Student suicide

బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

Submitted by arun on Sat, 09/22/2018 - 17:24

ఆదిలాబాద్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీలో ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్న అనూష అనే విద్యార్థిని శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఇంజనీరింగ్‌ రెండో ఏడాది చదువుతున్న అనూష కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమంటూ ఆమె వద్ద లభించిన సూసైడ్‌నోట్‌ ద్వారా తెలుస్తోంది. అనూష స్వస్థలం సిద్దిపేట జిల్లా మండపల్లి అని కాలేజీ యాజమాన్యం తెలిపింది. విద్యార్థి ఆత్మహత్యకు మరిన్ని కారణాలు తెలియాల్సి ఉంది.
 

కర్నూలు జిల్లాలో విషాదం...ప్రత్యేక హోదాకోసం బాలుడు సూసైడ్

Submitted by arun on Tue, 09/18/2018 - 09:18

కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జలదుర్గంలో మహేంద్ర అనే 15 సంవత్సరాల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రత్యేక హోదా కోసమే ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్‌ నోట్‌ రాశాడు. మహేంద్ర ఆత్మహత్య విషయం తెలియడంతో ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి, డోన్‌ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

ప్రేమ వ్యవహారం.. భవనంపై నుంచి దూకిన యువతి

Submitted by arun on Wed, 06/20/2018 - 13:34

హైదరాబాద్ ముషీరాబాద్‌లో పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పాలిటెక్నిక్ చదువుతున్న సనా తన తల్లిదండ్రుల కళ్ల ముందే భవనంపై నుంచి దూకింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. సన స్వస్థలం పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం రొంపిగుంట గ్రామం. సన ముషీరాబాద్ ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతోంది. సనా ఓ అబ్బాయితో ప్రేమలో ఉన్నట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి బుధవారం కళాశాల దగ్గరకు వచ్చారు. దీంతో సనా తల్లిదండ్రుల ముందే హాస్టల్‌ భవనం మూడో అంతస్తు మీద నుంచి కిందకు దూకింది.