Movies

అందుకే ఆమెనుంచి విడాకులు తీసుకున్నా : ఆమిర్‌ ఖాన్‌

Submitted by nanireddy on Wed, 11/07/2018 - 08:58

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌. ఇటీవల.. కరణ్‌ జోహార్‌ చాట్‌ షోలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమిర్‌ మాట్లాడుతూ.. తన మాజీ భార్య రీనాకు విడాకులు ఇవ్వడం వెనుక ఉన్న కారణాలు వెల్లడించాడు. 'నా మాజీ భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చినంత మాత్రాన తనపై నాకు గౌరవం లేనట్లు కాదు. మేము విడిపోయే సమయంలో మా రెండు కుటుంబాలు కూడా చాలా బాధ పడ్డాయి. కానీ దమతుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాక కలిసి ఉండటంలో అర్థం లేదు. ఆమెపై నాకున్న ప్రేమ తగ్గిపోయింది. చాలా చిన్న వయసులోనే మాకు పెళ్లి అయింది బహుశా ఈ కారణం వల్లే అలా జరిగి ఉంటుంది.

రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ అదిరింది

Submitted by arun on Tue, 11/06/2018 - 14:40

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా దీపావళి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. మొదటగా ఈ చిత్రానికి ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.  నవంబర్‌ 9న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈసినిమాలో రామ్‌చరణ్‌కు జంటగా కియారా అడ్వాణీ నటించింది. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ఇందులో ప్రతినాయకుడి పాత్రలో నటించింగా, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ కొత్త లుక్‌లో ఆకట్టుకోనున్నారు.

కేర‌ళ సర్కార్ నుండి బన్నీకి ఆహ్వానం

Submitted by arun on Tue, 11/06/2018 - 11:36

తెలుగు అగ్రహీరోల్లో ఒకరైనా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌కి తెలుగులోనే కాదు మ‌ల‌యాళంలోను అభిమానుల ఆదరణ ఉన్న సంగ‌తి తెలిసిందే. కేర‌ళ‌లో అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయిందంటే అక్క‌డి అభిమానులకు పండగే. తాజాగా కేర‌ళ‌లో వ‌ర‌ద బీభ‌త్సానికి చాలామంది నిరాశ్ర‌యులు కాగా, వదర బాధితులకు బన్ని సాయంగా రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించి గొప్ప మ‌న‌సు చాటుకున్నాడు. దీంతో రియ‌ల్ హీరోగాను బ‌న్నీ మ‌ల‌యాళ అభిమానుల మ‌న‌సుల‌లో చెరగని ముద్ర వేసుకున్నాడు. అయితే నవంబర్ 10న కేర‌ళ ప్ర‌భుత్వం నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ నిర్వ‌హిస్తుంది.

సంక్రాంతి సంబరానికి ఎఫ్‌2 రెడీ..

Submitted by nanireddy on Tue, 11/06/2018 - 10:37

విక్టరీ వెంకటేష్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. వినోదాత్మకంగా సాగే ఎఫ్‌2(ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌) చిత్రషూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. వెంకటేష్ కు సరైన జోడిగా ఇందులో తమన్నా  నటిస్తుండగా.. వరుణ్ తేజ్ కు జంటగా మెహ్రీన్‌ నటిస్తుంది. చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. దీపావళి కానుకగా.. విడుదల చేసిన ఈ పస్ట్‌లుక్‌లో వెంకీ, వరుణ్‌, తమన్నా, మెహ్రీన్‌ ట్రెడిషనల్ గా ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు.

విశాల్.. 'నాన్న' ముచ్చట తీరుస్తాడా..?

Submitted by nanireddy on Tue, 11/06/2018 - 10:20

విశాల్ ఈ పేరంటే ముందుగా గుర్తుకు వచ్చేది అతను తెలుగువాడన్న విషయం.. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమా కెరీర్ ను ప్రారంభించి.. తెలుగు, తమిళ భాషల్లో హీరోగా నిలదొక్కుకున్నాడు. ఇటీవల వరుస విజయాలతో మాంచి ఊపుమీదున్న విశాల్.. ప్రస్తుతం తన నాన్న కోరికను తీర్చే పనిలో పడ్డాడు. స్వతహాగా తెలుగువాడైన విశాల్ తమిళంలో హీరోగా నిలదొక్కుకున్నాడు. అక్కడ నటించిన ప్రతి సినిమాను ఇక్కడ కూడా రిలీజ్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకు చేరువ అవుతున్నాడు. అయితే విశాల్ తండ్రి కృష్ణారెడ్డికి చాలా ఏళ్లుగా ఓ కోరిక ఉండేదట.. ఎప్పటికైనా తన కొడుకు విశాల్ చేత డైరెక్ట్ తెలుగు సినిమా తీయాలని..

రామ్‌చరణ్‌ కొత్త చిత్రం..ఫస్ట్‌లుక్‌ రేపే!

Submitted by arun on Mon, 11/05/2018 - 16:08

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, మాస్‌ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ కూడా ఖరారు కాలేదు. 'స్టేట్‌ రౌడీ' 'వినయ విధేయ రామ' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను మంగళవారం విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తాజాగా చిత్రవర్గాలు ట్విటర్ ద్వారా వెల్లడించాయి. ఈనెల6న ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి 9న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృం‎దం ప్రకటించారు.

‘RRR’ ప్రారంభోత్సవం రోజున బిగ్ సర్‌ప్రైజ్!

Submitted by arun on Mon, 11/05/2018 - 12:52

అగ్రసినీ దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్‌ చిత్రం రాబోతున్నవిషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించనున్నారు. కాగా ఈ చిత్రానికి ‘RRR’ గా పేరును వర్కింగ్‌ టైటిల్‌గా ఖరారు చేశారు. అయితే నవంబర్‌ 11న ఉదయం 11 గంటలకు ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు రాజమౌళి ప్రకటించారు అయితే అదేరోజున మరో సర్‌ప్రైజ్‌ కూడా ఉందట. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ అతిథిగా రాబోతున్నట్లు టాలీవుడ్‌ వర్గాలు జోరుగా ప్రచారం చేస్తున్నారు.

రజనీకాంత్ అభిమానులకు దీపావళి గిఫ్ట్...సోషల్‌ మీడియాలో హిస్టరీ క్రియేట్ చేస్తున్న 2.0

Submitted by arun on Sat, 11/03/2018 - 14:09

ఇండియన్‌ మోస్ట్ కాస్ట్ ఫిలిం సూపర్ స్టార్ రజనీ కాంత్ అప్ కమింగ్ మూవీ రోబో 2.ఓ ట్రైలర్‌ గ్రాండ్‌గా రిలీజైంది. బాహుబలిని మించిపోయేలా గ్రాఫిక్స్ తో రోబో 2. ఓ అలరించింది. విడుదలైన గంటల్లో ఈ ట్రైలర్‌ కు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. చెన్నైలో అట్ట‌హాసంగా జ‌రిగిన 2.ఓ ట్రైల‌ర్ లాంచ్ వేడుక‌లో సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు.  

హరితో సూర్య...సింగం 4 సిద్దామా?

Submitted by arun on Sat, 11/03/2018 - 11:16

తమిళ కథానాయకుడు సూర్య ప్రస్తుతం తన 37వ సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈసినిమాకి కేవీ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో మోహన్‌లాల్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే దీని తర్వాతి సినిమాకు సూర్య పచ్చజెండా ఉపినట్లు సమాచారం. 'సింగం' దర్శకుడు హరి ఈ ప్రాజెక్టును తెరకెక్కించనున్నట్లు సమాచారం. కాగా ఇది సింగం 4గా రాబోతోందా, లేక కొత్త కథతో సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. విభిన్న కథాంశంతో ఈ ప్రాజెక్టును తీయాలని హరి అనుకుంటున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

Tags

బంపర్ ఆఫర్ కొట్టేసిన 'ఆర్‌ఎక్స్‌ 100' హీరోయిన్

Submitted by arun on Sat, 11/03/2018 - 10:49

'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్నిచేసిన పాయల్‌ రాజ్‌పుత్‌. పాయల్ ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఉదయనిధి స్టాలిన్‌ కథానాయకుడు. కాగా పాయల్‌ తెలుగులో కొత్త ప్రాజెక్టుకు సంతకం చేశారు. రెండో సినిమాతోనే మాస్‌ మహారాజా రవితేజ సరసన నటించే అవకాశం కొట్టేశారు. ‌రవితేజ హీరోగా వి ఆనంద్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. టి. రామ్‌ నిర్మాత. ఇందులో ఓ కథానాయికగా 'నన్ను దోచుకుందువటే 'ఫేం నభా నటేష్‌ కనిపించనున్నారు. ఇప్పుడు మరో కథానాయికగా పాయల్‌ను దర్శక, నిర్మాతలు ఎంచుకున్నారు. ఆమె అయితే ఈ పాత్రకు బాగా సరిపోతారని వారు భావించారట.