Madhya Pardesh

వేదిక నుంచి జారిపడ్డ సీఎం

Submitted by arun on Fri, 07/27/2018 - 11:35

మధ్య ప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వేదిక నుంచి జారి పడిపోయారు. తన 'జన ఆశీర్వాద్‌ యాత్ర'లో భాగంగా నిన్న రాత్రి ఛటర్‌ పూర్‌ జిల్లా చంద్లాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, తన ప్రసంగం తరువాత వేదిక దిగుతూ కాలుజారి దబ్బున కిందపడ్డారు. వేదిక నుంచి దిగుతున్న ఆయన మెట్లను గమనించక పోవడంతోనే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఆయన పడుతుంటేనే అప్రమత్తమైన కార్యకర్తలు, భద్రతా సిబ్బంది పూర్తిగా కింద పడిపోకుండా పట్టుకున్నారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

దారుణం : అద్దెకు భార్యలు!

Submitted by arun on Mon, 07/02/2018 - 12:10

దేశంలోని పలు రాష్ట్రాల్లో పలు రకాలైన సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి జిల్లాలోని దధీచ ప్రాత అనే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ ఆచారం ప్రకారంగా తన భార్యను ఇతర వ్యక్తులకు భర్త విక్రయించుకొనే వెసులు బాటు ఉంది. స్టాంపు పేపర్‌పై ఇరు వర్గాల మధ్య  ఒప్పందం కుదుర్చుకొంటే సరిపోతోంది. ఈ ఒప్పందంలో భార్యను విక్రయించిన భర్తకు ఎంత ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తే అంత ఎక్కువ కాలం కొనుగోలుదారుడి వద్ద ఉంచుకొనే వెసులుబాటు ఉంటుంది. ఈ ఒప్పందాన్ని అధికారికంగా నిర్ధారించడానికి రూ.10 నుంచి రూ.100 వరకూ ఉన్న స్టాంపు పేపర్లపై ఇరు వర్గాలు సంతకం చేస్తాయి.