Bigg Boss 2

బిగ్‌బాస్ సెట్లో ప్రమాదం... ఒకరి మృతి

Submitted by arun on Mon, 09/10/2018 - 16:02

బిగ్‌బాస్‌ షూటింగ్‌ సమయంలో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తమిళ బిగ్‌బాస్‌ కార్యక్రమానికి సంబంధించిన చిత్రీకరణ సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పూందమల్లి సమీపంలోగల సెంబరంబాక్కం ప్రాంతంలో కమల్‌ హాసన్‌ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్‌ జరుగుతోంది. ఈ సెట్లో ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్న గుణశేఖర్ అనే వ్యక్తి ఈరోజు(సోమవారం) ఉదయం హౌస్ రెండవ అంతస్తు నుంచి కింద పడిపోయాడు. దీంతో అతని తలకి తీవ్ర గాయమై రక్తస్రావం బాగా జరిగింది. ఘటన జరిగిన వెంటనే బిగ్‌బాస్ సిబ్బంది గుణశేఖర్‌ను హాస్పిటల్‌కు తరలించారు కానీ అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

‘బిగ్‌బాస్’ విన్నర్ అతనే... లేదంటే ధర్నాలే..: రష్మి

Submitted by arun on Thu, 08/23/2018 - 11:55

బిగ్‌బాస్‌ సీజన్‌-2 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్‌ గొడవలతో సోషల్‌ మీడియాలో ఓ ట్రెండ్‌ సృష్టించింది ఈ రియాల్టీ షో. ఆసక్తికర టాస్క్‌లు, సెలబ్రిటీల సడన్‌ ఎంట్రీలతో బిగ్‌బాస్‌ ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌ ఇస్తున్నాడు. బిగ్‌బాస్ విన్నర్ గురించి యాంకర్ రష్మి తన అభిప్రాయాన్ని తెలిపింది.‘బిగ్‌బాస్ సీజన్ 2’ టైటిల్ పక్కా కౌశల్‌దే!...’’ అని కరాకండిగా చెప్పేస్తోంది యాంకర్ రష్మీ. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈ హాట్ యాంకర్, వరుస సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె హీరోయిన్‌గా నటించిన ‘అంతకు మించి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

బిగ్‌బాస్‌ హౌజ్‌లో మెగా హీరో

Submitted by arun on Thu, 07/05/2018 - 13:50

నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 షో రసవత్తరంగా సాగుతోంది. 100 రోజుల పాటు ఆడియన్స్ కు వినోదాన్ని పంచనున్న బిగ్ బాస్ హౌస్.. సినిమా ప్రమోషన్లకు అడ్డాగా మారిపోయింది. ఆ మధ్యన జంబలకడి పంబ చిత్ర యూనిట్ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. తేజ్ ఐ లవ్ యు చిత్రం శుక్రవారం విడుదలవుతున్న నేపథ్యంలో సాయిధరమ్ తేజ, అనుపమ పరమేశ్వరన్ బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేశారు. ఆ ఎపిసోడ్ నేడు ప్రసారం కానుంది. దానికి సంబందించి ప్రోమోని విడుదల చేశారు. వీరితో కలిసి హౌజ్‌మేట్స్‌ చేసే సందడి హైలెట్‌గా నిలవనుంది. తేజస్వీ.. ‘నా బర్త్‌డేకు కేక్‌ తీసుకురాలేదా బావా?’ అని అంటే..

నాని దగ్గర అంత స్టఫ్ లేదు.. బిగ్ బాస్ పై బాంబ్ పేల్చిన సంజనా..!

Submitted by arun on Tue, 06/19/2018 - 12:50

తెలుగు బిగ్ బాస్ రెండో సీజన్ లో కామన్ మ్యాన్ కోటాలో హౌస్ లోకి ప్రవేశించి, తొలివారంలోనే ఎలిమినేట్ అయిన సంజన, కార్యక్రమ వ్యాఖ్యాత, హీరో నానిపై సెన్సేషనల్ కామెంట్లు చేసింది. తాను ఎన్.టి.ఆర్ ఫ్యాన్.. అయినా నాని సినిమాలను చూస్తాను.. బిగ్ బాస్ నడిపించే స్టఫ్ నాని దగ్గర లేదని అన్నది సంజనా. ఎన్టీఆర్ ఈ కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహించారని, తొలి సీజన్ అంత పెద్ద హిట్ కావడానికి ఎన్టీఆర్ కారణమని వ్యాఖ్యానించిన సంజన, ఆ స్థాయిలో నాని పెర్ ఫార్మెన్స్ లేదని అభిప్రాయపడింది. "ఎన్టీఆర్ ఎక్కడ? నానీ ఎక్కడ? అందుకే నేను బయటకు వచ్చినా పెద్దగా బాధపడలేదు. బిగ్ బాస్ లో మరో అవకాశం వచ్చినా వెళ్లను" అని చెప్పింది.

బిగ్‌బాస్-2 ఇంట్లో కొత్త బ్యూటీ

Submitted by arun on Mon, 06/18/2018 - 14:50

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విజయవంతంగా తొలి వారం పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ గేమ్‌లో భాగంగా ప్రతి వారం ఇంటి నుండి ఒకరు ఎలిమినేట్ అవ్వడం తప్పనిసరి. తొలి ఎలిమినేషన్లో ప్రేక్షకులు సంజనను బయటకు పంపేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో.... కొత్త కంటెస్టెంట్ ఎంటరైంది. ఆమె ఎవరో కాదు హీరోయిన్ నందినీ రాయ్. హైదరాబాద్ లో పుట్టిపెరిగిన నందినీ‌ రాయ్ లండన్ వెళ్లి ఉన్నత చదువులు చదివింది. మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి పలు బ్యూటీ కాంటెస్టుల్లో పాల్గొని టైటిల్స్ దక్కించుకుంది.

బిగ్ బాస్ హౌస్ నుండి సంజనా ఔట్!

Submitted by arun on Mon, 06/18/2018 - 11:02

నాని హోస్ట్ గా బిగ్ బాస్-2 మొదలై వారం అవుతుంది. మొదటి ఎలిమినేషన్ అందరి అంచనాలను మించి జరిగింది. గణేష్, సంజనా, నూతన్ నాయుడులలో సంజనా, నూతన్ నాయుడులను ఎలిమినేటర్స్ గా తేల్చిన బిగ్ బాస్ ఫైనల్ గా నాటకీయ పరిణామాలతో నూతన్ నాయుడుని సేఫ్ చేసి సంజనాని ఎలిమినేట్ చేశారు. బిగ్‌బాస్‌ ఇంట్లోకి వచ్చిన మొదటి రోజు నుంచి సంజన పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. ఇతర కంటెస్టెంట్లతో దూకుడుగా వ్యహరించేవారు. ముఖ్యంగా తేజస్వి సంజనాకు  మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా ఉండేది. వారం రోజుల పాటు సంజనా బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉండగా ప్రతిరోజు వివాదాస్పదంగా ఉండేదంటూ ఇంటి సభ్యులు తెలిపారు.

బిగ్‌బాస్ వాయిస్ ఎవ‌రిదో తెలుసా?

Submitted by arun on Sat, 06/16/2018 - 15:23

ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజ‌న్ 1, నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజ‌న్ 2 ల‌లో ఎవ‌రికి క‌నిపించ‌కుండా ఓ వ్య‌క్తి హౌజ్‌లోని అంద‌రు కంటెస్టెంట్స్‌ని కంట్రోల్‌ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గాంభీర్య‌మైన గొంతుతో భ‌య‌పెట్టించే ఆ వ్య‌క్తి అప్పుడ‌ప్పుడు టాస్క్‌లు ఇస్తూ, రూల్ అదిగ‌మిస్తే వారిని హెచ్చ‌రిస్తూ ఉంటారు. అజ్ఞాత‌వాసిలా ఉండే బిగ్ బాస్ ఎవ‌ర‌నే విష‌యాన్ని సీజ‌న్ 1 పూర్తైన త‌ర్వాత రివీల్ చేస్తార‌ని అప్ప‌ట్లో అంద‌రు భావించారు. కాని అలాంటిదేమి లేకుండా షో ముగించేశారు. ఇప్పుడు సీజ‌న్ 2 మొద‌లైంది. ఇందులోను బిగ్ బాస్‌ది అదే గొంతు.

బిగ్ బాస్-2 వైల్డ్ కార్డ్ ఎంట్రీలో టాప్ హీరోయిన్..

Submitted by arun on Tue, 06/12/2018 - 10:40

నాని హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్-2 మొదలైంది. మొదటిరోజు పరిచయ కార్యక్రమంతోనే ముగియగా కంటెస్టంట్స్ ఒక్కరోజులో కొన్ని తేడాలు గమనించడం జరిగింది. ఈసారి 16 మంది కంటెస్టంట్స్ లో ముగ్గురు కామన్ మెన్ కావడంతో కొద్దిగా చేంజ్ కనబడుతుంది. మిగతా వారంతా ఎలాగోలా సినిమాకు సంబందించిన వారే కాని ఈ ముగ్గురు బాబు గోనినేనితో కలిపి నలుగురు కాస్త కొత్తగా అనిపిస్తున్నారు. మరో వారం రోజులు చూసి, వీలైనంత తొందరగా వైల్డ్ కార్డ్ ఎంట్రీని రంగంలోకి దించాలని చూస్తోందట స్టార్ మా. ఈ మేరకు ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లు పరిశీలించిన యాజమాన్యం.. ఓ ముద్దుగుమ్మను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు..