banjarahills

హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ ఎదుట కలకలం

Submitted by arun on Wed, 08/15/2018 - 15:19

హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. అన్న తనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడన్న మనస్తాపంతో తమ్ముడు ఆత్మహత్యాయత్నం చేశాడు . పోలీస్ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు మంటలు ఆర్పేసి అతనిని ఆస్పత్రికి అతరలించారు. బాధిత యువకుడికి శరీరమంతా కాలిపోయింది. 80 శాతం కాలిన గాయాలతో అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
 

బంజారాహిల్స్‌లో దారుణం..

Submitted by arun on Fri, 06/29/2018 - 17:22

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. బంజారాహిల్స్‌లో సమీరా అనే యువతిని ఓ యువకుడు కిడ్నాప్ చేశాడు. పబ్‌లో ఉండగా యువతిపై బ్లేడ్‌తో దాడి చేసి కిడ్నాప్‌కు పాల్పడ్డాడు. ఇందుకు అతని గర్ల ఫ్రెండ్ కూడా సహకరించింది. కిడ్నాప్ అనంతరం తన ఇంట్లో యువతిని నిర్భంధించాడు. కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫిరోజ్‌, అతని గర్ల్‌ ఫ్రెండ్‌ కీర్తి  కిడ్నాప్‌కు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఇరువురిపై పలు సెక్లస్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.