Mixture potlam

జగదేకవీరుని కథ !

Submitted by arun on Sun, 11/04/2018 - 14:05

జగదేకవీరుని కథ  అప్పట్లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ సినిమా.... తనకు వచ్చిన కలను నిజము చేసుకునే ప్రయత్నములో, ఒక యువరాజు చేసిన సాహసకార్యముల గాధే జగదేకవీరుని కథ (Jagadeka Veeruni Katha). ఈ చిత్రము లోని పాటలు ఎంతో ప్రాచుర్యము పొందాయి. ఈ సినిమా నటినటులు... నందమూరి తారక రామారావు, బి. సరోజాదేవి,  రాజనాల, రేలంగి, తదితరులు... కే వి రెడ్డి గారు దర్శకులు. శివశంకరీ...శివానందలహరి పాట ఎంత పెద్ద విజయమో సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ పాట వెనుక ఎందరు హేమాహేమీలు శ్రమపడ్డారు. ఇప్పటికి ఈ పాట చాల ప్రసిద్ది చెందింది. మీరు ఈ సినిమా చూడకుంటే.. తప్పక చూడాల్సిన సినిమా. శ్రీ.కో.
 

గులేబకావళి కథ

Submitted by arun on Sun, 11/04/2018 - 14:02

గులేబకావళి కథ 1962 సంవత్సరంలో విడుదలైన జానపద తెలుగు సినిమా. ఈ సినిమాకు సంగీతదర్శకత్వం జోసెఫ్ కృష్ణమూర్తి వహించగా, పాటలన్నీ సి.నారాయణ రెడ్డి రాశారు. జోసెఫ్ కృష్ణమూర్తికి సంగీత దర్శకునిగానూ, సినారెకు గేయ రచయితగానూ ఇదే తొలిచిత్రం. ఈ సినిమా నటులు... నందమూరి తారక రామారావు, జమున, నాగరత్నం, ఋష్యేంద్రమణి, హేమలత, ఛాయాదేవి, బాలసరస్వతి, తదితరులు.కథ విషయానికి వస్తే.. రాజైన  చంద్రశేనాకు ఇద్దరు భార్యలు ఉన్నారు, గుణవతి మరియు రూపావతి. రూపవతి గర్భవతి అయినప్పుడు, తన కుమారుడిని వారసుడిగా చేయడానికి గుణవతి ... రూపవతి  ...శిశువును చంపడానికి ప్రయత్నిస్తుంది... ఆ తర్వాత ఏమి జరిగింది అనేది ఈ సినిమా కథ.

సత్య హరిశ్చంద్ర సినిమా

Submitted by arun on Sun, 11/04/2018 - 13:58

సత్య హరిశ్చంద్ర 1965 లో వచ్చిన చిత్రం . ఇది విజయా పతాకంపై కె.వి.రెడ్డి దర్శకత్వంలో ఎన్.టి.రామారావు, ఎస్.వరలక్ష్మి, నాగయ్య, ముక్కామల వంటి తారాగణంతో కూడిన 1965 నాటి పౌరాణిక చలనచిత్రం. సత్యం యొక్క గొప్పదనాన్ని సందేశంగా కలిగిన హరిశ్చంద్ర మహారాజు పౌరాణిక గాథను సినిమాగా మలిచారు. ఈ సినిమా ఆర్థికంగా పరాజయం పాలైంది.. ఇందులోని పాటలు బాగా ప్రసిద్ధి చెందాయి... అందులో ఒకటి... కులంలో ఏముందిరా సోదరా, మతంలో ఏముందిరా మట్టిలో కలిసేటి మడీసీ మడిసికి భేదం ఏముంది ఏముందిరా ! అనే పాట. శ్రీ.కో.

యోగి వేమన సినిమా

Submitted by arun on Sun, 11/04/2018 - 13:55

కొన్ని సినిమాలు ...క్లాసిక్స్ గా మిగిలి పోతాయి.. అలాంటిదే.. యోగి వేమన.  ఈ యోగి వేమన ఒక చక్కటి చలనచిత్రం. ఈ చిత్రంలో వేమన పాత్రధారి ప్రముఖ నటుడు చిత్తూరు నాగయ్య. ఈ చిత్రంలో నాగయ్య నటన ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతులను తెచ్చి పెట్టింది. వేమన ఎల్ల ఉంటాడో తెలియని తెలుగు ప్రజ, నాగయ్యలో వేమనను చూసుకుని పులకించిపొయారు. నాగయ్య నటనతో పాటు కె వి రెడ్డి దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రానికి వన్నె తెచ్చింది. 1947వ సంవత్సరములో దేశానికి స్వతంత్రము వచ్చిన వెంటనే విడుదలయిన చిత్రాలలో ఇది ఒకటి. ఈ చిత్రంలో నాగయ్య నటన ఒక ఎత్తు, ఆయన పాడిన పాటలు పద్యాలు ఒక ఎత్తు.

అనురాగ దేవత సినిమా

Submitted by arun on Sun, 11/04/2018 - 13:46

ఇది 1980లో విడుదలైన తెలుగు చిత్రం. జీతేంద్ర, రీనారాయ్, తాళ్ళూరి రామెశ్వరి నటించిన హిందీ చిత్రం 'ఆశా' ఆధారంగా ఎన్.టి.ర్ సొంతముగా  నిర్మించిన సినీమా. ఈ సినిమాకు పరుచూరి సోదరులు రచన చేశారు (ఎన్.టి.ఆర్ కు తొలిసారిగా). ఈ సినిమాలోని నటులు...నందమూరి తారక రామారావు, జయసుధ, శ్రీదేవి, నందమూరి బాలకృష్ణ. అలాగే ఈ సినిమా కథ ...... ఎన్.టి.ఆర్ లారీ ద్రైవర్. శ్రీదేవి పేరున్న గాయకురాలు. వారిరువురికి పరిచయం కలుగుతుంది. శ్రీదేవి అతన్ని ప్రేమిస్తుంది. ఐతే ఆ డ్రైవర్ కు అప్పటికే పెళ్లైపోయి ఉంటుంది (జయసుధ తో). ఒక ప్రమాదం వల్ల వారిరువురూ విడిపోతారు. జయసుధను ప్రమాదం నుండి బాలకృష్ణ కాపాడుతాడు.

గుణసుందరి కథ సినిమా!

Submitted by arun on Sat, 11/03/2018 - 17:24

షేక్సిపియర్ రచించి ప్రముఖ ఆంగ్ల నాటకం కింగ్ లియర్ నాటకం ప్రేరణతో నిర్మితమైన చిత్రం గుణసుందరి కథ. కే వి రెడ్డి గారు ఈ సినిమాకు దర్శకతం వహించారు....  1949లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది.  అలాగే ఈ సినిమాలో నటించిన వారు... శ్రీరంజని (గుణసుందరీ దేవి), కస్తూరి శివరావు, వల్లభజోస్యుల శివరాం, గోవిందరాజుల సుబ్బారావు, పి.శాంతకుమారి, రేలంగి వెంకటరామయ్య, కె.మాలతి తదితరులు వున్నారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రాజైన  ఉగ్రసేనా తన మూడవ కుమార్తె గునాపై కోపం తెచ్చుకుంటాడు, ఆమెను శారీరకంగా వికలాంగుడైన వ్యక్తికి ఇచ్చి వివాహం చేస్తాడు...

నాక్కొంచెం తిక్కుంది. కానీ దానికో లెక్కుంది!

Submitted by arun on Sat, 11/03/2018 - 17:14

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో పెద్ద హిట్ గబ్బర్ సింగ్. ఇది  2012 లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ సినిమాని బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై నిర్మించారు. ప్రముఖ హిందీ నటుడు సల్మాన్ ఖాన్ సంచలనాత్మక విజయం సాధించిన "దబాంగ్" సినిమా యొక్క పునఃనిర్మాణమగు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, శృతి హాసన్జంటగా నటించగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. 2012 మే 11న విడుదలైన ఈ సినిమా  విమర్శకుల మరియూ ప్రేక్షకుల ఆదరణ పొందడమే కాక 63 కోట్ల రూపాయల వసూళ్ళు సాధించి తెలుగు సినిమా స్థాయిని పెంచింది. ఇందులోని కొన్ని మాటలు తూటాల్ల పేలాయి...

ప్రేమనా.. బాద్యత నా...శ్రీవారిముచ్చట్లు

Submitted by arun on Fri, 11/02/2018 - 17:46

శ్రీవారిముచ్చట్లు అనే సినిమా కథ...లో ముఖ్య పాత్ర...గోపి...గోపీ తండ్రి ప్రియను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటాడు, కాని అతను రాధాతో ప్రేమలో పడతాడు. ప్రియ తండ్రి గోపి తన అప్పులను క్లియర్ చేసినప్పుడు, తన కృతజ్ఞతా భావాన్ని తెలియజేయడానికి ఆమెను వివాహం చేసుకుంటాడు. లక్ష్మీఫిలిమ్స్ కంబైన్స్ ద్వార  సమర్పణ చేసింది.. నంగునూరు శ్రీనివాసరావు, ఈ సినిమా నిర్మాత ఎన్ఆర్.అనురాధాదేవి, కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దాసరి నారాయణరావు, ఈ సినిమా హీరో, హీరొయిన్ గా ఏఎన్నార్, జయప్రద, జయసుధ నటించారు...

ఆడవాళ్లూ మీకు జోహార్లు

Submitted by arun on Fri, 11/02/2018 - 15:47

ఆడవాళ్లూ మీకు జోహార్లు అనే పాత సినిమా మీరు చూసారా! దీని నిర్మాత టీ.విశ్వేశ్వరరావు, కథ, స్క్రీన్ ప్లే,దర్శకత్వం:కే.బాలచందర్.. ఈ సినిమా మాటలు  గణేష్ పాత్రో ఇచ్చారు.. అలాగే.. పాటలు ఆత్రేయ. ఈ సినిమాలో హీరో మరియు హీరొయిన్ గా కృష్ణంరాజు, జయసుధ నటించారు... మిగిలిన పాత్రల్లో...జయమాలిని, సరిత, వై.విజయ, త్యాగరాజు, భానుచందర్,సాక్షిరంగారావు, ప్రసాదరావు, కృష్ణచైతన్య, శ్యామల, లక్ష్మీచిత్ర, ఆశాలత, భరత్ కుమార్, జిత్ మోహన్ మిత్ర, రాఘవన్, భాషా, మాస్టర్ రాజు, ఈ సినిమాలో.. అతిథి నటుడుగా చిరంజీవి నటించడం ఒక విశేషం. సమయం వున్నప్పుడు ఒక సారి చూడవచ్చు. శ్రీ.కో.
 

కొత్త చిత్రం సవ్యసాచి సినిమా రివ్యూ

Submitted by arun on Fri, 11/02/2018 - 14:49

కొత్తదైన ఆలోచనతో ..వచ్చిన కొత్త చిత్రం సవ్యసాచి.  సినిమా.. కి మూలం...‘మేధావి తన తెలివిని మంచి కోసం వాడాలి కానీ, వినాశనం కోసం కాదు.. అలాంటి మేధావితనం అతన్నే నాశనం చేస్తుంది’ . ఈ ఆలోచనకి  మంచి కథనం తోడై ఉంటే ఇంకా ఎంతో మేరుగై వుండేది ఈ సినిమా. ప్రతీకారం అనే భావాన్ని సినిమాగా చేసిన థ్రిల్లింగ్ డ్రామా ‘సవ్యసాచి’. ఇందులోని  ‘వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్’ అనే విషయము మూలంగా ..కథ కొంత ఫ్రెష్ గా అనిపించింది.  వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్’ అనేతే....తల్లి గర్భంలో ఏర్పడిన కవల పిండాలు పోషకాహార లోపం వల్ల ఒకటిగా కలిసిపోయే ఒక లోపం ఇది.... ఇదే లోపంతో విక్రమ్ ఆదిత్య(నాగచైతన్య) పుడతాడు.