fake baba

పుత్ర సంతానానికి నిమ్మకాయ మందు...రోగం ఏదైనా బురిడిబాబాను దర్శిస్తే మాయం

Submitted by arun on Fri, 08/17/2018 - 12:12

నిమ్మకాయలతో సంతానం కల్గిస్తాను...మీకు పట్టిన దయ్యం...భూతం వదిలిస్తానంటూ మాయమాటలతో అమాయకులను బురిడీకొట్టిస్తున్నాడు మరో నకిలీబాబా.  చేతబడులు నయం చేస్తానంటూ అమాయకుల జీవితాలతో చెలగాటమాడుతున్న దొంగబాబ భాగోతం వికారాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. 

Tags

బురిడీ బాబా అరెస్ట్

Submitted by arun on Sat, 07/14/2018 - 10:11

నమ్మినవారిని నట్టేట ముంచుతున్నారు కొందరు దొంగబాబాలు. జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా మరో బురిడీ బాబా బాగోతం వెలుగులోకి వచ్చింది. పూజలు, యజ్ఞాలు చేస్తే నగలు రెండింతలు అవుతాయని జనం సొమ్ములు కాజేస్తున్న ఆ దొంగబాబాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

కాషాయ దుస్తుల్లో కనిస్తున్న వీడే బురిడీ బాబా. పేరు రామశివానంద పుట్టింది కేరళలో. చిన్నప్పటి నుంచే సన్యాసం తీసుకున్న శివానంద వేదమంత్రాల పేరుతో జనాన్ని మోసం చేయడం ప్రారంభించాడు. ఎలాంటి సమస్యకైనా తన యజ్ఞ, యాగాలతో పరిష్కారం చూపుతానంటూ అమాయకుల్ని మోసం చేస్తున్నాడు. 

మత గురువుకు శిష్యురాళ్ల దేహశుద్ధి

Submitted by arun on Wed, 12/27/2017 - 17:47

ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో మత గురువుకు శిష్యురాళ్లు దేహశుద్ధి చేశారు. ఆశ్రమం నుంచి గురువును బంధువుల సాయంతో జట్టు పట్టుకుని బయటకు లాక్కొచ్చారు. అర్ధనగ్నం చేసి లాఠీలతో చితకబాదారు. భగవద్గీత నేర్పిస్తానని శిష్యురాళ్లను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు  కామాంధ గురువు. 

మరో దొంగ బాబా బండారం బట్టబయలు

Submitted by lakshman on Fri, 09/22/2017 - 17:19
  • పండంటి పడతులూ వాంఛకు ఫలహారమే
  • ఓ యువతి ఫిర్యాదుతో బయటపడ్డ బండారం
  • రక్తపోటు పెరిగిందంటూ ఆస్పత్రిలో చేరిక

జైపూర్: దేశంలో రోజుకో బాబా బండారం బయుటపడుతోంది. మొన్న ఆశారాం బాపు. నిన్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్... ఇవాళ ఫలహారి బాబా... వీళ్లలో ఎక్కువమంది చెప్పేవి శ్రీరంగనీతులు... చేసేవి తప్పుడు పనులే. వీళ్లలో ఇద్దరు ఇప్పుడు జైళ్లలో ఉన్నారు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో స్వయంప్రకటిత ‘ఫలహారి’ బాబా ఈ కోవకు చెందినవాడే. పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటాడు.