Mixture potlam

రోజా సినిమా

Submitted by arun on Fri, 11/16/2018 - 16:50

రోజా 1992 లో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. దీనికి మూలం తమిళ సినిమా కాగా తెలుగుతో సహా హిందీ, మళయాళం మరియు మరాఠీ భాషలలో కూడా డబ్బింగ్ చేశారు. ఇది మణిరత్నం దర్శకత్వంలో కాశ్మీరు తీవ్రవాద సమస్య మీద నిర్మించిన సందేశాత్మక చిత్రం. దీనికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. అలాగే.. అరవింద స్వామి హీరో గా.. మధుబాల హీరోయిన్ గా నటించిన చిత్రం... ఇది.  ఇందులో రహమాన్ ఇచ్చిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి...

Tags

“శివ” అంటే వీడే !

Submitted by arun on Fri, 11/16/2018 - 14:55

శివ చిత్రం .. తెలుగు సినిమా చరిత్రలోనే... ఒక కొత్త పంథాని నిర్మించిన చిత్రం...ఇది మాఫియా నేపథ్యంలో కాలేజీ కుర్రాళ్ళ మధ్య జరిగే రాజకీయాలపై చిత్రీకరించబడ్డ సినిమా. అమల కథానాయికగా, రఘువరన్ ప్రధాన ప్రతినాయకుడుగా, అతని సహచరుడుగా తనికెళ్ళ భరణి నటించారు. భరణి సంభాషణలు కూడా అందించారు. సీఎన్ఎన్-ఐబిఎన్ రూపొందించిన భారతదేశ 100 ఉత్తమ చిత్రాలలో శివ కూడా ఒకటి. ఇళయరాజా స్వరాలని కూర్చారు. రాంగోపాల్ వర్మకి దర్శకుడిగా ఇది తొలి చిత్రం. తమిళంలో ఉదయంగా అనువదించబడగా, హిందీలో 1990 లో పునర్నిర్మించారు. ఈ చిత్రంలో చూపిన కళాశాల ప్రాంగణం సికింద్రాబాద్ లోని కీస్ ఉన్నత పాఠశాలది.

నీలాంబరి' అయిన శివగామి అయిన ఆమెకు తిరుగులేదు

Submitted by arun on Fri, 11/16/2018 - 14:35

బాహుబలి సినిమాలో  రమ్యకృష్ణ పాత్రకి ప్రపంచ వ్యాప్తంగా పేరువచ్చింది...అయితే ఈమె తమిళనాట ప్రముఖ పాత్రికేయుడు, విమర్శకుడు చో రామస్వామి మేనకోడలని మీకు తెలుసా...  ఇంచుమించు రమ్యకృష్ణ..ప్రతీ అగ్రనాయకుడి సరసన ఈమె నటించింది  1992లో విడుదలయిన అల్లుడుగారు చిత్రం ఈమె అదృష్టాన్ని మలుపు తిప్పింది. అప్పటి నుండి కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాలలో ఈమె వరుసగా నటించగా, దాదాపు అవన్నీ విజయవంతమై రమ్యకృష్ణ నటిస్తే చాలు ఆ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని నిర్మాతలకు కలిగేలా చేశాయి. నరసింహ చిత్రంలో రజినీకాంత్తో పోటీపడి మరీ చేసిన 'నీలాంబరి' పాత్రను రక్తి కట్టించింది.

తెలుగువీర లేవరా

Submitted by arun on Thu, 11/15/2018 - 16:45

దేశభక్తి గీతాలలో... కొన్ని గీతాలు అద్బుతమైన ప్రముక్యతని సంపాదించుకుంటాయి. అలాంటి పాటే..తెలుగువీర లేవరా. ఈ సినిమా.. 1974లో విడుదలైన అల్లూరి సీతారామరాజు సినిమాలోని దేశభక్తి గీతం. దీనిని ప్రముఖ రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు రచించారు. భారత స్వాతంత్ర్య సమరస్పూర్తితో ఘంటసాల వెంకటేశ్వరరావు, వి.రామకృష్ణ బృందం ఈ గీతాన్ని చక్కగా ఆలపించారు. దర్శకుడు రామచంద్రరావు ఘట్టమనేని కృష్ణ మరియు ఇతర నటులపై చిత్రీకరించారు.
తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా

దేశమాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయరా ||| తెలుగువీర లేవరా |||

...”జగమే మాయ బ్రతుకే మాయ”

Submitted by arun on Thu, 11/15/2018 - 16:36

ప్రేమలో విఫలమైనవారు, చాల మంది మందు బాబులు, ఇంకా... బంధాలో బలిఅయిపోయినవారు.... ఇప్పటికి పాడుకునే పాట...”జగమే మాయ బ్రతుకే మాయ” పాట 1953 లో విడుదలైన దేవదాసు సినిమా కోసం సముద్రాల రచించారు. ఈ గీతాన్ని ఘంటసాల వెంకటేశ్వరరావు హృద్యంగా గానం చేయగా సి.ఆర్. సుబ్బరామన్ సంగీతాన్ని అందించారు.
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా ఈ వింతే నయా ||| జగమే మాయ |||
చరణం 1 :

కలిమీలేములు కష్టసుఖాలు

కావడిలో కుండలనీ భయమేలోయి

కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్

కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయి ||| కావడి కొయ్యేనోయ్ ||| ||| జగమే మాయ |||

బండెన్క బండి గట్టి - గట్టిగా నిలబడ్డ పాట!

Submitted by arun on Thu, 11/15/2018 - 16:25

కొన్ని పాటలు ప్రజలను కదిలిస్తాయి..ఉద్యమాలకు ఉపిరి పోస్తాయి...అలా తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో ప్రధాన పాత్ర పోషించి, ఉత్తేజితపరిచిన పాటల్లో ఇది ప్రముఖమైనది. దీనిని సాయుధ పోరాటంలో క్రియాశీలకంగా పనిచేసిన, నల్గొండ జిల్లాకు చెందిన జి.యాదగిరి వ్రాశాడు. సాయుధ పోరాటం కథా వస్తువుగా నరసింగరావు తీసిన మా భూమి చిత్రంలో యాదగిరి పాత్ర పోషించిన ప్రజా గాయకుడు గద్దర్ ఈ పాట పాడాడు.
బండెన్క బండి గట్టి, పదహరు బండ్లు గట్టి

యే పల్లే బోతవ్ కొడుకో నైజాము సర్కరోడా

నాజీల మించినవ్ రో నైజాము సర్కరోడా
||బండెన్క బండి గట్టి||
పోలీసు మిల్ట్రీ రెండు బలవంతులానుకోని

మనలో దేశబక్తిని పెంచే పాట

Submitted by arun on Wed, 11/14/2018 - 15:04

కొన్ని పాటలు.. మానని ఆహ్లాద పరచడమే కాదు.... మనలో దేశబక్తిని కూడా పెంచుతాయి.. అలాగే ఆలోచింపచేస్తాయి.. అలాంటి పాటే ఈ ...పాడవోయి భారతీయుడా అనే ఈ పాట 1961లో విడుదలైన వెలుగు నీడలు చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట రచయితలు ఆత్రేయ, శ్రీ శ్రీ, గానం ఘంటసాల, పి. సుశీల, మాధవపెద్ది సత్యం, వెంకటేశ్వరరావు, స్వర్ణలత. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు, నటీనటులు అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య, గిరిజ, ఎస్.వి. రంగారావు, రేలంగి, సూర్యకాంతం. దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు,

పాడవోయి భారతీయుడా

ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ

పాడవోయి భారతీయుడా

ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ

కారులో షికారు కెళ్ళే !

Submitted by arun on Wed, 11/14/2018 - 14:35

ఆచార్య ఆత్రేయ గారు.. మనసు కవి మాత్రమే.. కాదు.. మంచి సందేశాత్మక పాటలు కూడా రాసారు.. అలాంటిదే... ఈ కారులో షికారు కెళ్ళే పాట !
కారులో షికారు కెళ్ళే పాట తోడికోడళ్ళు (1957) సినిమా కోసం ఆచార్య ఆత్రేయ రచించిన సందేశాత్మక లలితగీతం. ఈ గీతాన్ని ఘంటసాల వెంకటేశ్వరరావు మధురంగా గానం చేయగా మాస్టర్ వేణు సంగీతాన్ని అందించారు.
పల్లవి :

కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడిదాన

బుగ్గమీద గులాబిరంగు ఎలావచ్చెనో చెప్పగలవా | | కారులో | |

నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే

'కృష్ణ' గారు నటించిన తొలి రంగుల చిత్రం!

Submitted by arun on Mon, 11/12/2018 - 16:30

అప్పట్లో.. బ్లాకు అండ్ వైట్ సినిమాల తర్వాత... మెల్లిగా రంగుల చిత్రాలు రావటం మొదలెట్టాయి... అలా సూపర్ స్టార్ 'కృష్ణ' గారు.. కొన్ని సినిమాలు మొదలెట్టారు.. అయితే.. 'కృష్ణ' గారు.. నటించిన తొలి రంగుల చిత్రం ఏదో మీకు తెలుసా!..... 'కృష్ణ' గారు నటించిన తొలి రంగుల చిత్రం తేనె మనసులు. అప్పట్లో బాగా నడిచిన సినిమా.. అలాగే రంగురంగుల అందలను.. వెండి తెరపై చూపిన తెలుగు సినిమా అని చెప్పవచ్చు.  శ్రీ.కో.

'సిరివెన్నెల' సీతారామశాస్త్రి గారి ఇంటిపేరు

Submitted by arun on Mon, 11/12/2018 - 15:34

'సిరివెన్నెల' సీతారామశాస్త్రి గారు అంటే... ప్రస్తుతం.. తెలుగు రాష్టాల్లో.. తెలియని తెలుగు వారు వుండరేమో... అయితే వారి ఇంటిపేరు.. అందరు 'సిరివెన్నెల' అని అనుకుంటారు.. అయితే.. అది వారు రాసిన పాటల సినిమా పేరు మాత్రమే...  .. మీకు 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి గారి అసలు ఇంటి పేరు ఏమిటో తెలుసా! 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి గారి అసలు ఇంటి పేరు చేంబోలు. వీరు...సిరివెన్నెల సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చేంబోలు సీతారామశాస్త్రి తెలుగు సినీ గీతరచయిత. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో మే 20, 1955 వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు. శ్రీ.కో.