nani

నానికే దొరకని ‘ఎంసీఏ’ టికెట్స్ ..!

Submitted by arun on Fri, 12/22/2017 - 15:31

నేచురల్‌ స్టార్‌ నాని ఈ ఏడాది మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. మొదటి రెండు సినిమాలు భారీ విజయాలను తెచ్చిపెట్టాయి. మూడవ సినిమాగా 'మిడిల్ క్లాస్ అబ్బాయి'తో నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో నటన పరంగా నాని మంచి మార్కులు కొట్టేశాడనే టాక్ వినిపిస్తోంది. ఎంసీఏ సినిమాలో విలన్ గా చేసిన నటుడు నానిని ఓ మూడు టికెట్లు అడిగాడట. దాంతో థియేటర్ మేనేజర్ కి ఫోన్ చేశాడట నాని .. ఫోన్ రింగ్ అవుతున్నా, ఎంత సేపటికీ ఆయన ఫోన్ తీయలేదు. కొద్ది సేపటి తరువాత రిసీవ్ చేసుకుని .. తాను టికెట్లు అడగ్గానే "ఇప్పుడు అడగొద్దు సార్" అని థియేటర్ ఓనర్ అన్నాడని నాని చెప్పుకొచ్చాడు.

ఆ విషయం భూమికగారికి చెబితే నవ్వుకుంది: నాని

Submitted by arun on Wed, 12/20/2017 - 13:16

నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం 'ఎంసీఏ' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిన్న మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, ఓ ఆసక్తికర విషయం తెలిపాడు. భూమిక నాకు వదినగా నటిస్తున్నారని తెలిసినప్పుడు చాలా ఎగ్జైట్‌ అయ్యా. ఎందుకంటే.. ‘‘ఖుషి’’ సినిమా టికెట్స్‌ కోసం లైన్‌లో ఉండకుండా సెపరేట్‌ లైన్‌ క్రియేట్‌ చేసినందుకు పోలీసులు నన్ను చితక్కొట్టారు. ఆ విషయం భూమికగారితో చెబితే ఆవిడా చాలా నవ్వుకుంది. ఈ సినిమా పూర్తయ్యేలోపు ఆవిడ నాకు వదినలా మారిపోయింది. వాళ్ళబ్బాయి కోసం షాపింగ్‌ చేసేప్పుడు మా అబ్బాయికీ టాయ్స్‌ కొని తెచ్చేవారని చెప్పాడు.

'c/o సూర్య‌'పై నాని కేర్‌

Submitted by nanireddy on Sat, 09/23/2017 - 19:41

యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ న‌టిస్తున్న ద్విభాషా చిత్రం 'c/o సూర్య‌'. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి 'నా పేరు శివ' ఫేమ్ సుశీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్‌ని నేచుర‌ల్ స్టార్ నాని ఈ సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు త‌న ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ ఖాతాల ద్వారా విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని సందీప్ కిష‌న్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో చెప్పుకొచ్చారు.

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ @ 10

Submitted by nanireddy on Sat, 09/23/2017 - 13:24

నేచుర‌ల్ స్టార్ నానికి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. దానికి తోడు 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్' నుంచి 'నిన్ను కోరి' వ‌ర‌కు వ‌రుస‌గా ఆరు విజ‌యాల‌ను సొంతం చేసుకుని 'డబుల్ హ్యాట్రిక్ హీరో' అనే పేరు కూడా సంపాదించేశాడు. ప్ర‌స్తుతం నాని 'ఎం.సి.ఎ', 'కృష్ణార్జున యుద్ధం' చిత్రాలు చేస్తున్నాడు.

విశేష‌మేమిటంటే.. ఈ రెండు చిత్రాల్లోనూ కేర‌ళ కుట్టిలే హీరోయిన్‌గా న‌టించ‌డం. 'ఎం.సి.ఎ'లో 'ఫిదా' ఫేమ్ సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తుంటే.. 'కృష్ణార్జున యుద్ధం'లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తోంది. ఈ ఇద్ద‌రూ కూడా మ‌ల‌యాళ చిత్రం 'ప్రేమ‌మ్‌'తో ప‌రిచ‌య‌మైన క‌థానాయిక‌లే కావ‌డం విశేషం.  

అను..ఐదు విజ‌యాలు..

Submitted by nanireddy on Sun, 09/17/2017 - 16:20

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో బిజీగా ఉన్న క‌థానాయిక‌ల్లో అను ఇమ్మానియేల్ ఒక‌రు. నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన 'మ‌జ్ను' చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన అను.. ఆ త‌ర్వాత 'కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌'తో మ‌రో హిట్‌ని త‌న ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రంలోనూ.. అల్లు అర్జున్ 'నా పేరు సూర్య‌'లోనూ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎన్టీఆర్‌తో త్రివిక్ర‌మ్ రూపొందించ‌నున్న సినిమాలోనూ అనునే హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశ‌ముంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

సాయిప‌ల్ల‌వి హ‌వా

Submitted by nanireddy on Thu, 09/14/2017 - 19:02

'ఫిదా' చిత్రంలో భానుమ‌తి పాత్ర‌లో జీవించేసింది సాయిప‌ల్ల‌వి. ఆ సినిమా ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో తెలుగునాట ఈ ముద్దుగుమ్మ‌కి మంచి క్రేజ్ వ‌చ్చింది. ప‌ర్య‌వ‌సానంగా.. త‌మిళంలో, మ‌ల‌యాళంలో ఆమె చేసిన‌, చేస్తున్న సినిమాల‌ను తెలుగులో కూడా విడుద‌ల చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు ఇక్క‌డి నిర్మాత‌లు.  ఈ నాలుగు నెల‌ల్లో సాయి ప‌ల్ల‌వి న‌టించిన  మ‌రో మూడు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.

నాని, నాగార్జున కాంబినేష‌న్లో శ్రీరామ్ ఆదిత్య మ‌ల్టీస్టార‌ర్

Submitted by lakshman on Tue, 09/12/2017 - 16:02
టాలీవుడ్‌లో బ‌డా హీరోల‌ మ‌ల్టీస్టారర్స్ వ‌చ్చి చాలాకాల‌మే అయింది. శ‌మంత‌క‌మ‌ణిలో న‌లుగురు హీరోలు క‌లిసి న‌టించిన‌ప్ప‌టికీ చిన్న సినిమా కావ‌డంతో సినిమా హిట్ట‌యింది కానీ ఆ కాంబినేష‌న్‌కు ఆశించినంత పేరు రాలేదు. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు త‌ర్వాత ఆ స్థాయి మ‌ల్టీస్టార‌ర్ తెలుగులో...