Sudheer

సుధీర్‌ను పెళ్లి చేసుకో.. రష్మీ ఘాటు రిప్లై!

Submitted by arun on Fri, 06/22/2018 - 10:25

జబర్దస్త్ తో యాంకర్ గా రష్మీ, కమెడియన్ గా సుధీర్ బాగా పాపులర్ అయ్యారు. జబర్దస్త్ లో వీరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉందనే అభిప్రాయం ఉంది. అందుకు తగ్గట్లుగానే వీరి మధ్య ఆఫ్ స్క్రీన్ లో కూడా కెమిస్ట్రీ జరుగుతోందనే రూమర్స్ ఉన్నాయి. ఈ రూమర్స్ ని సుధీర్, రష్మీ ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. ఎలాంటి రూమర్స్ వచ్చినా వారి తరహాలోనే ఆడియన్స్ ని అలరిస్తూ వచ్చారు. వీరిమధ్య ప్రేమాయణం జరుగుతోందనే వార్తలపై రూమర్స్ సహజమే కదా అన్నట్లుగా గతంలో వీరి స్పందన ఉండేది. తాజగా సోషల్ మీడియాలో రష్మీకి చేదు అనుభవం ఎదురైంది. నెటిజన్ కు ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.