Sabitha Indra Reddy

సబిత ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్‌కు బిగ్ షాక్

Submitted by chandram on Thu, 11/15/2018 - 15:35

కాంగ్రెస్ పార్టీకి నిరసనల సెగ రోజు రోజుకి అధికమవుతోంది. టికెట్లు వస్తయని ఆశపడి చివరకు టికెట్లు దక్కపోవడంతో రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మరికొందరైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇదే తరహాలో మరో కీలక నేత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా బాటపడ్డాడు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి సీటు దక్కలేదని తీవ్రమనస్తాపనికి గురై ఆయన నేడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజేంద్రనగర్ సీటిస్తారో లేక తన రాజీనామా ఆమోదిస్తారో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలని కార్తీక్ డిమాండ్ చేశారు.

వైఎస్ఆర్ బయోపిక్ .. సబితగా సుహాసిని!

Submitted by arun on Fri, 06/15/2018 - 12:17

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథను యాత్ర' పేరుతో తెరపై ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ పాత్రలో ప్రముఖ మలయాళ హీరో మమ్ముట్టి కనిపించనున్నారు. ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ పాత్రలో ‘బాహుబలి’ ఫేం అశ్రితా వేముగంటి నటించనున్నారు. ఇక వైఎస్ వ్యక్తిగత సహాయకుడు సూరీడు పాత్రకు పోసాని కృష్ణమురళీని ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు ఈ బయోపిక్‌లోకి సీనియర్ నటి, దర్శకుడు మణిరత్నం భార్య సుహాసిని ప్రవేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రను ఆమె పోషించనున్నారు.