ysrcp

ఈనెల 7న జగన్‌ సమక్షంలో పార్టీలో చేరనున్న సిద్ధార్ధ్‌ రెడ్డి

Submitted by arun on Fri, 07/06/2018 - 14:20

ఇటీవల కాలంలో వైసీపీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజక వర్గానికి చెందిన యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్ద్‌ రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం, వారి కోరికే మేరకు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్టు సిద్ధార్ధ్‌ రెడ్డి తెలిపారు. ఈనెల 7వ తేదిన వైఎస్‌ జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.

సీనియర్ టీడీపీ నేత కుమారుడు వైసీపీలోకి !

Submitted by arun on Fri, 06/29/2018 - 13:46

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యర్రా నారాయణస్వామి కుమారుడు నవీన్ వైసీపీలో చేరనున్నారు. వైసీపీ నేత, ఉండి ఎమ్మెల్యే సర్రాజు ఆయనతో జరిపిన మంతనాలు సఫలీకృతమయ్యాయి. పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని... వైసీపీలోకి రావాలంటూ సర్రాజు ఆహ్వానించడంతో... నవీన్ అంగీకరించారు. త్వరలోనే పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వాస్తవానికి తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నారాయణస్వామి రాజకీయ జీవితం గడుపుతున్నారు. అప్ప ట్లోనే జడ్పీ చైర్మన్‌గా ఆయన తిరుగులేని నాయకత్వ పటిమ ప్రదర్శించారు. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్నందున నారాయణస్వామి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎనలేని గౌరవం.

Tags

వైసీపీ ఎంపీల రాజీనామాలకు ఆమోదం...ఆసక్తికరంగా మారిన ఉపఎన్నికల అంశం

Submitted by arun on Fri, 06/22/2018 - 10:35

ఎట్టకేలకు వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందాయి. గత ఎప్రిల్‌లో చేసిన రాజీనామాలకు.. ఇప్పుడు రాజముద్ర పడింది. దీనికి సంబంధించిన బులిటెన్‌ను.. లోక్‌సభ స్పీకర్ కార్యాలయం విడుదల చేసింది. మరి వీరి రాజీనామాలతో ఖాళీ అయిన 5 ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలకు అవకాశం ఉందా..? అసలు  ప్రజా ప్రాతినిద్య చట్టం ఏం చెబుతోంది..? 

లోకేశ్‌ ట్విట్టర్‌ నాయుడులా వ్యవహరిస్తున్నారు

Submitted by arun on Mon, 06/18/2018 - 17:05

ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌పై వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు విరుచుకుపడ్డారు. అవగాహన లేకుండా నియోజకవర్గాల అభివృద్ది గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్పెషల్ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ ఇవ్వాలని 36 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సీఎంను కలిసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. నియోజకవర్గాలకు నిధులిచ్చామంటూ ట్విట్టర్‌లో చెప్పిన లోకేశ్‌ను...ట్విట్టర్‌ నాయుడుగా లోకేశ్‌ వ్యవహరిస్తున్నారని శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నియోజక వర్గ నిధులపై మంత్రి లోకేశ్‌ చేసిన విమర్శలు అర్థరహితమన్నారు.

ఆ సీటు బీజేపీకి ఇవ్వడం వల్లే దెబ్బతిన్నాం: చంద్రబాబు

Submitted by arun on Thu, 06/14/2018 - 11:22

ఓడిపోతామనే భయంతోనే ఉప ఎన్నికలు రాకుండా.. వైసీపీ ఎంపీలు రాజీనామా డ్రామాలు ఆడారని సీఎ చంద్రబాబు విమర్శించారు. బైపోల్స్ వస్తే 5 పార్లమెంట్‌ స్థానాల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయేదన్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో చంద్రబాబు అమరావతిలో సమావేశమయ్యారు. 2014లో తిరుపతి ఎంపీ సీటు బీజేపీకి ఇవ్వడం వల్లే దెబ్బతిన్నామని చెప్పారు. బీజేపీ, వైసీపీ కుట్ర రాజకీయాలపై.. ప్రజల్ని చైతన్య పరచాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ఐక్యంగా పనిచేస్తే తిరుపతి ఎంపీ సీటుతో పాటు 7 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలుపు తథ్యమని తిరుపతి నేతలతో చంద్రబాబు చెప్పారు. బీజేపీ, వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని..

వైసీపీ... ఓ డ్రామాల పార్టీ

Submitted by arun on Tue, 06/05/2018 - 17:07

వైసీపీ... ఓ డ్రామాల పార్టీ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. వైసీపీ ఎంపీల రాజీనామాలు కూడా డ్రామాలేనన్న చంద్రబాబు ఉపఎన్నికలు రాకూడదనే రాజీనామాలు ఆమోదించుకోవడం లేదని ఆరోపించారు. బీజేపీ, వైసీపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయన్న చంద్రబాబు స్పీకర్‌ను కలిసి రాజీనామాలు ఆమోదించకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజీనామాలు ఆమోదించుకుని వస్తే టీడీపీ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. ఉపఎన్నికలు వచ్చుంటే బీజేపీ, వైసీపీని చిత్తుచిత్తుగా ఓడిస్తామన్న చంద్రబాబు 2019 ఎన్నికలు ఎలా ఉండేవో ఇప్పుడే తేలిపోయేదన్నారు.

ప్రజల చెవుల్లో పువ్వుల నుంచి క్యాలీఫ్లవర్ల వరకు పెట్టారు

Submitted by arun on Tue, 06/05/2018 - 14:33

ఏపీలో మోదీ ప్రేరేపిత రాజకీయాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు చిత్తూరు ఎంపీ శివప్రసాద్. 2015లో రాజీ డ్రామాలు మొదలుపెట్టిన వైసీపీ ఎంపీలు ఇంకా కొనసాగిస్తున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల చెవుల్లో పువ్వుల నుంచి క్యాలీఫ్లవర్ల వరకు అన్ని పెట్టారంటూ శివ ప్రసాద్ వ్యాఖ్యానించారు.  సీఎం చంద్రబాబు జాతీయ స్ధాయిలో చక్రం తిప్పుతారని మోడీ భయపడుతున్నారంటూ శివ ప్రసాద్ ఎద్దేవా చేశారు.  

వైసీపీలోకి ఇద్దరు మంత్రులు?

Submitted by arun on Tue, 06/05/2018 - 13:33

ఏపీలో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. పార్టీల‌న్నీ స‌న్నాహాల్లో ఉన్నాయి. ఓవైపు హోదా ఉద్య‌మంలో బిజీగా గ‌డుపుతూనే మ‌రోవైపు సొంత ఇంటిని చ‌క్క‌దిద్దుకోవ‌డంపై కూడా దృష్టిపెట్టాయి. అందుకు త‌గ్గ‌ట్టుగా నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ప‌రిస్థితిని త‌మ‌కు సానుకూలంగా మ‌ల‌చుకోవాల‌నే ప్ర‌య‌త్నంలో జ‌గ‌న్ త‌లామున‌క‌లైన‌ట్లు స‌మాచారం. ఆపరేషన్ ఆకర్ష్ సీజన్లో బైటిపార్టీలనుంచి అధికారపార్టీలోకొచ్చి చేరిన వారు కొంత అసంతృప్తితో వున్నట్లు కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరి.. ఎటువంటి ప్రత్యేక లబ్ది పొందనివారి విషయంలో ఇటువంటి రూమర్లు పుట్టడం సహజం. కానీ..

Tags

వెనక్కు తగ్గేది లేదు...

Submitted by arun on Tue, 05/29/2018 - 12:54

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలువనున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని కోరనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కంటే పదవులు ముఖ్యం కాదని వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా ఏప్రిల్‌ 6న స్పీకర్‌ ఫార్మాట్‌లో ఎంపీలు రాజీనామాలు చేశారు.

జడ్పీ సమావేశంలో రగడ..ఎమ్మెల్యే మీదకు నేమ్ ప్లేట్స్‌ విసిరిన సుబ్రహ్మణ్యం

Submitted by arun on Thu, 05/24/2018 - 14:11

ప్రొటోకాల్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారి సభ్యుల మధ్య రసాభాసకు దారి తీసింది. కడప నగరంలో జడ్పీ సమావేశ మందిరంలో చైర్మన్ గూడూరు రవి అద్యక్షతన సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభంలోనే ప్రొటోకాల్ పై చర్చ జరిగింది. ఈ వ్యవహారం వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వివాదానికి దారి తీసింది. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్న తనను కాదని.., ఓటమి పాలైన వరదరాజుల రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో అధికార పార్టీ సభ్యులు అడ్డుతగిలి వివాదానికి దిగారు. చివరి కలెక్టర్‌ హరికిరణ్‌ జోక్యం చేసుకోవడంతో... వివాదానికి తెరపడింది.