sanjana

అతని పక్కన పడుకోమన్నారు.. బిగ్‌బాస్‌టీంపై సంజన ఫైర్

Submitted by arun on Wed, 06/20/2018 - 07:43

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. హౌస్ లోపల ఉన్న కంటెస్టెంట్స్ ఆడియన్స్ కు ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నారు. ఇప్పటికే సంజన ఎలిమినేషన్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సంజన ప్లేస్ లోకి నందిని రాయ్ జాయిన్ అయింది. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే తనతో బిగ్ బాస్ నిర్వాహకులు గేమ్ ఆడుకున్నారని, హౌస్ లోపల మొత్తం రాజకీయం జరిగింది అని సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. బిగ్ బాస్ 2 నుంచి బయటకు వచ్చిన సంజన ఇంటర్వ్యూలలో చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఈ షోనుంచి మొదటగా ఎలిమినేట్ అయిన సంజన చెబుతోన్న మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

బిగ్ బాస్ హౌస్ నుండి సంజనా ఔట్!

Submitted by arun on Mon, 06/18/2018 - 11:02

నాని హోస్ట్ గా బిగ్ బాస్-2 మొదలై వారం అవుతుంది. మొదటి ఎలిమినేషన్ అందరి అంచనాలను మించి జరిగింది. గణేష్, సంజనా, నూతన్ నాయుడులలో సంజనా, నూతన్ నాయుడులను ఎలిమినేటర్స్ గా తేల్చిన బిగ్ బాస్ ఫైనల్ గా నాటకీయ పరిణామాలతో నూతన్ నాయుడుని సేఫ్ చేసి సంజనాని ఎలిమినేట్ చేశారు. బిగ్‌బాస్‌ ఇంట్లోకి వచ్చిన మొదటి రోజు నుంచి సంజన పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. ఇతర కంటెస్టెంట్లతో దూకుడుగా వ్యహరించేవారు. ముఖ్యంగా తేజస్వి సంజనాకు  మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా ఉండేది. వారం రోజుల పాటు సంజనా బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉండగా ప్రతిరోజు వివాదాస్పదంగా ఉండేదంటూ ఇంటి సభ్యులు తెలిపారు.