Priyanka Chaturvedi

ప్రియాంక విషయంలో పప్పులో కాలేసిన కాంగ్రెస్!

Submitted by arun on Fri, 07/13/2018 - 15:59

భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ పప్పులో కాలేసింది. పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేదిని ఓ ట్వీట్‌కు జత చేయబోయిన కాంగ్రెస్‌ గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రాను ట్యాగ్‌ చేసింది. రైతులకు భూసారంపై నివేదికలు ఇచ్చే భూసార పరీక్షా కేంద్రాలపై మోదీ అబద్ధాలు చెబుతున్నారంటూ గురువారం కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ‘‘భూసార పరీక్షా కేంద్రాలపై కూడా మోదీ అబద్ధాలు చెబుతున్నారు. యూపీఏ హయాంలో మొత్తం 1141 భూసార పరీక్షా కేంద్రాలు ఉన్నాయి...’’ అంటూ ప్రియాంక చతుర్వేది బదులు ప్రియాంక చోప్రా చెబుతున్నట్టుగా ట్యాగ్ చేశారు.

నీ కూతుర్ని రేప్ చేస్తా.. ఒక్కసారి పంపిస్తావా..: కాంగ్రెస్ నేత ప్రియాంకకు బెదిరింపులు

Submitted by arun on Mon, 07/02/2018 - 18:05

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేదికి ట్విట్టర్ వేదికగా బెదిరింపులు వచ్చాయి. ప్రియాంక చతుర్వేది కూతురును రేప్ చేస్తామని గిరీష్‌కే1605 అనే హ్యాండిల్ నుండి ట్వీట్ వచ్చింది. ఈ విషయమై ప్రియాంక చతుర్వేది ముంబై పోలీసులకు  ఫిర్యాదు చేసింది. అయితే ఈ ట్వీట్‌ను సంబంధించిన వివరాలను ఆమె ముంబై పోలీసులకు అందించారు.ఈ విషయమై  తగు చర్యలు తీసుకొంటామని పోలీసులు  హమీ ఇచ్చారు.ఈ ట్వీట్ చేసిన వ్యక్తి ట్విట్టర్లో రాముడి ఫోటోతో పాటు జై శ్రీరామ్ అనే నినాదాలు రాసి ఉన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. గిరీష్‌కేకు ప్రియాంక చతుర్వేదీ ఘాటుగానే రిప్లై ఇచ్చారు.