Second Marriage

యాంకర్‌ భర్తకు రెండో పెళ్లి..

Submitted by arun on Fri, 08/17/2018 - 08:48

వర్ధమాన సినీ నటుడు జోగినాయుడు వివాహం గురువారం అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో జరిగింది. తన స్వగ్రామమైన విశాఖ జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన సౌజన్యను సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నాడు. తెలుగు సినీ రంగంలో రాణిస్తున్న జోగినాయుడు, గతంలో ప్రముఖ యాంకర్ ఝాన్సీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆపై వారిద్దరి మధ్యా వచ్చిన మనస్పర్థల కారణంగా వారు విడిపోయారు. మరోసారి పెళ్లి పీటలు ఎక్కిన జోగినాయుడికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సింగ‌ర్ సునీత‌

Submitted by arun on Fri, 07/20/2018 - 11:31

సుమధుర గానంతో తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గాయని సునీత మరో పెళ్లి చేసుకోబోతున్నట్టు గురువారం సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌ అయింది. ఈ వార్తపై ఆమె స్పందించారు. తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని ఫేస్‌బుక్‌ లైవ్‌ వీడియోలో ఆమె స్పష్టం చేశారు. మీ ఆద‌ర‌ణ వ‌ల‌న ఇప్ప‌టికి హ్యాపీగా పాట‌లు పాడుకుంటూ ఉన్నాను. కాని నిన్న‌టి నుండి నేను రెండో పెళ్ళి చేసుకోబోతున్న‌ట్టు నా ఫోన్‌కి మెసేజ్‌లు వ‌స్తున్నాయి. దాదాపు అన్నీ వెబ్ సైట్స్ నేను పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు రాసాయి. కాని ఇందులో ఏ మాత్రం నిజం లేదు. మీ అంద‌రి ఆద‌ర‌ణ వ‌ల‌న హ్యాపీగా ఉన్నాను.

పెళ్లి చేసుకోబోతున్న సింగర్‌ సునీత?

Submitted by arun on Thu, 07/19/2018 - 11:15

తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సింగర్ సునీత. ప్రేక్షకులను మైమరిపించే గానం మాత్రమే కాదు, ఆకట్టుకునే రూపం కూడా ఆమె సొంతం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సునీతకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. తాజాగా ఆమెకు సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇది ప్రేమ వివాహం కాదు: రేణూ దేశాయ్‌

Submitted by arun on Tue, 06/26/2018 - 11:30

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో విడాకులు తీసుకున్న ఎన్నో సంవత్సరాల తరువాత మరో పెళ్లికి సిద్ధపడ్డ రేణూ దేశాయ్...గత జ్ఞాపకాలని వదిలేసి..కొత్త జీవితం వైపు అడుగులేస్తోంది..రేణు దేశాయ్. మ‌రికొద్ది రోజుల్లో మ‌రో వ్యక్తితో పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నారు. ఇటీవ‌లె రేణు నిశ్చితార్థం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. నిశ్చితార్థం ఫోటోల‌ను త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన రేణు త‌నకు కాబోయే భ‌ర్త ఫోటోల‌ను మాత్రం రివీల్ చేయ‌లేదు. తాజాగా త‌న రెండో వివాహం గురించి ఓ ఆంగ్ల ప‌త్రికతో రేణు మాట్లాడారు.
 

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రేణూ దేశాయ్

Submitted by arun on Sat, 06/23/2018 - 12:20

గత జ్ఞాపకాలని వదిలేసి..కొత్త జీవితం వైపు అడుగులేస్తోంది..రేణు దేశాయ్. తన జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడని..చెప్పకనే చెబుతోంది. మళ్లీ ప్రేమలో పడ్డానని..అల్లిబిల్లి ఊసులు పంచుకుంటోంది. కాబోయే..జీవిత భాగస్వామిపై అందమైన కవితలతో రేణూ దేశాయ్‌ ప్రేమ కురిపిస్తుంది. ప్రియుడి ప్రేమలో రేణూ పరవశించిపోతోంది. మొన్నటిదాకా గతాన్ని నెమరేసుకుంటూ భావోద్వేగంతో కవితలు రాసిన రేణుదేశాయ్..ఇప్పుడు ప్రేమ కవిత్వంలో పులకించిపోతుంది. కొత్త జీవితాన్ని మొదలుపెట్టేందుకు సిద్దమవుతోంది. కాబోయే..శ్రీవారిపై..రేణు తెగ ప్రేమ ఒలకబోస్తుంది.