Sanju Samson

గర్ల్‌ఫ్రెండ్‌తో సంజూ శాంసన్‌ పెళ్లి ఫిక్స్‌

Submitted by arun on Mon, 09/10/2018 - 13:09

భారత యువ క్రికెటర్‌ సంజూ శాంసన్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఎన్నాళ్లుగానో డేటింగ్‌ చేస్తున్న తన గర్ల్‌ఫ్రెండ్‌ చారును ఈ ఏడాది డిసెంబరులో పెళ్లి చేసుకోనున్నట్టు ఈ కేరళ వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ ప్రకటించాడు. 23 ఏళ్ల సంజూ తన కళాశాల క్లాస్‌మేట్‌ అయిన చారును ఐదేళ్లక్రితం కలిశాడు. అప్పటినుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నప్పటికీ, ఈ విషయం ఎప్పుడూ బహిర్గతం కానివ్వలేదు.

సంజుకి షాక్.. యొ యొ టెస్ట్ ఫెయిల్

Submitted by arun on Mon, 06/11/2018 - 17:04

కేరళ యువ వికెట్ కీపర్ సంజు శాంసన్‌కు షాక్ తగిలింది. యొ యొ టెస్ట్ ఫెయిలవడంతో ఇంగ్లండ్ టూర్‌కెళ్లే ఇండియా ఎ టీమ్‌లో చోటు కోల్పోయాడు. జూన్ 17 నుంచి ఇంగ్లండ్‌ వేదికగా మూడు జూనియర్‌ జాతీయ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ జరగనుంది. వెస్టిండీస్- ఎ, ఇంగ్లండ్ లయన్స్ జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీ కోసం ఇటీవల భారత- ఎ జట్టుని సెలక్టర్లు ప్రకటించారు. కాగా, క్రికెటర్లందరికీ మూడు రోజుల క్రితం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ టెస్టుని నిర్వహించారు. ఈ టెస్టులో సంజు శాంసన్ ఫెయిలవడంతో అతన్ని ఇంగ్లండ్‌కు వెళ్లే జట్టు నుంచి భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) తప్పించింది.