Atal Bihari Vajpayee

ప్రేమకు గుండెల్లోనే గుడి... దత్తపుత్రిక ప్రియురాలి కుమార్తె

Submitted by arun on Fri, 08/17/2018 - 12:46

అపర చాణక్యుడు, విపక్షాలు సైతం మెచ్చుకునే రాజకీయ వేత్త, మాజీ ప్రధాని వాజ్‌పేయి ఎందుకు పెళ్ళి చేసుకోలేదు. ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా ఎందుకు ఉండిపోయారనేది చాలా మందికి తెలియదు. అయితే వాజ్‌పేయికి యుక్త వయస్సులో ఒక ప్రేమ కథ ఉందంటే ఎవరూ నమ్మరేమో. కానీ ఆయనది విఫల ప్రేమ. 

అభివృద్ధికి ‘బాట’సారి.. అటల్‌ జీ!

Submitted by arun on Fri, 08/17/2018 - 11:10

ఆయనో బాట..సారి. మారుమూల గ్రామాలకు సైతం రహదారి సదుపాయం కల్పించారు. బావి తరాల కోసం సుమారు 20ఏళ్ల క్రితమే తన కలల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ముందు చూపుతో అప్పట్లోనే జాతీయ రహదారులకు జీవం పోసిన మహానేత వాజ్ పేయి. 

వాజ్‌పేయికి ఆ సినిమా అంటే ఎంతిష్టమో.. 25 సార్లు చూశారు!

Submitted by arun on Fri, 08/17/2018 - 11:02

కవిత్వమంటే వాజ్ పేయికి పంచప్రాణాలు. రాజకీయ జీవితంలో తలమునకలైనా కవిత్వ సాధనను విడిచిపెట్టలేదాయన. అయితే, వాజ్ పేయి సాహిత్యంతో పాటు సినీ ప్రియుడు కూడా. ముఖ్యంగా ఆయన బాలీవుడ్ డ్రీమ్ గాల్ హేమమాలిని అభిమాని.  వాజ్‌పేయి అనగానే చాలామందికి గొప్ప రాజకీయవేత్తగా, మాజీ ప్రధానిగా, కవిగా మాత్రమే తెలుసు. అయితే, ఆయన సినిమా ప్రియుడని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. బాలీవుడ్ నటి హేమ మాలినికి ఆయన గొప్ప ఫ్యాన్. ఆమె నటించిన ‘సీత ఔర్ గీత’ సినిమాను వాజ్‌పేయి ఏకంగా 25 సార్లు చూశారట. 

భోజన ప్రియుడు.. వాజ్‌పేయీ

Submitted by arun on Fri, 08/17/2018 - 09:27

అటల్ బిహారీ వాజ్ పేయి పరిపాలన దక్షుడే కాదు మంచి భోజనప్రియుడిగానూ పేరుంది. స్వీట్లు, రొయ్యలు అంటే ఎంతో ఇష్టంగా తినేవారు. ఎక్కడికి వెళ్లినా అక్కడ స్థానికంగా లభించే ఆహార పదార్దాలను పట్టుబట్టి తినేవారు. ముఖ్యంగా మన హైదరాబాదీ బిర్యానీ అన్నా, నెల్లూరు నుంచి వెంకయ్య నాయుడు తీసుకెళ్లే రొయ్యలన్నా వాజ్ పేయి ఇష్టంగా తినేవారని ఆయన సన్నిహితులు చెబుతారు. అటల్జీ పాలనపై ఎంత ఆసక్తి చూపే వారో ఆయన తినే ఆహరంలోనూ అంతే ఆసక్తి కనబరిచేవారు.  స్వీట్లు రొయ్యలు అంటే వాజ్ పాయ్ ఎంతో ఇష్టపడే వారు.

పానీపూరీ తింటూ.. స్కూటర్‌పై షికారు చేస్తూ

Submitted by arun on Fri, 08/17/2018 - 09:07

వాజ్ పేయి మరణం ఆయన ఆత్మ మిత్రుడు అడ్వానీని తీవ్రంగా కలచి వేసింది.65 ఏళ్ల ఆత్మీయస్నేహం వారిది. ఆరెస్సెస్ లో ప్రచారక్ స్థాయి నుంచీ వారిద్దరూ కలసి పనిచేశారు. గతకొంత కాలంగా వాజ్ పేయిని తరచుగా కలిసిన వ్యక్తి కూడా అ ద్వానీయే.. తన ఆప్త మిత్రుడిని కోల్పోవడంతో మాటలు రావడం లేదన్నారు అడ్వానీ.

ఒక తేదీ అటల్‌ జీవితంతో పెనవేసుకుంది....ఆయనతో పాటు ప్రయాణం చేసింది

Submitted by arun on Fri, 08/17/2018 - 08:58

ఒక తేదీ అటల్‌ జీవితంతో పెనవేసుకుంది. ఆయనతో పాటు ప్రయాణం చేసింది. కొన్నిసార్లు ఉక్కిరిబిక్కిరి చేసింది. మరికొన్నిసార్లు ఒళ్లు జలదరింపుచేసింది. ఒకసారి ఆనందాన్నిచ్చింది. ఇంతకీ ఏంటా డేట్...?

తెలుగు నేలకు వాజ్‌పేయికి విడదీయరాని అనుబంధం

Submitted by arun on Fri, 08/17/2018 - 08:42

భరతమాత ముద్దుబిడ్డ వాజ్‌పేయికి.. తెలుగు రాష్ట్రాలకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆనాటి ఆంధ్రప్రదేశ్‌కు తలమానికంగా నిలిచిన హైటెక్ సిటీ అయినా హైదరాబాద్‌లో విమానయానానికి కేరాఫ్‌ శంషాబాద్‌ విమానాశ్రయానికి బీజం పడ్డా అదంతా వాజ్‌పేయి హయాంలోనే. పుట్టపర్తిలో పేద రోగులకు వైద్యాన్ని అందిస్తున్న సత్యసాయి అంతర్జాతీయ ఆస్పత్రిని కూడా తానే ప్రారంభించారు. 

వాజ్‌పేయి గురించి నెహ్రూ చెప్పిన మాట అక్షరాలా నిజమైంది

Submitted by arun on Fri, 08/17/2018 - 08:28

అధికారపక్షంతో అభినందనలు అందుకున్న వివాదరహితుడు. అధికారపక్షాన్ని సైతం ప్రశంసించిన రాజనీతజ్జుడు. ఇందిరను అపరకాలీగా పొగిడిన అందరివాడు. ఏయే సందర్భాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి..నెహ్రూ ఎందుకు ప్రశంసించారు...నెహ్రూ కూతురు ఇందిరను, అటల్‌ ఎందుకు పొగిడారు?

రాజకీయ భీష్ముడు అటల్ బిహారీ వాజ్‌పేయి...నేను మృత్యువుకి భయపడను....

Submitted by arun on Thu, 08/16/2018 - 15:08

అటల్ బిహారీ వాజ్‌పేయి 1924, డిసెంబరు 25న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్‌లో జన్మించారు. భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని రెండుసార్లు అధిష్టించిన అటల్‌... 93 ఏళ్ల బ్రహ్మచారి. ఆయన సుదీర్ఘకాలం లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 1968 నుంచి 1973 వరకు జనసంఘ్ పార్టీ అధ్యక్షుడిగా, 1980 నుంచి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. 1996లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన ఆయన 13 రోజుల పాటు మాత్రమే ఆ పదవిలో వున్నారు. 1998లో రెండోసారి ప్రధానమంత్రి పదవి పొంది 13 నెలలు పాలించారు.

వాజ్‌పేయిపై గవర్నర్ షాకింగ్ ట్వీట్..

Submitted by arun on Thu, 08/16/2018 - 12:42

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ నెల నుంచి ఆయన అనారోగ్య కారణాల వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారడంతో బీజేపీ నేతలు కంగారపడుతున్నారు. ఇప్పటికే  ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు బీజేపీ నేతలు ఆయనను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లారు. ఈ నేపథ్యంలో త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ చేసిన ట్వీట్ వివాదాలకు దారి తీసింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ‘‘ఇక లేరంటూ’’ త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ ట్వీట్ చేయడం వివాదాస్పదంగా మారింది.