Movies

ఫ్యాన్ కు ఉరి వేసుకుని సినీనటి ఆత్మహత్య

Submitted by nanireddy on Thu, 09/06/2018 - 18:18

ఫ్యాన్ కు ఉరి వేసుకుని సినీనటి ఆత్మహత్య చేసుకుంది.. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లోని సిలిగురిలోని ఓ హోటల్‌ గదిలో చోటుచేసుకుంది. ఆమె బెంగాలీ సినీ, టీవీ నటి పాయెల్‌ చక్రబోర్తి(38) గా గుర్తించారు. కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటున్న పాయెల్‌ చక్రబోర్తి కుటుంబసమస్యలు కారణంగా ఆత్మహత్య చేసుకుని  ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మంగళవారం హోటల్‌లో ఓ గది తీసుకున్న పాయెల్‌ బుధవారం గ్యాంగ్‌టక్‌కు వెళ్లాలని సిబ్బందితో చెప్పారు. గదిలో దిగే ముందే తనను ఎవరు డిస్టర్బ్‌ చేయొద్దన్నారు. అంతేకాకుండా బుధవారం రాత్రిపూట భోజనం కూడా తీసుకోలేదని సిబ్బంది పోలీసుకు తెలిపారు.

కొత్త సినిమా ప్రారంభించిన ప్రభాస్‌

Submitted by arun on Thu, 09/06/2018 - 13:22

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్..సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ.150 బడ్జెట్‌తో ‘సాహో’ మూవీని చేస్తున్నాడు. ఈ మూవీని ఒకేసారి తెలుగు, తమిళం, హిందీ మూడు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మరో సినిమా ఖరారైనట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభాస్ స్వయంగా తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజీ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. సాహో తర్వాత తాను చేస్తున్న సినిమా గురువారం(సెప్టెంబర్ 6)న ప్రారంభమైనట్లు తెలిపారు.

జగపతి బాబు అన్న కూతురితో.. రాజమౌళి కుమారుడి ఎంగేజ్‌మెంట్

Submitted by arun on Thu, 09/06/2018 - 12:33

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. నటుడు జగపతిబాబు సోదరుడి కూతురు పూజా ప్రసాద్‌తో కార్తికేయ నిశ్చితార్థం బుధవారం రాత్రి జరిగింది. వీరి పెళ్లి డిసెంబర్లో జరిగనున్నట్టు సమాచారం. జగపతి బాబు సోదరుడైన రామ్ ప్రసాద్ పూజ తండ్రి. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న ఆమె భక్తి గీతాలను ఆలపించడం ద్వారా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. కార్తికేయ, పూజాప్రసాద్ ల పెళ్లి పెద్దల అంగీకారంతో జరగనున్న ప్రేమ వివాహం అని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

క్రికెటర్‌గా నానికి - తోడుగా కశ్మీరా పరదేశీ

Submitted by admin on Wed, 09/05/2018 - 17:22

నాగార్జునతో కలసి దేవదాస్ సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్న నాచురల్ స్టార్ నాని మరో సినిమాకు అప్పుడే సైన్ చేసేశాడు.గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఒక సినిమాకు నాని ఒప్పుకున్నట్టు ఫిల్మ్ వర్గాల టాక్. క్రీడా నేపథ్యం ఉన్న ఈ సినిమా కథకు నాని ఫ్లాట్ అయి వెంటనే ఓకే చేసినట్టు తెలుస్తుంది.గతంలో కూడా నాని క్రీడా నేపథ్యంతో ఒక సినిమా (భీమిలీ కబడ్డి జట్టు) తో సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

సొంత థియేటర్లు కట్టనున్న మహేష్ బాబు : మెదటి సినిమా ఆయనదే

Submitted by admin on Wed, 09/05/2018 - 14:57

సౌత్ ఇండియాలో నెంబర్ వన్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు రెమ్యునరేషన్ విషయంలో అసలు తగ్గడం అనేది ఉండదు.తన భార్య నమ్రత సాయంతో పలు బిజినెస్‍లు,యాడ్‌ఫిల్మ్స్ రూపంలో బాగానే సంపాదిందుస్తుంటాడు.ఒక రకంగా ఈ సుపర్ స్టార్ మంచి బిజినెస్ మెన్ కూడా అని చెప్పవచు.

ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలో దిగి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ బూమ్ ఉంటే అక్కడ అనేక స్థలాలను కొనేశాడు మహేష్.ఇప్పుడు మహేష్ మరో ముందడుగు వేసి మల్టీప్లెక్స్ ల నిర్మాణంలోకి అడుగుపెట్టబోతున్నాడు.ఇప్పటికే గచ్చిబౌలీ ఏరియాలో ఏషియన్ సినిమాస్ వారితో కలసి ఒక మల్టీప్లెక్స్ నిర్మాణాన్ని జరుపుతున్నాడు అనేది సినీ వర్గాల టాక్.

రవిశాస్త్రితో డేటింగ్‌.. స్పందించిన నటి

Submitted by arun on Tue, 09/04/2018 - 11:21

తాను టీమిండియా కోచ్ రవిశాస్త్రితో సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలను బాలీవుడ్ హీరోయిన్ నిమ్రత్ కౌర్ కొట్టిపారేసింది. ఈ వార్తలన్నీ అవాస్తవమని చెప్పింది. ఆడి కార్ల సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో తాము పాల్గొన్నామని, అంతకు మించి మరేమీ లేదని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి, బాలీవుడ్‌ నటి నిమ్రత్‌ కౌర్‌తో రహస్యంగా డేటింగ్‌ చేస్తున్నాడనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

నిరూపిస్తే ఆస్తి మొత్తం రాసిస్తా

Submitted by arun on Tue, 09/04/2018 - 09:27

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ‘మా’ మరో వివాదంలో చిక్కుకుంది. సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో ‘మా’ నిధులు దుర్వినియోగం చేశారంటూ వస్తున్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. నిధులు దుర్వినియోగం అయినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఒక వర్గం అంటుంటే మరో వర్గం మాత్రం నిధుల దుర్వినియోగం జరిగింది వాస్తమేనంటోంది. మా..లో అసలేం జరిగింది. 

నా ఆస్తి మొత్తం రాసిస్తా : శివాజీరాజా

Submitted by nanireddy on Mon, 09/03/2018 - 13:20

 సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు రావడంతో సోమవారం  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) కార్యవర్గం స్పందించింది. మా అధ్యక్షుడు శివాజీ రాజా  మాట్లాడుతూ..  నా పిల్లల మీద ఒట్టు..నేను తప్పు చేశానని, డబ్బులు తిన్నానని నిరూపిస్తే నా ఆస్తి మొత్తం ‘మా’కు రాసిస్తాను.’ మా అసోసియేషన్‌ డబ్బులతో  ఇప్పటి వరకు టీ కూడా తాగలేదని, ఫోన్‌ కూడా సొంతదే వాడుతున్నానని తెలిపారు. ‘మా’ ఎన్నికల కోసం కొంతమంది ఎదురు చూస్తున్నారని, వాళ్లు తాము చేసే ప్రతి పనిని తప్పుబట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఇక శ్రీకాంత్ మాట్లాడుతూ..

గాలిలో ఎగురుతూ పవన్ కు విషెస్ చెప్పిన రామ్ చరణ్ !

Submitted by arun on Sun, 09/02/2018 - 13:57

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒళ్లుగగుర్బొడిచే విన్యాసాలు చేశాడు. గాల్లో పారాచూట్ విన్యాసాలు చేస్తూ బాబాయ్‌ని విష్ చేశారు. చెర్రీ సాహసోపేతమైన పారాగ్లైడింగ్‌ చేస్తున్న వీడియోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్‌ చేసిన ఉపాసన చరణ్ తరుపున ఓ మెసేజ్‌ను పోస్ట్ చేశారు. ‘ప్రియమైన బాబాయ్‌.. సినిమాల్లో.. జీవితంలో రిస్క్‌ చేసే ధైర్యాన్ని మీరు నాకిచ్చారు. అందుకే ఇది మీ కోసం. తొలిసారి పారాగ్లైడింగ్ చేస్తున్నా - రామ్‌ చరణ్‌’ అంటూ ట్వీట్ చేశారు.

‘యాత్ర’ ఫస్ట్ సాంగ్...

Submitted by arun on Sun, 09/02/2018 - 12:06

దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా ఆయన జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆనందోబ్రహ్మ చిత్రం ఫేమ్ మహీ రాఘవ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. వైఎస్ఆర్ పాత్ర‌లో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి కనిపించ‌నుండ‌గా, వైఎస్ విజయమ్మ పాత్ర కోసం బాహుబలి ఫేం ఆశ్రితని సెలక్ట్ చేసారు. అయితే ఈ రోజు వైఎస్ఆర్ 9వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా స‌మ‌రశంఖం అనే సాంగ్ విడుద‌ల చేసింది చిత్ర బృందం.