rajkumar rao

'న్యూట‌న్' క‌లెక్ష‌న్ వివ‌రాలు

Submitted by nanireddy on Tue, 09/26/2017 - 12:59

ఈ ఏడాదికిగానూ ఆస్కార్‌కి ఎంపికైన భార‌తీయ చిత్రం 'న్యూట‌న్‌'. రాజ్‌కుమార్ రావ్ టైటిల్ రోల్‌లో న‌టించిన ఈ హిందీ చిత్రం శుక్ర‌వారం వెండితెర‌పైకి వ‌చ్చింది. రిలీజ్ అయిన రోజు క‌లెక్ష‌న్లు వీక్‌గా ఉన్నా.. మౌత్ టాక్‌తో ఈ సినిమా ఆ త‌రువాత మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకుంటోంది. శుక్ర‌వారం రూ.96 ల‌క్ష‌లు, శ‌నివారం రూ.2.52 కోట్లు, ఆదివారం రూ.3.42 కోట్లు, సోమ‌వారం రూ.1.31 కోట్లు రాబ‌ట్టిందీ సినిమా. నాలుగు రోజుల‌కిగానూ.. రూ.8.21 కోట్లు న‌మోద‌యిందన్న‌మాట‌.

'న్యూట‌న్'.. జ‌స్ట్‌ సూప‌ర్‌

Submitted by nanireddy on Sun, 09/24/2017 - 13:23

90వ అకాడ‌మీ అవార్డ్స్ (ఆస్కార్‌)కి ఎంపికైన భార‌తీయ చిత్రం 'న్యూట‌న్‌'. ఉత్త‌మ విదేశీ చిత్రం అనే విభాగంలో ఈ సంవ‌త్స‌రానికి గానూ ఆస్కార్‌కి ఎంపికైన 'న్యూట‌న్‌'.. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రాజ్‌కుమార్ రావ్‌, అంజ‌లి పాటిల్ ('నా బంగారు త‌ల్లి' ఫేమ్‌) , పంక‌జ్ త్రిపాఠి, ర‌ఘ‌బీర్ యాద‌వ్‌, సంజయ్ మిశ్రా ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి అమిత్ వి.మ‌సుర్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బెర్లిన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ప్ర‌ద‌ర్శిత‌మై ప్ర‌శంస‌లు పొందిన ఈ 106 నిమిషాల సినిమా.. 350 భార‌తీయ స్క్రీన్స్‌లో శుక్ర‌వారం విడుద‌లైంది.

ఆస్కార్‌కి ఎంపికైన 'న్యూట‌న్‌'

Submitted by nanireddy on Fri, 09/22/2017 - 18:01

ఆస్కార్‌.. ప్ర‌పంచ‌ చ‌ల‌న చిత్ర సీమ  ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించే పుర‌స్కారం పేరిది. ప్ర‌తి ఏటా ఫిబ్ర‌వ‌రి నిర్వ‌హించే ఈ అంత‌ర్జాతీయ పుర‌స్కారాల వేడుక‌కి.. ఎప్ప‌టిలాగే  ఈ ఏడాది కూడా ఓ భార‌తీయ సినిమా ఎంపికైంది.  ఆ చిత్ర‌మే 'న్యూట‌న్‌'. రాజ్‌కుమార్ రావ్ ముఖ్య పాత్ర‌లో న‌టించిన ఈ హిందీ సినిమా ఈరోజు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. స‌రిగ్గా ఈ రోజే ఈ సినిమా ఆస్కార్ కి ఎంపికైంద‌నే వార్త రావ‌డం విశేషం.