Dharmapuri Srinivas

డీఎస్‌ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌

Submitted by arun on Wed, 09/05/2018 - 09:11

తెలంగాణ రాష్ట్ర సమితి తనపై కక్ష కట్టిందంటున్నారు డీఎస్‌. ఈ మేరకు పార్టీ అధిష్ఠానికి బహిరంగ లేఖ రాశారు. తాను పార్టీలో ఉండటం ఇష్టం లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని లేఖలో కోరారు. తాను పార్టీని వదిలితే కవిత చేసిన ఆరోపణలు నిజమవుతాయని చెప్పారు. తనంతట తానుగా పార్టీకి రాజీనామా చేయనని దయచేసి సస్పెండ్ చేయాలని లేఖ రాశారు.

ఎవరితో సహజీవనం చేయడం లేదు : డీఎస్‌ కుమారుడు

Submitted by arun on Fri, 08/03/2018 - 11:57

తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్‌ ఖండించారు. కొందరు బాధిత అమ్మాయిలు హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేయడంపై స్పందించిన ఆయన... నాపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. శాంకరి నర్సింగ్‌ కాలేజీ వేరే వాళ్లకు ఇచ్చాము. అక్కడికి నేను వెళ్ళలేదు. అడ్మిషన్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ కాలేజీలో ఎవరు చదువుతున్నారో కూడా తెలియదు. నాకు భార్య పిల్లలు ఉన్నారు. ఎవరితో సహజీవనం చేయడం లేదు. ఎవరో విద్యార్థినులతో అలా చెప్పించారు. రాజకీయంగా దెబ్బ తీయడానికే ఇవన్నీ జరుగుతున్నట్టు అనిపిస్తుంది.

ప్రత్యర్థులపై పైచేయి సాధించిన బాజిరెడ్డి గోవర్ధన్...ఆ ఇద్దరిని తప్పించడంలో కీలకపాత్ర

Submitted by arun on Sat, 06/30/2018 - 12:13

అప్పుడూ, ఇప్పుడూ ఆ ఇద్దరూ ఒకే జెండా నీడలో ఉన్నారు ఒకే సామాజిక వర్గమైనా ఎప్పడూ ఉప్పు నిప్పులాగే మెలిగారు. ప్రత్యర్థులుగా ఉన్నా అనుకోని పరిస్థితుల్లో ఒకరి వెంట ఒకరు గులాబీ గూటికి చేరారు. అక్కడా వారి మధ్య ఆధిపత్యం పోరు తీవ్రమైంది. దీంతో తనకంటే సీనియర్ నేతగా ఉన్న ఆ ప్రత్యర్థిని కారు నుంచి కిందకి దింపేందుకు ఇంకోనేత వేసిన స్కెచ్ ఫలించింది. ఇంతకీ ఆ నేతలెవరు..? వారి మధ్య ఉన్న విభేదాలేంటి...?