Lord Sri Ram

రామాయణంలో వివాదాల వేట....అసలు కత్తి మహేష్ ఏమన్నాడు? ఎందుకీ రచ్చ?

Submitted by arun on Tue, 07/03/2018 - 15:11

వింటే రామాయణం వినాలి తింటే గారెలు తినాలన్నారు పెద్దలు. వీనులవిందైన, హృదయానికి హత్తుకునే గాథ, రామాయణ గాథ. భారతీయుల  గుండెను తడిమే మహాకావ్యం రామాయణం. పరిపూర్ణ మానవుడు ఎలాఉండాలో చూపిన పురుషోత్తముడు రాముడు. అటుంటి మహాకావ్యంపై తెలుగు రాష్ట్రాల్లో అనవరసర చర్చ కాదుకాదు రచ్చ జరుగుతోంది. భావప్రకటనా స్వేచ్చ అంటూ కత్తి మహేష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తమ మనోభావాలను దెబ్బతిన్నాయంటూ హిందూ సంప్రదాయవాదులు కేసులుపెట్టడం, సోషల్ మీడియాలో తిట్ల దండకం అందుకోవడం ఇప్పుడు, తెలుగు స్టేట్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. అసలు కత్తి మహేష్ ఏమన్నాడు? ఎందుకీ రచ్చ?