Bigboss

బిగ్ బాస్ డైరెక్షన్ టీం 36 గంటల పని

Submitted by arun on Thu, 08/30/2018 - 14:52

దాదాపు 30 మంది సభ్యులతో కూడిన బిగ్ బాస్ డైరెక్షన్ విభాగం రోజువారీ 36 గంటల షిఫ్ట్లో పని చేస్తువుంటుందట. తమ షిఫ్ట్ పూర్తి చేయడానికి ముందు శాఖలోని ప్రతి సభ్యుడు నేరుగా 36 గంటలు పనిచేయాలి (ఇది ముందు ప్రీ ప్రొడక్షన్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ కలిగి ఉంటుంది). బిగ్ బాస్ ఇంటి సభ్యులకి ఓపిక వుండల్సినట్టే , పాపం డైరెక్షన్ టీం కి కూడా బోలెడు ఓపిక వుండాలేనెమో.. శ్రీ.కో.
 

Tags

బిగ్ బాస్ హౌజ్ నుంచి తర్వాత బయటకు వచ్చేది ఆయనే: సినీ నటి అర్చన

Submitted by arun on Wed, 06/27/2018 - 18:01

బిగ్ బాస్ సీజన్-2లో ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. నెక్స్ట్ ఎలిమినేషన్ రౌండ్ లో ఎవరు నిష్క్రమించబోతున్నారనే విషయాన్ని సినీ నటి అర్చన తెలిపింది. తర్వాత ఎలిమినేట్ అయ్యేది హేతువాది బాబు గోగినేనేనని జోస్యం చెప్పారు. అయితే ఆయనొక్కరే అని కాదని... మరో ఐదుగురు కూడా ఉన్నారని... ఆ పేర్లు బయటపెట్టలేనన్నారు. ఇదిలా ఉంటే వ్యాఖ్యాతగా నాని చక్కగా చేస్తున్నారని కితాబిచ్చారు. తారక్ గొప్పగా చేశాడని... అందులో ఏమాత్రం సందేహం లేదన్నారు. ఈ షో జనంలోకి వెళ్లడానికి టైమ్ పడుతుందన్నారు. హౌజ్‌లో తనకిష్టమైన వాళ్లు ఉన్నారని చెప్పిన అర్చన.. ఆ పేర్లు చెప్పడానికి మాత్రం అయిష్టత వ్యక్తం చేశారు.

అతని పక్కన పడుకోమన్నారు.. బిగ్‌బాస్‌టీంపై సంజన ఫైర్

Submitted by arun on Wed, 06/20/2018 - 07:43

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. హౌస్ లోపల ఉన్న కంటెస్టెంట్స్ ఆడియన్స్ కు ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నారు. ఇప్పటికే సంజన ఎలిమినేషన్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సంజన ప్లేస్ లోకి నందిని రాయ్ జాయిన్ అయింది. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే తనతో బిగ్ బాస్ నిర్వాహకులు గేమ్ ఆడుకున్నారని, హౌస్ లోపల మొత్తం రాజకీయం జరిగింది అని సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. బిగ్ బాస్ 2 నుంచి బయటకు వచ్చిన సంజన ఇంటర్వ్యూలలో చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఈ షోనుంచి మొదటగా ఎలిమినేట్ అయిన సంజన చెబుతోన్న మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఒక్కొక్కడికి మూడు చెరువుల నీళ్ళు తాగించా.. మీకు తాగించలేనా..

Submitted by arun on Tue, 06/19/2018 - 16:25

బిగ్‌బాస్ సీజన్ 2 ఎంతో  రసవత్తరంగా కొనసాగుతోంది. తొలి ఎలిమెనేషన్‌లో మిస్ హైదరాబాద్ సంజన చౌదరి షో నుంచి బయటకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆమె షో  నుంచి బయటకు వెళ్తూ బిగ్‌బాంబ్‌ను బాబు గోగినేనిపై వేసింది. దీంతో అతను వారం రోజులు ఇంట్లోని సభ్యుల్లో ఎవరికి మంచినీళ్లు అవసరం వచ్చినా ఆయనే తీసుకెళ్లి ఇవ్వాలి.  సంజన తనపై వేసిన బిగ్‌బాంబ్‌ను గోగినేని స్వీకరించడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ షోలోకి రాకముందు తాను అనేక టీవీ డిబేట్లలో పాల్గొన్నానని చెప్పారు. డిబేట్లలో ఒక్కొక్కరికి మూడు చెరువుల నీరు తాగించానని, అలాంటి తనకు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారికి నీళ్లు ఇవ్వడం పెద్ద కష్టం కాదని తెలిపారు.

బిగ్‌బాస్-2లో తొలి రోజే రాజుకున్న వేడి.. సెలబ్రిటీలపై విరుచుకుపడిన సంజన!

Submitted by arun on Mon, 06/11/2018 - 10:42

నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా స్టార్ మా టీవీలో బిగ్‌బాస్-2 షో ప్రారంభమైంది. మొత్తం 16 మందిని బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపగా, అందులో 13 మంది సెలబ్రిటీలే ఉన్నారు. మిగతా ముగ్గురు సామాన్యులు. వీరిలో విజయవాడకు చెందిన మోడల్ సంజన అన్నె, గణేశ్, విశాఖపట్టణానికి చెందిన నూతన్ నాయుడు ఉన్నారు.  అయితే బిగ్‌బాస్‌ హౌజ్‌లో తొలిరోజే సామాన్యులకు సెలబ్రిటీలు షాక్‌ ఇచ్చారు. మొత్తం 16 మంది కంటెస్టెంట్‌లో బిగ్‌బాస్‌ ఇంటినుంచి బయటకు పంపేందుకు ఇద్దరిని ఎన్నుకోవాలని ఆదేశించారు. దీంతో తొలిరోజే కంటెస్టంట్లకు ఊహించని షాక్ ఎదురైనట్లు అయ్యింది.