు ప్రొఫెషనల్ కోర్సుల్లో స్పోర్ట్స్ కోటాను పరిగణనలోకి తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది.ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌-7 వల్ల స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని నీలేరాయ్‌, కాలేశ్రేయ అనే ఇద్దరు స్పోర్ట్స్‌ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది.