twitter

సోషల్ మీడియాకు అనసూయ గుడ్‌ బై

Submitted by arun on Wed, 02/07/2018 - 12:36

ప్రముఖ యాంకర్‌ అనసూయ సోషల్ మీడియాకు గుడ్‌ బై చెప్పేసింది. రీసెంట్‌గా ఓ కుర్రాడు అన‌సూయతో సెల్ఫీ దిగేందుకు ప్ర‌యత్నించ‌గా, ఆమె సెల్ ప‌గ‌ల‌గొట్టింద‌ట‌. దీనిపై పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా బుక్ అయింది. ఈ నేప‌ధ్యంలో అన‌సూయ‌కి భారీ ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. నెటిజ‌న్స్ త‌మ‌కి న‌చ్చిన స్టైల్‌లో అన‌సూయ‌కి క్లాస్ పీకారు. క్లారిటీ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికి వారు శాంతించక‌పోవ‌డంతో సోష‌ల్ సైట్స్ నుండి అన‌సూయ త‌ప్పుకున్న‌ట్టు తెలుస్తుంది. ట్వీటర్‌తో పాటు ఫేస్‌ బుక్‌లో కూడా అనసూయ అకౌంట్ కనిపించటం లేదు. నెటిజెన్ల నుంచి విమర్శలు రావటం వల్లే అనసూయ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

అసభ్యకరమైన ఫోన్‌ కాల్స్ వస్తున్నాయి

Submitted by arun on Fri, 01/26/2018 - 17:23

ప్రముఖ యాంకర్‌, నటి అనసూయకు కొంతకాలంగా అసభ్యకరమైన ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయట. భారతదేశంలో ఓ మహిళకున్న స్వేచ్ఛ ఇదేనా? అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. భారతదేశంలో మహిళలకు ఎలాంటి భద్రత, గౌరవం లేదంటూ ట్విటర్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు.

‘లావణ్య త్రిపాఠిని అరెస్ట్ చేయండి’

Submitted by arun on Thu, 01/25/2018 - 14:10

టాలీవుడ్ లో దూసుకుపోతున్న యువనటి లావణ్య త్రిపాఠిని అరెస్ట్‌ చేయాలంటూ ఓ అభిమాని సంచలన వ్యాఖ్య చేశాడు. అయితే ఈ వ్యాఖ్య వెనుక ఆ అభిమాని అంతులేని అభిమానం ఉంది.సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఆమె నటించిన ‘ఇంటెలిజెంట్‌’ సినిమాను లావణ్య తన సోషల్ మీడియా ఖాతాల్లో ప్రమోట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమానికి వెళ్లిన లావణ్య పసుపు రంగు గౌనులో దిగిన ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేసింది. దీనికి వరుణ్‌ అనే అభిమాని ఆమెకు ట్యాగ్ చేస్తూ, ‘అందంగా ఉండటం నేరమైతే ఇప్పటికిప్పుడే లావణ్యను అరెస్ట్‌ చేయండి. ఆమె తన అందంతో చంపేస్తోంది’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి వెంటనే లావణ్య రిప్లై ఇచ్చింది. ‘హా.. హా..

ట్వీట్ల పిట్టలు...మోతెక్కి పోతున్న ట్విట్టర్ పేజీలు

Submitted by arun on Mon, 01/22/2018 - 13:21

ప్రపంచం మారిపోతోంది.. నచ్చిన అంశాన్ని.. అప్పటికప్పుడు షేర్ చేసేసుకోడానికి సోషల్ మీడియా వేదికగా మారుతోంది.. సంతోషం, విషాదం.. ఆక్రోశం, ఆవేశం.. ఏదయితేనేం.. షేర్ ఇట్ విత్ పీపుల్.. రాజకీయ నాయకులు, సినీతారలు, సెలబ్రిటీలు అందరూ వినియోగించే ఒకే ఒక్క సాధనం ట్విట్టర్.. ఈ సెలబ్రిటీల కూతలతో..  ట్విట్టర్ పేజ్ లు  కిచకిచ లాడిపోతున్నాయ్.. ఇంతకీ ఏ లీడర్ ఫాలోయింగ్ ఎంత? 

నోరు మూసుకునే అవసరం లేదు: కత్తి మహేష్

Submitted by arun on Sat, 01/20/2018 - 10:58

తనపై కోడిగుడ్లతో దాడి చేసిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై పెట్టిన పోలీస్ కేసును ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో, పవన్ ఫ్యాన్స్ కు, మహేష్ కు మధ్య నెలకొన్న వివాదం ముగిసిపోయినట్టే అని అందరూ భావిస్తున్నారు. కార్యకర్తలు సంయమనంతో ఉండాలని జనసేన కార్యాలయం నుంచి కూడా అధికారికంగా సందేశం వచ్చింది. అంతేకాదు, ఫిలిం నగర్ లో నిన్న రాత్రి కత్తి మహేష్, పవన్ ఫ్యాన్స్ పార్టీ చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది.
 

అమిత్‌షాకి షాకిచ్చిన మంచు లక్ష్మీ

Submitted by arun on Tue, 12/19/2017 - 15:56

హోరా హోరీగా సాగిన గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి వరుసగా ఆరోసారి అధికారం దక్కించుకుంది.గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా గుజ‌రాత్ అసెంబ్లీ సీట్లు భారీగా త‌గ్గిపోవ‌డంతో ప్ర‌ధాని మోదీ, బీజేపీ అధ్య‌క్షుడు న‌రేంద్ర‌మోదీ కాస్త ఇబ్బంది ప‌డుతున్నారు. వ‌రుసగా ఆరోసారి గుజ‌రాత్‌లో విజ‌య‌ఢంకా మోగించిన‌ప్ప‌టికీ సీట్ల సంఖ్య త‌గ్గ‌డం వారికి మింగుడుప‌డ‌డం లేదు. గుజ‌రాత్‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ 99 స్థానాలను గెలుచుకున్న విష‌యం తెలిసిందే.
 

2019 వరల్డ్‌కప్ ఫిక్స్‌డ్ : వివాదంలో ధోనీ

Submitted by lakshman on Fri, 12/15/2017 - 11:33

మహేంద్రసింగ్ ధోనీ వివాదంలో చిక్కుకున్నాడు. ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన ఎనిమిదేళ్లలో కేవలం మూడు సార్లే ట్వీట్స్ కు లైక్ చేశాడు. వాటిలో 2013 రాజ్ దీప్ సర్దేశాయ్ ట్వీట్, 2014 డిసెంబర్ 31 బీసీసీఐ ట్వీట్ లైక్ కొట్టాడు. అవి ఎలా ఉన్నా దాదాపు మూడేళ్ల తర్వాత  ఓ ట్వీట్ కు ధోనీ లైక్ చేయడం వివాదాస్పదమైంది.  ఇన్‌ఖబర్ అనే న్యూస్ ఛానల్ '2019 వరల్డ్‌కప్ ఫిక్సయింది.. ఈసారి అది పక్కాగా ఇండియాకే' అని తన అకౌంట్ లో ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ కు ధోనీ లైక్ కొట్టడం చర్చాంశనీయంగా మారింది.

త్రిష‌ని అంత‌మంది ఫాలో అవుతున్నారు

Submitted by nanireddy on Sat, 09/23/2017 - 17:34

'వ‌ర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దాంటానా', 'అత‌డు', 'ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే' చిత్రాల‌తో తెలుగువారికి చేరువైన చెన్నై సుంద‌రి త్రిష‌. తెలుగుతో పాటు త‌మిళంలోనూ స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఈ ముద్దుగుమ్మ‌.. 'నాయ‌కి' త‌రువాత మ‌ళ్లీ మ‌రో తెలుగు చిత్రానికి సంత‌కం చేయ‌లేదు. అయితే త‌మిళంలో మాత్రం అర‌డ‌జ‌ను చిత్రాల‌తో ఫుల్ బిజీగా ఉంది.