sonali bendre

సోనాలి బింద్రేకు మాటిచ్చాను: న‌మ్ర‌త‌

Submitted by arun on Wed, 10/31/2018 - 16:28

ఒక‌ప్ప‌టి అందాల తార సోనాలి బింద్రే హైగ్రేడ్ మెటా స్టేటిక్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతుండ‌గా, ప్ర‌స్తుతం న్యూయార్క్‌లో చికిత్స పొందుతుంది. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న‌ `మ‌హ‌ర్షి` షూటింగ్ కూడా ప్ర‌స్తుతం న్యూయార్క్‌లోనే జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ భార్య న‌మ్ర‌త తాజాగా సోనాలీని క‌లిశారు. ఈ విషయాన్ని నమ్రత ఆంగ్ల ‘మీడియా ద్వారా వెల్లడించారు.`సోనాలీతో కాసేపు స‌ర‌దాగా గ‌డిపాను. త‌న అనారోగ్యానికి సంబంధించిన చాలా విష‌యాలు ఆమె నాకు చెప్పారు. కేన్స‌ర్ చికిత్స తీసుకుంటున్న‌ప్ప‌టికీ సోనాలీ చాలా ఫిట్‌గా ఉన్నారు. ఆమె దృఢ‌మైన మ‌హిళ‌. ఆమె నాతో చాలా విష‌యాలు మాట్లాడారు.

ఆ నొప్పిని భరిస్తూ ఏడ్చేశాను: సోనాలి

Submitted by arun on Tue, 10/09/2018 - 17:35

 స్టార్ హీరోయిన్ సోనాలీ బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతూ న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్నారు. సోనాలి పరిస్థితి నిలకడగా ఉందని ఆమె భర్త గోల్డీ బెహెల్‌ ఇటీవల తెలిపారు. కాగా, చికిత్స క్రమంలో చాలా నొప్పిని భరిస్తున్నట్లు ఆమె తాజాగా చెప్పారు. తన ఆవేదనను తెలుపుతూ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. దీంతోపాటు ఓ ఫొటోను షేర్‌ చేశారు.‘కొన్ని నెలలుగా మంచి, చెడు రెండూ అనుభవిస్తున్నా. చికిత్స జరుగుతుండగా కనీసం నా చేతి వేలు కూడా పైకెత్తలేనంతగా తయారయ్యా. శారీరకంగా మొదలైన ఆ నొప్పి కాస్త మానసికంగా కూడా భాధ పెడుతోంది. కీమో థెరపీ, సర్జరీ జరిగిన తర్వాత కనీసం నవ్వినా కూడా నొప్పి వచ్చేది.

సోనాలి బింద్రే చనిపోయిందంటూ బీజేపీ ఎమ్మెల్యే ట్వీట్.. మండిపడుతున్న నెటిజన్లు!

Submitted by arun on Sat, 09/08/2018 - 11:19

క్యాన్సర్ వ్యాధికి గురైన సొనాలి బింద్రే మరణించిందంటూ ట్వీట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్‌కు నెటిజన్లు చుక్కలు చూపించారు. ప్రేమను తిరస్కరించిన అమ్మాయిల్ని కిడ్నాప్‌ చేస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్‌ మరోసారి వార్తల్లోకెక్కారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ సొనాలీ బింద్రే మరణించారంటూ ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సోషల్‌ మీడియాలో అడ్డంగా బుక్కయ్యారు. ‘ హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమను ఏలిన తార.. తన నటనతో ప్రేక్షకులను రంజింపచేసిన అభినేత్రి ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. ఆమెకు శ్రద్ధాంజలి’ అంటూ రామ్‌ కదమ్‌ ట్వీట్‌ చేశారు.

తొలిసారి నీ పక్కన లేను.. సోనాలి బింద్రే భావోద్వేగ పోస్ట్

Submitted by arun on Sat, 08/11/2018 - 16:17

తెలుగు, హిందీ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన సోనాలీ బింద్రే హై గ్రేడ్ కేన్సర్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్నారు. శనివారం తన కుమారుడు రణ్‌వీర్ పుట్టినరోజు సందర్భంగా.. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అతడికి శుభాకాంక్షలు తెలిపారు. 13వ ఏట అడుగుపెడుతున్న తన కొడుకును పొగడ్తలో ముంచెత్తిన సోనాలీ.. తొలిసారి రణ్‌వీర్ పుట్టిన రోజున అతడికి దూరంగా ఉండాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

నాగ్ థాంక్యూ: సోనాలి బింద్రే

Submitted by arun on Fri, 07/06/2018 - 14:47

హై గ్రేడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నానంటూ అభిమానులను, సినీ ప్రముఖులను షాక్‌కు గురిచేశారు బాలీవుడ్‌ నటి సోనాలి బింద్రే. దాంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ ఎంతో మంది సోషల్‌మీడియాలో ట్వీట్లు, పోస్ట్‌లు పెట్టారు. ఈ సందర్భంగా తనకు ట్వీట్లు చేసినవారందరికీ పేరుపేరునా సోనాలి ధన్యవాదాలు తెలిపారు.

సోనాలి బింద్రేకు క్యాన్సర్

Submitted by arun on Thu, 07/05/2018 - 13:33

అనారోగ్యంపై నీ పోరాటం,

జీవించాలనె నీ ఆరాటం,

నీ ధైర్యమే నీ ఆయుధంగా,

నీ ఆత్మస్థైర్యమే నీ ఆయువుగా,

నీవు నిలవాలని, నీవు గెలవాలని,

ఆశిస్తున్నాం సోనాలీ! శ్రీ.కో

క్యాన్సర్‌తో పోరాడుతున్న సోనాలి బింద్రే..‌..

Submitted by arun on Wed, 07/04/2018 - 14:11

సోనాలీ ఫ్యాన్స్‌కు ఇది షాకింగ్‌ న్యూస్‌. నిజంగా వెరీ బ్యాడ్‌ న్యూస్‌. తన అందాలతో  టాలీవుడ్‌, బాలీవుడ్‌‌ను ఊపేసిన సోనాలి ఉన్నట్టుండి ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటపెట్టింది. తాను హై గ్రేడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సోనాలీ బింద్రే ట్విట్‌ చేసింది. వైద్యుల సలహా మేరకు హైగ్రేడ్‌ క్యాన్సర్‌కు చికిత్స చేయించుకునేందుకు న్యూయార్క్‌కు వెళ్తున్నట్లు సోనాలీ బింద్రే తన ట్విట్టర్‌లో తెలిపింది. క్యాన్సర్‌ చికిత్సలో ఎదురయ్యే ప్రతి సవాల్‌ను ధైర్యంగా ఎదుర్కొంటానని చెప్పింది. క్యాన్సర్ విషయం తెలియగానే కుటుంబసభ్యులు, సన్నిహతులు తనకు సపోర్ట్ చేశారని తెలిపింది.