Sex Racket

అమెరికా సెక్స్ రాకెట్: పూనమ్ షాకింగ్ కామెంట్స్

Submitted by arun on Thu, 06/28/2018 - 16:36

కాస్టింగ్ కౌచ్ గురించి మరిచిపోకముందే అమెరికాలో చికాగో సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ దందా సాగిస్తున్న కిషన్ మోదుగుమూడి - అతడి సతీమణీ చంద్రలను అమెరికా పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు. ఈ కేసు ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అమెరికా పోలీసులు ఈ కేసులో ఇప్పటికే సంచలన వాస్తవాలు వెలుగులోకి తీసినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ చికాగో సెక్స్ రాకెట్ గురించి మరో బాంబు పేల్చింది. 

బెజవాడలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు

Submitted by arun on Thu, 06/21/2018 - 16:39

విజయవాడ జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో వ్యభిచారకూపం గుట్టు రట్టైంది. యువతులను ట్రాప్ చేసి.. వ్యభిచారకూపంలోకి దించుతున్న శోభారాణి అనే మహిళ బండారం బయటపడింది. ఏడాది క్రితం ఇంటి నుంచి పారిపోయి వచ్చిన ఓ యువతికి.. పని ఇప్పిస్తానని చెప్పి ఓ ఆటో డ్రైవర్ ఆమెను వ్యభిచారగృహానికి 20 వేలకు అమ్మేశాడు. అలా.. ఏడాదిగా ఆ యువతి నరకం అనుభవిస్తోంది. ఇప్పుడు స్థానికుల సాయంతో.. వ్యభిచారకూపం నుంచి బయటపడింది.

షికాగో సెక్స్‌ రాకెట్‌: ఆడియో టేపుల కలకలం

Submitted by arun on Tue, 06/19/2018 - 13:43

ఫిల్మ్ ఇండస్ట్రీలో.. షికాగో సెక్స్ రాకెట్ ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే బయటికొచ్చిన కీలక సూత్రధారి కిషన్ ఆడియో టేపులు.. కలకలం రేపుతున్నాయి. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టాలీవుడ్‌లో ఇంత జరుగుతున్నా.. ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.

సెక్స్‌ రాకెట్‌.. మహిళా సంఘాల మండిపాటు

Submitted by arun on Mon, 06/18/2018 - 17:19

టాలీవుడ్ పెద్దలపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. సినిమా అవకాశాల పేరుతో మహిళలపై లైంగిక వేధింపులు, అక్రమ రవాణా జరుగుతున్నాయని సామాజికవేత్త దేవి ఆరోపించారు. సినీరంగంలో మహిళలను ఆట వస్తువులుగా భావిస్తున్నా తగిన చర్యలు తీసుకోవడంలో  సినీ పెద్దలు విఫలమయ్యారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో వ్యభిచార ముఠా నడిపి టాలీవుడ్ పరువు తీసిన  కో డైరెక్టర్ కిషన్ దంపతులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దేవి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ల పేర్లు వినబడుతున్నా  సిని'మా' పెద్దలు ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు.

అమెరికాలో టాలీవుడ్ హీరోయిన్స్‌తో వ్యభిచారం...హీరోయిన్‌ ఫిర్యాదుతో గుట్టు రట్టు చేసిన అమెరికా పోలీసులు

Submitted by arun on Thu, 06/14/2018 - 13:01

ఎన్నో ఆశలతో..హీరోయిన్ గా వెలిగిపోవాలని..ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న కొంతమంది తారల పరిస్థితి తారుమారువుతోంది. తెరపై తళుక్కుమని వెలిగే జీవితాల వెనుక..ఓ వికృత క్రీడ దాగివుంది. అవకాశాల కోసం ఎదురుచూసే హీరోయిన్లకు..డబ్బు ఆశ చూపించి గాలం వేస్తున్నారు కొంతమంది దుర్మార్గులు. ఇండియాలో కాదు..ఏకంగా అమెరికాలోనే హైటెక్ వ్యభిచారం నడిపిస్తున్నారు.