Apoorva

రూ. 40 వేలు రేటు కట్టారు.. నటి అపూర్వ కంప్లైంట్

Submitted by arun on Thu, 06/14/2018 - 16:12

వెబ్ సైట్‌లో తన ఫొటో పెట్టి 40వేలు రేటు కట్టారంటూ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది నటి అపూర్వ. దీంతో తీగ లాగితే డొంక కదిలిందన్న చందంగా ఆన్ లైన్ మాధ్యమంగా మాజీ ప్రిన్సిపాల్ చొక్కారపు గణేష్ చేస్తున్న అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. కాల్‌గర్ల్స్‌ అంటూ హీరోయిన్ల ఫోటోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశాడు. ఒక్కో హీరోయిన్‌కు...ఒక్కో రేటు ఫిక్స్‌ చేశాడు.  గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక గణేష్ పెట్టిన పోస్టింగ్స్ లో కేవలం హీరోయిన్ల ఫొటోలు మాత్రమే కాకుండా, కొంతమంది కాలేజీ అమ్మాయిల చిత్రాలు కూడా ఉండటంతో, అవి ఎవరివన్న కోణంలోనూ పోలీసులు విచారణ ప్రారంభించారు.

బన్నీ పబ్ లో కలిస్తే..అదే అడిగేవారు : అపూర్వ

Submitted by arun on Thu, 06/14/2018 - 11:52

తాను సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో పబ్ కల్చర్ చాలా బాగా అనిపిచ్చేదని, నిత్యం పబ్‌లకు వెళ్లేవాళ్లమని నటి అపూర్వ చెప్పారు. తాము రెగ్యులర్‌గా వెళ్లే టచ్ పబ్‌కు బన్నీ కూడా వచ్చేవారని వెల్లడించారు. ఓ వెబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అపూర్వ ఈ విషయాలు చెప్పుకొచ్చారు. తాము రెగ్యులర్‌గా వెళ్లే టచ్ పబ్‌కు బన్నీ కూడా వచ్చేవారని వెల్లడించారు. మేం వెళ్లే టచ్ బప్ కి బన్నీ కూడా వచ్చేవారని..నేనెప్పుడైనా ఎదురుపడితే ఏంటండీ పబ్‌లో కనిపించట్లేదు అంటూ బన్నీ సరదాగా అనేవారు. అంత ఫన్నీగా ఉండేవాళ్లం. ఒక ఏజ్‌లో ఆ రకమైన కల్చర్ ఉంటుంది  అని అపూర్వ వెల్లడించారు.