love affair

వివాహితతో ప్రేమ వ్యవహారం: ముగ్గురు బలి

Submitted by arun on Fri, 08/03/2018 - 16:52

పశ్చని సంసారంలో ఫేస్‌బుక్‌ చిచ్చుపెట్టింది. ఫేస్‌బుక్‌ ప్రేమ ముగ్గురి ప్రాణాలు బలి తీసుకుంది. ఇప్పటికే భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోగా తాజాగా ఈ వ్యవహారానికి బాధ్యుడిగా భావిస్తున్న యువకుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జంగారెడ్డి గూడేనికి చెందిన మురళికి రాజమండ్రికి చెందిన బిందుతో కొన్నాళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. బిందు లక్కవరంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చిన క్రమంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అయితే, బిందు భర్త సాయికి ఫోన్‌ చేసిన మురళి బిందు తనను ప్రేమిస్తోందనీ, ఆమెను తనకు వదిలేయాలని బెదిరించాడు. మురళి మాటలకు తీవ్ర మనస్తాపానికి గురైన సాయి గత నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రియుడు మోసం చేయడంతో సెల్‌ టవర్‌ ఎక్కిన యువతి...

Submitted by arun on Fri, 07/13/2018 - 14:36

నల్లగొండ జిల్లా వలిగొండలో జ్యోతి అనే యువతి టవరెక్కింది.  ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగింది. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం చందుపట్ల గ్రామానికి చెందిన పల్లపు జ్యోతి, వలిగొండ మండల కేంద్రానికి చెందిన రావుల భాస్కర్ గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రేమ అన్నప్పుడు తనతో సరదాగా సమయం గడిపిన ప్రియుడు పెళ్లి మాట ఎత్తేసరికి దూరంగా ఉంటున్నాడు. పెళ్లి చేసుకోవాలని భాస్కర్‌ను గట్టిగా నిలదీయడంతో అందుకు అతడు నిరాకరించాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని యువతి వాపోయారు. ఇంకో పెళ్లికి సిద్ధపడుతున్నాడని ఆరోపిస్తూ..

ప్రియుని ఇంటి ముందు తెలంగాణ యువతి ఆందోళన

Submitted by arun on Mon, 07/02/2018 - 17:38

తనను ప్రేమించి మోసం చేశాడని ఓ ప్రియురాలు విశాఖలోని రావికమతంలోని ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి హల్‌చల్ చేసింది. తెలంగాణలోని నల్గొండ జిల్లా కోదాడ గ్రామానికి చెందిన యువతి కుమారి(22), విశాఖపట్నం జిల్లా రావికమతం మండలంలోని గర్నికం గ్రామానికి చెందిన ఆర్లె శివను  (23) ప్రేమించింది. ఆర్లె శివ ఏడాది క్రితం నల్గొండలో బీటెక్‌ చదివాడు. ఈ క్రమంలో శివ, కుమారిని ప్రేమించాడు. తర్వాత ఆమెను తప్పించుకు తిరగడం ప్రారంభించాడు. దీంతో కుమారి అతనిపై ఏడాది క్రితమే కోదాడ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. అయితే శివ కేసు భయంతో ఇక్కడికి వచ్చేశాడని ఆమె వివరించింది.

ప్రేమించుకున్న అన్నాచెల్లెలు...పెద్దల మందలింపుతో...

Submitted by arun on Fri, 06/29/2018 - 13:27

మైనర్లైన వారు వరుసకు అన్నాచెల్లెలు. కానీ, ప్రేమించుకున్నామని వారు చెప్పడంతో పెద్దలు తీవ్రంగా మందలించారు. దీంతో రైలుకింద పడి వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన తమిళనాడులోని తిరుచ్చిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుచ్చి జీయపురం, కీళ కారియపట్టికి చెందిన అశోక్ కుమార్‌ కుమార్‌ ప్రవీణ్‌(17) ప్లస్‌ టూ చదువుతున్నాడు. ఇతను అదే ప్రాంతానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని(14)ని ప్రేమించాడు. వీరిద్దరూ ఒకే కులానికి చెందిన వారు.. పైగా వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారు. అయితే వీరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇద్దరిని మందలించారు.

ప్రేమ వ్యవహారం.. భవనంపై నుంచి దూకిన యువతి

Submitted by arun on Wed, 06/20/2018 - 13:34

హైదరాబాద్ ముషీరాబాద్‌లో పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పాలిటెక్నిక్ చదువుతున్న సనా తన తల్లిదండ్రుల కళ్ల ముందే భవనంపై నుంచి దూకింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. సన స్వస్థలం పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం రొంపిగుంట గ్రామం. సన ముషీరాబాద్ ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతోంది. సనా ఓ అబ్బాయితో ప్రేమలో ఉన్నట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి బుధవారం కళాశాల దగ్గరకు వచ్చారు. దీంతో సనా తల్లిదండ్రుల ముందే హాస్టల్‌ భవనం మూడో అంతస్తు మీద నుంచి కిందకు దూకింది.

ఫేస్‌బుక్‌ ప్రేమికుని ఆత్మహత్య .. పరారీలో ప్రియురాలు

Submitted by arun on Tue, 06/19/2018 - 12:18

ఫేస్ బుక్ కేంద్రంగా తాను సాగించిన ప్రేమ విఫలమైందన్న కారణంతో ఓ ప్రియుడు ఆత్మహత్య చేసుకోగా, ప్రస్తుతం పరారీలో ఉన్న అతని ప్రియురాలు, ఆమె సోదరుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కర్ణాటకలోని గౌరిబిదనూరు సమీపంలో జరిగిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే, గౌరిబిదనూరులోని నెహ్రూ నగర్‌లో నివసిస్తున్న రంజిత్‌కుమార్‌ (24) అనే యువకుడు తన ప్రేమ వైఫల్యంపై సెల్‌ఫోన్‌లో మరణ వాంగ్మూలాన్ని వీడియో రికార్డ్‌ చేసి శనివారం ఫేస్‌బుక్‌లో పెట్టాడు. ఆవేదన తట్టుకోలేక ఆదివారం ఉదయం పురుగుల మందు తాగి తరువాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే.

కరీంనగర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం

Submitted by arun on Fri, 06/15/2018 - 12:24

కరీంనగర్‌ జిల్లాలో శుక్రవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. కలెక్టర్‌ కార్యాలయానికి ముందే ఓ యువతిని ప్రేమోన్మాది గొంతుకోసి హత్య చేశాడు. రక్తపు మడుగులో పడిఉన్న యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. కాటారం మండలం శంకరంపల్లి గ్రామానికి చెందిన వంశీధర్, గోదావరిఖనికి చెందిన రసజ్ఞ మధ్య గత మూడు సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం ఉందని తెలుస్తోంది. నిత్యం వంశీధర్ వేధింపులకు గురిచేయడంతో కొద్దిరోజులుగా రసజ్ఞ అతడికి దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితమే జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉన్న మీసేవా కేంద్రంలో రసజ్ఞ ఉద్యోగంలో చేరింది.