bigboss house

బిగ్‌బాస్ హౌస్‌లోకి యాంకర్‌ ప్రదీప్.. అసలు నిజం ఇదేనట!

Submitted by arun on Fri, 07/20/2018 - 10:51

ప్రస్తుతం బుల్లితెర అంటే ప్రదీప్.. ప్రదీప్ అంటే బుల్లితెరగా మారిపోయింది. ప్ర‌దీప్ చేసే షోల‌కు వ‌చ్చే రేటింగ్ చెప్ప‌న‌క్క‌ర‌లేదు. చాలా షోస్‌లో ప్రదీప్ యాంకర్‌గా ఉన్నాడు. ఇతని యాంకరింగ్‌కి అభిమానులు ఓ రేంజ్‌లో ఉన్నారు. ప్రదీప్ ఉంటే షో 100 శాతం హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇటీవల బిగ్‌బాస్ షోలో ఓ ప్రోమో చూశాం. ప్రదీప్ షోలోకి ఎంట్రీ ఇవ్వడం. ప్రోమోలో చెప్పినట్టుగానే ప్రదీప్ నిన్న బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టాడు. స్టార్ యాంకర్‌గా ఫుల్ బిజీగా ఉండే ప్రదీప్...షోలోకి రావడం ఏంట‌ని అందరూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇంకేముంది వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడని.. అభిమానులు సంబరపడిపోయారు.

బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎన్టీఆర్..

Submitted by arun on Wed, 06/27/2018 - 17:52

నాని హోస్ట్ గా వ్యహరిస్తున్న బిగ్ బాస్ 2 షో విజయవంతంగా సాగుతోంది. 16 మంది సభ్యులు కంటెస్టెంట్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. వారిలో సంజన, నూతన్ నాయుడు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 2 ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూ సాగుతోంది. మొదట బిగ్‌బాస్‌ పట్ల ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఆ షోను చాలా మంది చూస్తున్నట్టు తేలింది. కానీ టీఆర్పీ రేటింగ్స్ విషయంలో నాని.. ఎన్టీఆర్ కన్నా కాస్త వెనుకబడ్డట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించడంతో ఆ షో టీఆర్పీ అమాంతం పెరిగిపోయింది. కానీ తొలి సీజన్‌తో పోలిస్తే ఇప్పుడు కొంచెం వెనుకపడిందని టాక్.