allu arjun

పవన్‌కు మద్దతు తెలిపేందుకు ఫిలించాంబర్‌కు అల్లు అర్జున్!

Submitted by arun on Fri, 04/20/2018 - 12:32

'చెప్పను బ్రదర్' అంటూ గతంలో ఓ ఫంక్షన్ లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏ సందర్భంలో కూడా పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ లు కలవలేదు. ఏ ఫంక్షన్ లోనూ ఇద్దరూ కలసి కనిపించలేదు. ఈరోజు వీరిద్దరినీ మళ్లీ కలిపింది. పవన్ కల్యాణ్, నాగబాబు చాంబర్‌కు చేరుకున్న సమయంలోనే అల్లుఅర్జున్ కూడా రావడంతో మెగా ఫ్యామిలీకి మద్దతుగా బన్నీ వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఫిలించాంబర్‌లోని ఓ హాల్‌లో నాగబాబు, పవన్ కల్యాణ్ కలిసి న్యాయవాదులతో చర్చిస్తుంటే.. అల్లు అర్జున్ మాత్రం బయటే ఉన్నట్లు తెలిసింది.

నాదీ జనసేనే..కానీ..! : అల్లు అర్జున్

Submitted by arun on Mon, 04/09/2018 - 14:23

మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పడు అల్లు అర్జున్, రామ్ చరణ్ లు ఆ పార్టీ కోసం ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు రాజకీయాల గురించి అల్లు అర్జున్ మాట్లాడలేదు. చిరంజీవిది ఏ పార్టీ అయితే తనదీ అదే పార్టీ అని చెబుతూ ఉన్నాడు. మరోవైపు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించినప్పటి నుంచి ఇంత వరకు ఆ పార్టీపై బన్నీ స్పందించలేదు. తాజాగా ఓ ఇటర్వ్యూలో బన్నీకి దీనికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

అల్లు అర్జున్ నా పేరు సూర్య పోస్టర్ ఇంపాక్ట్

Submitted by arun on Thu, 03/01/2018 - 18:05

అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. ఇందులో ఆయ‌న ఆర్మీ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ తొలిసారిగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ సినిమా.. వేస‌వి సంద‌ర్భంగా మే 4న తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే.. జ‌న‌వ‌రి 1న ఈ సినిమా ఫ‌స్ట్ ఇంపాక్ట్‌ను విడుద‌ల చేసిన చిత్ర బృందం..ఈ రోజు (గురువారం) పోస్ట‌ర్ ఇంపాక్ట్‌ను విడుద‌ల చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌లైన స్టిల్స్‌కు భిన్నంగా ఉంది ఈ పోస్ట‌ర్ ఇంపాక్ట్‌.

వారియ‌ర్ ను స్పూఫ్ చేసిన బ‌న్నీ

Submitted by arun on Sat, 02/24/2018 - 16:34

ఇటీవల సంచలనం సృష్టించిన మలయాళ చిత్రం ఒరు ఆదార్‌ లవ్‌ లోని ఓ సన్నివేశం నాకు బాగా నచ్చిందంటూ బన్నీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సన్నివేశానికి స్పూఫ్‌ చేశాడు స్టైలిష్ స్టార్‌. హీరోయిన్‌ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ చేసినట్టుగానే చేతితో తన కొడుకును షూట్‌ చేయటం, బన్నీ కొడుకు అయాన్ అమాంతం బెడ్ మీద పడిపోవటాన్ని వీడియో తీసిన స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు స్టైలిష్ స్టార్‌ ఫ్యాన్స్‌ నుంచి సూపర్బ్‌ రెస్పాన్స్‌ వస్తోంది.
 

స్టైలిష్ ను ఎలా మ‌రిచి పోగ‌ల‌ను

Submitted by lakshman on Sat, 02/17/2018 - 00:31

ప్రియా ప్రకాశ్ వారియర్ 20 సెక‌న్ల వీడియోలో ఆమె చూసిన చూపు దేశ వ్యాప్తంగా ఆస‌క్తిక‌రంగా మారింది. ‘ఒరు ఆధార్ లవ్’ చిత్రంలోని ఓ పాటలో క‌న్ను గీటిన వారియ‌ర్ అభిమానుల్ని ఫిదా చేసింది. దీంతో ఓవ‌ర్ నైట్ స్టార్ డంను సంపాదించింది. ఏ అభిమాని, ఏ ఇండ‌స్ట్రీ అయినా యాక్ట‌ర్ల‌తో సంబంధం లేకుండా వారియ‌ర్ ను ఇష్ట‌ప‌డేందుకు వెనుకాడ‌డంలేదు. 
అంతేకాదు ఇటీవలే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ అమ్మాయి చూపులకు పడిపోయి ‘ఈ మధ్య కాలంలో ఇంత క్యూటెస్ట్ వీడియోని నేనసలు చూడలేదు. సింప్లిసిటీకి ఉన్న పవరే ఇది. నాకు బాగా నచ్చింది’ అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

న‌లుగురు హీరోల‌తో జ‌క్క‌న్న సినిమా..?

Submitted by lakshman on Sat, 02/03/2018 - 13:03

డైర‌క్ట‌ర్ రాజ‌మౌళి కొత్త సినిమాపై అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాహుబ‌లి సినిమా విడుద‌లై 10నెల‌లు అవుతున్నా కొత్త సినిమా ఊసెత్త‌లేదు. అయితే రాజ‌మౌళి డైర‌క్ష‌న్ లో డీవీవీ దానయ్య నిర్మాత గా మల్టీస్టారర్ సినిమా తెరెక్కుతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అందుకు ఊతం ఇచ్చేలా రాజ‌మౌళి, ఎన్టీఆర్ , రాంచ‌ర‌ణ దిగిన ఫోటో ఒక‌టి నెట్టింట్లో హాట్ గాపిగ్గా మారింది. దీనికి తోడు ఈ మ‌ల్టిస్టార‌ర్ లో ర‌వితేజ విల‌న్ యాక్ట్ చేస్తార‌ని టాక్ . ఇప్పుడు వీటికి తోడుగా అల్లు అర్జున్ కూడా ఇందులో కీలకమైన ఒక క్యామియో చేస్తాడనే టాక్ ఊపందుకుంది. 
 

నాపేరు సూర్య.. హాలీవుడ్ కాపీనా?

Submitted by arun on Mon, 01/29/2018 - 14:44

టాలీవుడ్ లో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కాపీ అనే పదం బాగా వినిపిస్తోంది. పెద్ద దర్శకులు రచయితలే అలాంటి పొరపాట్లు చేస్తుండడంతో చిత్ర పరిశ్రమపై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత ఏడాది డ్రగ్స్ వివాదం ఎలా అయితే టాలీవుడ్ కు మచ్చ తెచ్చిందో ఇప్పుడు కాపీ అనే పదం కూడా విమర్శలకు బాస్ ఇస్తోంది. గత కొంత కాలంగా ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నా ఎక్కువగా హైలెట్ కాలేదు. కానీ ఎప్పుడైతే అజ్ఞాతవాసి ఫ్రెంచ్ మూవీ ఆధారంగా తెరకెక్కిందని వార్తలు వచ్చాయో అప్పటి నుంచి నెక్స్ట్ సినిమాలు కూడా అదే తరహాలో రాబోతున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

బన్నీ మాత్రం చెప్పలేదు బ్రదర్‌!

Submitted by arun on Tue, 01/23/2018 - 13:03

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన ప్రజా యాత్రను సోమవారం ప్రారంభించారు. నిన్న జనసేన కార్యాలయం నుంచి కొండగట్టుకు బయలుదేరారు. ఆంజనేయస్వామి దర్శనానంతరం కరీంగనగర్‌ చేరుకున్న పవన్‌ విలేకర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘నేను భారతీయుడిని. నా మాతృభూమిని జాగ్రత్తగా చూసుకుంటాను.’అన్నారు. పవన్‌ యాత్ర ప్రారంభించిన సందర్భంగా మెగా బ్రదర్లు ట్విటర్‌ వేదికగా ఆయనకి మద్దతు తెలిపారు.

‘నేను భారతీయుడిని. నా మాతృభూమి జాగ్రత్తగా చూసుకుంటాను.’ చలోరే చలోరే చల్‌ కార్యక్రమం ఉత్సాహంగా మొదలైంది. బాబాయ్‌..ఆల్‌ ది బెస్ట్‌. జై జనసేన’- రామ్‌చరణ్‌

‘ఆల్‌ ది బెస్ట్‌ బాబాయ్‌.’- వరుణ్‌ తేజ్‌

హలో మూవీతో షాకిచ్చిన డైరెక్టర్ విక్రమ్ కుమార్.. విక్రమ్ కుమార్ ను దూరం పెట్టే యోచనలో ఎన్టీఆర్,బన్నీ

Submitted by arun on Thu, 01/04/2018 - 16:38

మనం, సూర్య 24 మూవీతో టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు విక్రమ్ కుమార్. ఆ నమ్మకంతోనే నాగార్జున అఖిల్ రెండో మూవీని విక్రమ్ కుమార్ చేతిలో పెట్టాడు. కానీ హలో మూవీ ఫలితంతో అఖిల్ సీన్ మరోసారి రివర్సైంది. దీంతో హలో మూవీ కంటే ముందు విక్రమ్ కుమార్ తో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిన టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, బన్నీ ఇప్పుడు దూరం పెడుతున్నారు. అతని పేరు చెబితేనే ఆమాడ దూరం పరిగెత్తుతున్నారు.

తెర‌పైకి చిరు చిన్న‌ల్లుడు?

Submitted by nanireddy on Sat, 09/23/2017 - 15:23

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి మ‌రో కొత్త హీరో తెరంగేట్రం చేయ‌నున్నాడా? అవున‌నే వినిపిస్తోంది టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో. చిరు త‌రువాత నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అల్లు అర్జున్‌, రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు శిరీష్‌, వెంక‌ట్ రాహుల్ ('అలియాస్ జాన‌కి' ఫేమ్‌), సాయిధ‌ర‌మ్ తేజ్‌, వ‌రుణ్‌తేజ్ తెలుగు తెర‌పై సంద‌డి చేశారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మ‌రో పేరు చేరుతోంది. ఈ సారి చిరంజీవి చిన్న‌ల్లుడు, శ్రీజ భర్త క‌ళ్యాణ్ తెరంగేట్రం చేయ‌నున్నార‌న్న‌ది తాజాగా వినిపిస్తున్న వార్త‌.