Danam Nagender

రాహుల్‌కు తెలిస్తే ఉత్తమ్ ఉద్యోగం ఊడిపోతుంది

Submitted by arun on Tue, 08/14/2018 - 16:49

రాహుల్ గాంధీ పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని టీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరని తెలిపారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.. కిరాయికి ప్రజలను తీసుకువచ్చి ర్యాలీలు తీశారని ఎద్దెవా చేశారు. కాంగ్రెస్ నేతల ముఖం చూసి ఎవరైనా ఓట్లు వేస్తారా? అని దానం ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో గ్రేటర్‌లో కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతేనని జోస్యం చెప్పారు. ఇక సెటిలర్స్ గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. అసలు సెటిలర్స్‌ను ఆకర్షించే మొహాలు కాంగ్రెస్‌లో ఉన్నాయా?

కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి మరో 15 మంది!

Submitted by arun on Mon, 06/25/2018 - 10:42

గులాబీ బాస్  కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారా ? ఇందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ సెకండ్ ఎపిసోడ్‌కు తెరతీశారా? ఢిల్లీ పర్యటన తరువాత వ్యూహాలకు పదును పెట్టారా? ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ను కోలుకోలేని విధంగా దెబ్బతీసేందుకు పక్కాగా అడుగులు వేస్తున్నారా ? అంటే అవుననే సమాధానాలు టీఆర్ఎస్ భవన్‌ నుంచి జోరుగా వినిపిస్తున్నాయి.  

పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు ప్రత్యేక ప్రణాళిక చేపట్టారా? ఇందుకోసమే ప్రజా సంక్షేమ పథకాలను మరింత ముమ్మరం చేయాలని భావిస్తున్నారా ? 

కాంగ్రెస్ ఈ దుస్ధితికి రావడానికి కారణం ఒక వర్గం వారే

Submitted by arun on Sat, 06/23/2018 - 14:05

కాంగ్రెస్‌ పార్టీకి సీనియర్‌ నాయకులు దానం నాగేందర్‌ శనివారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిలకు పంపారు. ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి పదవులకు ఆశపడి టీఆర్ఎస్‌లో చేరలేదని దానం నాగేందర్ అన్నారు. పదవులు ఉన్నా లేకపోయినా తన వెంట నడిచిన కార్యకర్తల కోసమే కాంగ్రెస్‌ను వీడనన్నారు. టీఆర్ఎస్‌లో పదవులు వచ్చినా రాకపోయినా ... సైనికుడిలా పనిచేయడమే తన లక్ష్యమన్నారు. కాంగ్రెస్‌లోని నేతల తీరు వల్లే మూడు దశాబ్ధాల అనుబంధం తెంచుకున్నానంటూ దానం ప్రకటించారు.

దానం రాజీనామాపై ముఖేశ్‌గౌడ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు

Submitted by arun on Sat, 06/23/2018 - 10:52

దానంతోటే సరిపెడతారా..? లేక మరో భారీ షాక్‌ను తగిలించుకుంటారా..? ఇప్పుడీ విషయమే.. కాంగ్రెస్ శిబిరంలో కల్లోలం పుట్టిస్తోంది. తన దారి తాను చూసుకుని తొందరపడ్డారంటూ దానంపై మరో మాజీ మంత్రి ముకేశ్ గౌడ్.. చేసిన వ్యాఖ్యలు.. కలకలం పుట్టిస్తున్నాయి. కాస్త ఆగి ఉంటే.. అందరం కలిసి కారెక్కేవాళ్లమని.. ముఖేశ్ కుండబద్దలు కొట్టడం.. గ్రేటర్ కాంగ్రెస్‌లో అసంతృప్తి స్థాయి ఏ రేంజులో ఉందో.. చెబుతోంది. 

టీఆర్‌ఎస్‌లోకి దానం నాగేందర్?

Submitted by arun on Fri, 06/22/2018 - 17:11

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద దిక్కులా ఉన్న దానం నాగేందర్‌...హస్తం పార్టీకి గుడ్‌ బై చెప్పారు. రాజీనామా లేఖను పీసీసీ చీఫ్‌కు పంపారు. రాజీనామాపై పునరాలోచించుకోవాలని దానంను... పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. 

కాంగ్రెస్‌‌కు షాకుల మీద షాకులు...దానం దారిలో మరికొందరు సీనియర్లు

Submitted by arun on Fri, 06/22/2018 - 16:44

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మాజీ మంత్రి దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయడంతో మరికొంత మంది సీనియర్లు ఆయన దారిలో పార్టీకి Related imageగుడ్‌బై చెప్పేందుకు రెడీ అవుతున్నారు. మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌, ఆయన కుమారుడు విక్రమ్‌ గౌడ్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దానం నాగేందర్ రాజీనామాపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. దానంను బుజ్జగించేందుకు ఆయన నివాసానికి వెళ్లారు.

తెలంగాణ కాంగ్రెస్‌కు భారీ షాక్‌... మాజీ మంత్రి రాజీనామా

Submitted by arun on Fri, 06/22/2018 - 15:06

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద దిక్కులా ఉన్న దానం నాగేందర్‌...హస్తం పార్టీకి గుడ్‌ బై చెప్పారు. రాజీనామా లేఖను పీసీసీ చీఫ్‌కు పంపినట్లు సమాచారం. ఏఐసీసీకి సైతం రాజీనామా లేఖను పంపినట్లు తెలుస్తోంది.