asramam

నిత్యానంద నుంచి నా భార్యను విడిపించండి

Submitted by arun on Tue, 06/12/2018 - 11:08

వివాదాస్పద ఆథ్యాత్మికవేత్త నిత్యానంద మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నిత్యానంద ఆశ్రమం నుంచి తన భార్యను విడిపించాలంటూ తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి నమక్కల్ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశాడు. రాశిపురం తాలూకా పట్టణం మునియప్పపాళయం ప్రాంతానికి చెందిన రైతు రామస్వామి. ఇతని భార్య అత్తాయి (50). రామస్వామి తన భార్య నిత్యానంద ఆశ్రమంలో ఉన్నారని, ఆమెను విడిపించాలని నామక్కల్‌ జిల్లా కలెక్టర్‌కు ఒక పిటిషన్‌ అందజేశారు. అందులో.. తన భార్య అత్తాయి, కుమారుడు పళనిస్వామి కొన్ని నెలల కిందట బెంగళూరులోని నిత్యానంద మఠానికి ధ్యానం చేసేందుకు వెళ్లారని, తర్వాత వారు తిరిగి రాలేదని తెలిపారు.