fake news

నెటిజ‌న్ల‌ను పిచ్చోళ్ల‌ని చేసిన యువ‌తి

Submitted by arun on Thu, 08/02/2018 - 13:08

బ్రహ్మం గారు చెప్పినట్లే జరిగింది. పంది కడుపున మనిషి జన్మించాడు.’ అనే నకిలీ వార్త సోషల్‌ మీడియాలో విపరీతంగా షేర్‌ అవుతోంది. పంది కడుపున మనిషి శిశువు జన్మించినట్లు చూపుతున్న ఫొటోలు పోస్టుకు జత చేసి నెటిజన్లు షేర్‌ చేసుకుంటున్నారు. అయితే, అవన్నీ తప్పుడు కథనాలు. సిలికాన్‌తో బొమ్మలను తయారు చేసే ఆర్టిస్ట్‌ మగానుకో లైరా అనే యువ‌తి పంది రూపంలో ఉన్న మానవ శిశువును తయారు చేసింది. ప్ర‌స్తుతానికి ఆమె పంది క‌డుపున మ‌నిషి జ‌న్మించిన‌ట్లు త‌యారు చేసిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్ స‌మాజాన్ని భ‌య‌బ్రాంతుల‌కు గురి చేసే ఇలాంటి వార్త‌ల్ని న‌మ్మ‌కండి.

Tags

వాట్సాప్‌కు కేంద్రం హెచ్చరిక

Submitted by arun on Thu, 07/05/2018 - 16:34

వాట్సాప్ వచ్చాక కమ్యూనికేషన్ మరింత తేలికైంది అయితే అంతే తేలికగా తప్పుడు సమాచారం వ్యాపిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వదంతులతో దేశవ్యాప్తంగా అమాయకుల్ని కిడ్నాపర్లుగా భావించి కొట్టి చంపుతున్న ఘటనలపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేయడంతో వాట్సాప్ సంస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇకపై పుకార్లు తేలిగ్గా వ్యాప్తి చేయకుండా కట్టడి చేసేలా చర్యలు తీసుకుంటామని వాట్సాప్ కేంద్రానికి సమాధానం చెప్పింది. ఇంతకీ పుకార్ల వ్యాప్తి అరికట్టేందుకు వాట్సాప్ ఏం చేయబోతోంది.