Penumaka

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తున్న గుంటూరు చోరీ కేసు...కోడలు శివపార్వతి చుట్టూ తిరుగుతున్న విచారణ

Submitted by arun on Fri, 06/15/2018 - 15:51

సంచలనం సృష్టించిన గుంటూరు చోరీ ఘటన.. కీలక మలుపు తిరిగింది. తెలిసిన వారే ఈ చోరీ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. తాజాగా కుటుంబ సభ్యుల సహకారంతోనే దుండగులు దోచుకున్నారని.. తేల్చారు. దొంగతనంలో పాలు పంచుకున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్న పోలీసులు కీలక సమాచారం తెలుసుకున్నారు. ముఖ్యంగా కోడలు.. శివపార్వతిపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమెను ప్రత్యేకంగా విచారిస్తున్నారు. 

సంచలనం సృష్టించిన గుంటూరు చోరీని ఛేదించిన పోలీసు

Submitted by arun on Fri, 06/15/2018 - 12:33

గుంటూరులో సంచలనం సృష్టించిన చోరీ కేసును.. పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. తాడేపల్లి మండలం పెనుమాకలో.. పట్టపగలే కోటికి పైగా నగదుతో ఉడాయించిన దుండగులను పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ ఫూటేజ్  ఆధారంగా.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. దగ్గరి బంధువుల పనే అని తేల్చారు. నిన్న ఉదయం 11 గంటల 30 నిముషాల సమయంలో.. మేకా వేమారెడ్డి ఇంట్లోకి ముగ్గురు వ్యక్తులు ప్రవేశించి.. అడ్రస్ అడుతుతూ.. ఇంట్లోని వారిపై దాడి చేశారు. బీరువాలో ఉన్న కోటికి పైగా నగదుతో పాటు.. 20 సవర్ల బంగారాన్ని అపహరించుకుపోయారు. రాజధానితో పాటు.. సీఎం నివాసానికి కూతవేటు దూరంలో ఘటన జరగడంతో.. పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.