Avuna

“అతడు” సినిమా ఆలోచన

Submitted by arun on Thu, 09/13/2018 - 17:14

దర్శకుడు త్రివిక్రమ్‌కి 2002 లోనే “అతడు” సినిమా ఆలోచన వచ్చిందట. అయితే ముందుగా పవన్ కళ్యాణ్ కు ఈ సినిమాని చెప్పాడట. కొన్ని కారణాల వాళ్ళ పవన్ ఈ సిన్మా ఒప్పుకోకపోయే సరికి, అప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకి వినిపించాడు, అప్పుడు మహేష్‌కి ఈ సినిమా కథ నచ్చింది, కానీ తన నాని, అర్జున్ లను పూర్తి చేయడానికి అవసరమైనంత సమయం వరకు వేచి ఉండాల్సివస్తుందని త్రివిక్రమ్‌కి చెప్పడట, అలాగే  త్రివిక్రమ్ వెయిట్ చేసి గొప్ప సినిమాగా తెరకెక్కించారు. శ్రీ.కో.

అతి పెద్ద హిందూ దేశం

Submitted by arun on Wed, 09/12/2018 - 16:23

భారతదేశం ఎన్నో ప్రత్యేకతలు కలిగిన దేశం, అందులో ఒకటి భారతదేశం కేవలం అతిపెద్ద హిందూ దేశం మాత్రమే కాదు. పాకిస్థాన్ మరియు ఇండోనేషియా తరువాత బారత్  ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ముస్లిం జనాభా కలిగిన దేశం అని మీకు తెలుసా.

Tags

భారత దేశము ప్రపంచంలో ముందు

Submitted by arun on Wed, 09/12/2018 - 15:59

మీకు తెలుసా, మన భారత దేశము నాల్గవ అతిపెద్ద సైన్యాన్ని కలిగి ఉంది, బియ్యం మరియు టీ రెండింటిలో అతిపెద్ద రెండవ ఉత్పత్తి దారు మరియు మైకా, జనపనార, పప్పుధాన్యాలు మరియు పాలలో అతిపెద్ద మొదటి ఉత్పత్తిదారు. శ్రీ.కో.
 

Tags

వజ్రాలని మన దేశమే అందించింది

Submitted by arun on Wed, 09/12/2018 - 15:55

భారతదేశంలోనే మొదట వజ్రాలని గుర్తించారు, ప్రాముఖ్యత కూడా పొందింది మరియు తవ్వబడింది. అమెరికాకు చెందిన జమోలాజికల్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, 1896 వరకు ప్రపంచమ్లో వజ్రాల గురించి అంత తవ్వకాలు లేవట. అప్పటివరకు ప్రపంచానికి వజ్రాలను ఒక్క భారతదేశం మాత్రమే సప్లై చేసేదట. శ్రీ.కో.

మన వేదాలు మరియు ఉపనిషత్తులు

Submitted by arun on Wed, 09/12/2018 - 15:51

మీకు తెలుసా, భారతదేశం యొక్క గొప్ప గ్రంథాలయిన మన వేదాలు మరియు ఉపనిషత్తులు, ఇప్పుడు మనం అత్యంత అభివృద్ధి చెందిన దేశాలు అని అనుకొనే దేశాల్లో చదవటం మరియు వ్రాయడం కుడా రాక ముందే మన దగ్గర ఇవి రచించబడ్డాయట.  శ్రీ.కో
 

సంపాదన కన్నా షాపింగ్ మిన్న?

Submitted by arun on Fri, 09/07/2018 - 15:38

మహిళలకి కొంచెం షాపింగ్ అంటే ఇష్టమే, ఈ రోజుల్లో వారు బాగానే సంపాదిస్తున్నారు, ఒక అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మహిళలు US $ 18 ట్రిలియన్ డాలర్లు తమ ఆదాయంగా సంపాదిస్తున్నారట, అయితే  US $ 28 ట్రిలియన్లు ఖర్చు చేస్తున్నారట, మరి ఈ అంచనాని పురుషులు చేసారో, లేదా మహిళలు చేసారో మాత్రం తెలియదు. శ్రీ.కో

Tags

హిట్లర్ పూజారి

Submitted by arun on Fri, 09/07/2018 - 15:29

అడాల్ఫ్ హిట్లర్ పేరు చెప్పగానే చాలామందికి ఒక నియంత గుర్తుకు వస్తాడు, లేదా ప్రపంచ యుద్ధం గుర్తుకు వస్తుంది, అయితే హిట్లర్ చిన్నప్పుడు, పెద్దగఅయ్యాకా ఏమి కావాలని కోరుకున్నాడో మీకు తెలుసా? అడాల్ఫ్ హిట్లర్ వయస్సులో చిన్నప్పుడు, పెద్దగ అయ్యాక ఒక పూజారి కావాలని కోరుకున్నాడట. ఆ కోరిక తీరినా బాగుండుకదా? శ్రీ.కో.

రాక్షసబల్లులపై బొద్దింకల గెలుపు

Submitted by arun on Fri, 09/07/2018 - 15:26

రాక్షసబల్లులు భూమి తిరిగేప్పటికి, 120 మిలియన్ సంవత్సరాల ముందు నుండే బొద్దింకల ఈ భూమి మీద జీవించి ఉన్నాయట, అదే కాకా రాక్షసబల్లులు తట్టుకోలేని మార్పులను కుడా ఈ బొద్దింకలు ఇన్ని రోజులు బ్రతికి నిలబడ్డాయి, వాటిని చూసి చాలామంది అసహ్యించుకున్న, అవి చాల గట్టిపిండాలనిపిస్తుంది. శ్రీ.కో.

Tags

రోజుకి 20 బ్యాంకులలో దొంగతనం

Submitted by arun on Fri, 09/07/2018 - 14:31

సినిమాల్లో దొంగలు బ్యాంకు దోపిడీ చేసే కథతో ఎన్నో సిన్మాలు మీరు చూసిఉండవచ్చు, అయితే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు దాదాపు 20 బ్యాంకులలో దొంగతనం చేయబదుతున్నయటా, అలాగే ఈ దొంగిలించబడిన మొత్తం వాటి విలువ ₹ 1,72,100 రూపాయల్లో అట. పాపం ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకులకి దొంగలతో సినెమా కష్టాలే అన్నట్టు. శ్రీ.కో.

లాస్ వెగాస్ కేసినోలూ నో “టిక్ టిక్”

Submitted by arun on Fri, 09/07/2018 - 14:29

చాలామంది జల్సారాయుళ్ళు చూడాలనుకునే ప్రాంతం లాస్ వెగాస్ , అలాగే ప్రపంచంలో ఎక్కువ జల్సా మరియు బాగా బెట్టింగ్ జరిగే ప్రాంతం లాస్ వెగాస్ కేసినోలు, అయితే అక్కడి కేసినోలలో ఎక్కడ కూడా అసలు గడియారాలు లేవట, ఆ విధంగా అక్కడికి వచ్చే  వినియోగదారులు మరింత డబ్బు, సమయం ఖర్చు చేస్తుంటారట. శ్రీ.కో.