Avuna

పి.టి. ఉషా రూ. 250 స్కాలర్షిప్తో తన వృత్తిని ప్రారంభించారు

Submitted by arun on Sat, 09/15/2018 - 17:10

ఉషా చిన్నతనంలో పేదరికం మరియు అనారోగ్యంతో బాధపడ్డారు. కానీ ఆమె ప్రతిభతో నెలకు రూ 250 రూపాయల స్కాలర్షిప్గా గెలిచింది, ఆమె కేరళలోని కన్నూర్లో ఉన్న స్పోర్ట్స్ స్కూల్ లో చదువుకునేందుకు ఆవిడా కృషి, ప్రతిభ వీలు కల్పించింది, అక్కడ ఆమె శిక్షణ పొందింది మరియు చివరికి భారతదేశంలో "ట్రాక్ మరియు ఫీల్డ్ రాణి" గా మారింది. శ్రీ.కో.

Tags

సచిన్ టెండూల్కర్ ఒకసారి పాకిస్తాన్ కోసం ఆడాడు

Submitted by arun on Sat, 09/15/2018 - 17:00

మీకు తెలుసా! సచిన్ టెండూల్కర్ ఒకసారి పాకిస్తాన్ కోసం ఆడాడు, 1987 టెస్ట్ సీరీసు కన్నా ముందు ఒక ప్రదర్శనా మ్యాచ్లో భారతదేశం మరియు పాకిస్తాన్ ఆడాయి,  ఇమ్రాన్ ఖాన్ జట్టు నాయకుడు గా వున్నా ఆ ప్రదర్శన పోటీలో,పాకిస్తాన్  ఫీల్డర్లు గ్రౌండ్లో తక్కువ ఉండటం వల్ల, మన సచిన్ పాకిస్తాన్ టీం తరఫున ఫీల్డింగ్ చేసాడట. అప్పుడు సచిన్ వయస్సు 13 ఏళ్ల మాత్రమే. శ్రీ.కో.
 

నవరసాల నరేష్ నటన

Submitted by arun on Sat, 09/15/2018 - 16:43

విజయ నరేష్ లేదా నరేష్ ఒక ప్రముఖ తెలుగు సినీ నటుడు. ఇప్పటికి ఎన్నో హాస్యంతో నిండిన తండ్రి పాత్రల్లో చేస్తూ సెంకండ్ ఎంట్రీలో కూడా దూసుకు పోతున్న నటుడు. ఇతను ప్రముఖ నటి విజయ నిర్మల కుమారుడు. అనేక తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు. ముఖ్యంగా జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.

Tags

నూటొక్క జిల్లాల అందగాడు

Submitted by arun on Sat, 09/15/2018 - 14:21

నూటొక్క జిల్లాల అందగాడుగా ప్రసిద్ధి చెందిన నూతన్ ప్రసాద్ యొక్క అసలు పేరు మీకు తెలుసా? ఎందరికో తన డైలగులతో, చక్కని హాస్యంతో పరిచయమున్న నూతన ప్రసాద్ అసలు పేరు తడినాధ వరప్రసాద్.1970 నుండి 80వ దశకము వరకు సినిమా తల్లి ముద్దు బిడ్డగా, ఎన్నో మంచి సినిమాలతో ప్రసిద్ధి చెందిన హాస్య నటుడు మరియు ప్రతినాయకుడు. దేశం చాలా క్లిష్ట పరిస్థుతులలో ఉంది అనే డైలాగు తనకు ఎంతో పేరు తెచ్చింది.

ఆపద్బాంధవుడు అచ్చమైన ఒక తెలుగు సినిమా!

Submitted by arun on Sat, 09/15/2018 - 12:11

ఆపద్బాంధవుడు అచ్చమైన ఒక తెలుగు సినిమా, 1992లో విడుదలైన ఒక ప్రత్యేకమైన  సినిమా, ఎందుకంటే ఇందులో  మెగా స్టార్ చిరంజీవి ఒక సున్నితమైన పాత్ర పోషించాడు. ఇది బాక్సాఫీసు వద్ద అంత విజయవంతం కాలేదు. అయితే మంచి కథాచిత్రంగా పేరు తెచ్చుకొంది. చిరంజీవికి ఈ సినిమాలో పాత్రకు నంది అవార్డు కూడా లబించింది.

చిరంజీవి అసలు పేరు

Submitted by arun on Fri, 09/14/2018 - 12:34

మెగాస్టార్ చిరు గా పిలుచుకునే చిరంజీవి అసలు పేరు మీకు తెలుసా? చిరు అసలు పేరు “శివ శంకర వర ప్రసాద్” గా ఆయన పేరు పెట్టారు. తను  ఆగస్టు 22, 1955 న మోగుల్టోరులో జన్మించాడు. తను ఒన్గోల్ జూనియర్ కాలేజీలో తన ఇంటర్మీడియట్ అధ్యయనాలు చేశాడు. ఆ తర్వాత  నార్సాపూర్ వైయస్ ఆర్ కాలేజీలో తన B.Com చేశాడు. అక్కడి నుండి సైరా వరకు పెద్ద ప్రయాణమే చేసారు. ఇక సైర విడుదల కోసం అభిమానులు ఎదురు చుస్తున్నారు. శ్రీ.కో.

విలన్ అయిన హీరో క్రేజ్

Submitted by arun on Fri, 09/14/2018 - 12:31

తెలుగు సిన్మాలో ప్రతినాయకుడికి ఒక ప్రత్యేక స్థానం వుండే వ్యక్తుల్లో ప్రభాకర రెడ్డి గారు ఒకర ప్రభాకర రెడ్డి గా ప్రసిద్ధులైన డాక్టర్ మందాడి ప్రభాకర రెడ్డి ప్రముఖ తెలుగు సినిమా నటుడు, కథా రచయిత. స్వతహాగా వైద్యుడు అయినా నటన పై గల అనురక్తితో చాలా తెలుగు చిత్రాలలో నటించాడు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలలో నటించాడు. 37 ఏళ్ల కెరీర్‌లో 472కు పైగా సినిమాల్లో నటించాడు.  హైదరాబాదులోని మణికొండలో ఈయన స్మారకార్ధం డా.ప్రభాకరరెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురి కి ఈయన పేరుపెట్టారు. శ్రీ.కో.
 

అంతకు మించి అతడు

Submitted by arun on Thu, 09/13/2018 - 17:19

మీకు తెలుసా! అతడు చిత్రం యొక్క హక్కులు 1.8 కోట్లకు “మా” TV కి మొదట్లో  విక్రయించబడ్డాయి మరియు ఇప్పటికీ ఆ ఛానెల్లో ఎన్నో సార్లు వచ్చింది  , అయితే ఇటీవలే సుమారు 3.5 కోట్ల హక్కులు పునరుద్ధరించబడ్డాయి. ఒక తెలుగు సినిమాకి హక్కులు పునరుద్ధరించుకోనేందుకు వచ్చిన డబ్బులో ఇవి చాల ఎక్కువ అని ఇండస్ట్రీ వార్త. మరి త్రివిక్రమ్ మహేష్ల మేజిక్ అంతే కదా. శ్రీ.కో.

“అతడు” సినిమా ఆలోచన

Submitted by arun on Thu, 09/13/2018 - 17:14

దర్శకుడు త్రివిక్రమ్కి 2002 లోనే “అతడు” సినిమా ఆలోచన వచ్చిందట. అయితే ముందుగా పవన్ కళ్యాణ్ కు ఈ సినిమాని చెప్పాడట. కొన్ని కారణాల వాళ్ళ పవన్ ఈ సిన్మా ఒప్పుకోకపోయే సరికి, అప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకి వినిపించాడు, అప్పుడు మహేష్కి ఈ సినిమా కథ నచ్చింది, కానీ తన నాని, అర్జున్ లను పూర్తి చేయడానికి అవసరమైనంత సమయం వరకు వేచి ఉండాల్సివస్తుందని త్రివిక్రమ్కి చెప్పడట, అలాగే  త్రివిక్రమ్ వెయిట్ చేసి గొప్ప సినిమాగా తెరకెక్కించారు. శ్రీ.కో.

అతి పెద్ద హిందూ దేశం

Submitted by arun on Wed, 09/12/2018 - 16:23

భారతదేశం ఎన్నో ప్రత్యేకతలు కలిగిన దేశం, అందులో ఒకటి భారతదేశం కేవలం అతిపెద్ద హిందూ దేశం మాత్రమే కాదు. పాకిస్థాన్ మరియు ఇండోనేషియా తరువాత బారత్  ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ముస్లిం జనాభా కలిగిన దేశం అని మీకు తెలుసా.

Tags