ram gopal varma

టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న శ్రీరెడ్డి వ్యవహారం...వర్మ ఎంట్రీతో డబుల్ అయిన రచ్చ

Submitted by arun on Thu, 04/19/2018 - 16:26

శ్రీరెడ్డికి టాలీవుడ్‌కు మధ్య జరుగుతున్న పోరులో ఇప్పుడు రాంగోపాల్ వర్మ ఎంటరయ్యారు. ఆర్జీవీ రాకతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా భూకంపం వచ్చినంత పనైంది. ఈ ఇష్యూలో వర్మ ఎందుకు వేలు పెట్టారన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారింది. శ్రీరెడ్డి నిరసనతో మొదలైన చర్చ ఇప్పుడు వర్మ జోక్యంతో పెద్ద రచ్చకే తెరలేపింది.

డైరెక్టరా.. బ్రోకరా..శ్రీ ఎపిసోడ్‌లో వర్మ ప్లానేంటి?

Submitted by arun on Thu, 04/19/2018 - 13:41

టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. థ్రిల్లర్‌ సీరియల్‌కి ఏమాత్రం తగ్గకుండా కథ ఆసక్తికరంగా నడుస్తోంది. రోజుకో కొత్త పాత్ర ఎంటరవుతుంటే లేటెస్ట్‌గా పొలిటికల్‌ డ్రామా కూడా జతకలిసింది. ఇప్పుడు తాజాగా ఓ బ్రోకర్‌ కూడా వచ్చిచేరాడు. అతనెవరో కాదు ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ. 

శ్రీరెడ్డికి రాంగోపాల్ వర్మ రూ.5 కోట్ల ఆఫర్ ఎందుకు ఇచ్చారు..?

Submitted by arun on Thu, 04/19/2018 - 10:09

HMTV దగ్గరున్న శ్రీరెడ్డి ఆడియో టేప్ గురించి డైరెక్టర్ వర్మ ఏమంటున్నారు...? అసలు పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్ చేయమని శ్రీరెడ్డికి వర్మ ఎందుకు సలహా ఇచ్చారు..? ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కుటుంబంతో శ్రీరెడ్డికి ఉన్న వివాదంలో డీల్ సెటిల్ చేయడానికి ఆర్జీవీ ప్రయత్నించాడా..? రాంగోపాల్ వర్మ వెర్షన్ ఏంటి..?  

గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ కేసులో కొత్త ట్విస్ట్

Submitted by arun on Wed, 04/04/2018 - 10:20

గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ కేసులో.. కాంట్రవర్శీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మళ్లీ నోటీసులు పంపేందుకు రెడీ అవుతున్నారు. జీఎస్టీ మూవీ హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్లోనే జరిగినట్లు తాజాగా కంప్లైంట్ రావడంతో.. కేసు కొత్త టర్న్ తీసుకోనుంది.

జీఎస్టీ మూవీలో అసభ్యత, అశ్లీలత ఉందన్న అభియోగాలు, సామాజిక కార్యకర్త దేవిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వర్మపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరిలో ఆయనను విచారించి.. సెల్‌ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలు, సాక్ష్యాల కోసం వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు.

వర్మ కెరీర్ కు.. నాగ్ ఫ్యామిలీ ‘ఊపిరి’

Submitted by arun on Thu, 03/29/2018 - 11:33

రామ్ గోపాల్ వర్మ మామూలుగా ఎవరి మాటా వినని సీతయ్యగా ప్రసిద్ధుడు. కానీ.. యువ సామ్రాట్ నాగార్జున విషయానికి వచ్చే సరికి కామ్ అయిపోతాడు. శివ సక్సెస్ నుంచి ఇద్దరి మధ్యా మాంఛి అండర్ స్టాండింగ్ కూడా ఉంది. అందుకే.. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా.. రామ్ గోపాల్ వర్మతో కలిసి ఆఫీసర్ సినిమా చేశాడు.. నాగార్జున. డైరెక్ట్ సినిమాలు లేక.. వెబ్ సిరీస్ లతో కాలం గడిపేస్తున్న వర్మకు.. నాగ్ అవకాశం ఇవ్వడం అంటే.. అది మామూలు విషయం ఏమీ కాదు కదా.

శ్రీదేవిపై వర్మ.. మరోసారి!

Submitted by arun on Sat, 03/03/2018 - 09:30

అందాల తార శ్రీదేవి చనిపోయినప్పటి నుంచి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తన అభిమానాన్ని రకరకాలుగా ప్రదర్శించుకుంటూనే ఉన్నాడు. వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాను దాటి.. శ్రీదేవిపై తన అభిమానాన్ని సిల్వర్ స్క్రీన్ పై కూడా చూపించే పనిలో వర్మ పడ్డాడు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు.. ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

శ్రీదేవి గురించి గొప్ప నిర్వ‌చ‌నం చెప్పిన ఆర్జీవీ

Submitted by arun on Mon, 02/26/2018 - 11:26

అతిలోక సుందరి శ్రీదేవికి కోట్లాదిమంది అభిమానులున్నారు. ఎంతోమంది ఆరాధకులు, ఇష్టపడేవాళ్లు, ప్రేమించేవాళ్లూ ఉన్నారు. కానీ వాళ్లందరి ఆరాధన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అచంచలమైన ప్రేమకు సాటి రావు. ఏ విషయాన్నైనా ఎవరికీ భయపడకుండా, మొహమాటపడకుండా చెప్పే వర్మ.. శ్రీదేవిపై తన ప్రేమనూ అలాగే కొన్ని వందలసార్లు బహిరంగంగా వెల్లడించాడు. శ్రీదేవి కోసమే సినిమాల్లోకి వచ్చిన వర్మ ఆమెతో కలిసి ఉండే అవకాశం కోసమే ఆమెతో సినిమాలు తీశాడు. 

తిరిగి స్వర్గానికి వెళ్లిపోయారు : ఎన్టీఆర్‌

Submitted by arun on Sun, 02/25/2018 - 08:40

శ్రీదేవి మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ‘‘ఆమె వచ్చింది.. ఆమె చూసింది. ఆమె అందరినీ తన వశం చేసుకుంది. తను ఎక్కడినుంచైతే వచ్చిందో ఆ స్వర్గానికే తిరిగి వెళ్లిపోయింది. శ్రీదేవిగారి ఆత్మకు శాంతి కలగాలి. ఆమె లేని లోటు పూడ్చలేనిది’’ అని ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ ట్వీట్‌కు వర్మ రిప్లై ఇచ్చారు. ‘ఎప్పటికీ మరచిపోలేని అత్యంత అందమైన సోల్’ అని పేర్కొన్నారు వర్మ. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్‌ని షేర్ చేసిన అనుపమా పరమేశ్వరన్.. ‘ఇది నమ్మలేకపోతున్నాను’ అని రీ ట్వీట్ చేసింది.


 

ఇంతలా దేవుణ్ని ఎప్పుడూ ద్వేషించలేదు : వర్మ

Submitted by arun on Sun, 02/25/2018 - 08:31

అతిలోక సుందరి శ్రీదేవి మరణంతో బాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమె మృతిపట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఆమెను ఒక దేవతలా ఆరాధిస్తారు. అలాంటిది ఆయన ఆరాధ దేవత దివంగతులయ్యారన్న వార్త ఆయనను కలచివేస్తోంది. వరుస ట్వీట్స్‌తో ఆయన తన బాధను వెల్లడిస్తున్నారు.
 

ఆర్జీవీ అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లేనా..?

Submitted by arun on Tue, 02/20/2018 - 16:08

రాంగోపాల్ వర్మ చుట్టూ.. జీఎస్టీ ఉచ్చు బిగుస్తోందా.? ఆర్జీవీ అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లేనా..? సీసీఎస్ పోలీసుల నెక్ట్స్ స్టెప్ ఏంటి.? వర్మకు ఇప్పుడు శుక్రవారం టెన్షన్ పట్టుకుందా.?