Asha workers

వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులకు ప్రభుత్వం వరాలజల్లు

Submitted by arun on Sun, 09/02/2018 - 15:17

వైద్యారోగ్యశాఖ సిబ్బంది పైనా వరాలు కురిపించింది తెలంగాణ సర్కార్. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రి వర్గ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలుకీలక అంశాలపై చర్చలు జరిపినట్లు తెలియవచ్చింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో రెండు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 27,045 మంది  ఆశా వర్కర్ల గౌరవేతనాన్ని 6వేల నుంచి 7,500కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు.

ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు వరాలు

Submitted by arun on Sat, 06/30/2018 - 10:55

ఆశా వర్కర్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు వరాల వర్షం కురిపించారు. కనీస వేతనం 3 వేల రూపాయలుగా నిర్ణయించడంతో పాటుగా పనితీరును బట్టి 8 వేల రూపాయల వరకూ వేతనం పొందే వీలు కల్పించారు. స్మార్ట్ ఫోన్లు ఇస్తామన్నారు. సీఎం ప్రకటించిన వరాలపై ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.