snake

పోలింగ్ బూత్‌లో పాము హ‌ల్‌చ‌ల్

Submitted by arun on Sat, 11/03/2018 - 12:08

క‌ర్నాట‌క‌ మొట్టెదొడ్డిలో జరుగుతున్న పోలింగ్ బూత్‌లోకి  సడెన్‌గా ఓ పాము వచ్చింది.  179 పోలింగ్ బూత్‌లోకి పాము ప్ర‌వేశించ‌డంతో అక్క‌డున్న వారు హైరానా ప‌డ్డారు. పామును చూసి ఓటు వేయడానికి వచ్చిన వారితో పాటు పోలింగ్ సిబ్బంది కూడా భయాందోళనలకు గురయ్యారు. దీంతో కాసేపు  పోలింగ్‌ను నిలిపేసిన అధికారులు. పామును బయటకు పంపించిన తర్వాత మ‌ళ్లీ పోలింగ్ ప్ర‌క్రియను కొనసాగించారు. 

కుక్క వర్సెస్‌ నాగుపాము

Submitted by arun on Wed, 10/24/2018 - 13:53

నాగుపాము, కుక్క మధ్య జరిగిన విరోచిత పోరాటం  వైరల్‌గా మారింది. కర్ణాటకలోని  హోళెమక్కి గ్రామానికి సమీపంలో ఉన్న ఒక తోటలో కుక్కకు, నాగుపాముకు  మధ్య పెద్ద గొడవే జరిగింది. అవినాశ్‌ అనే వ్యక్తికి చెందిన తోటలో సుమారు అరగంట పాటు సాగిన కీచులాటలో నాగుపాము రోషంతో పడగవిప్పి బుసకొడుతూ కుక్కను ఎదుర్కొంది. తన జోలికి రావద్దని నాగుపాము కుక్కను బెదిరిస్తూ పొదల్లోకి జారుకుంది.

కుక్క VS పాము...తల్లి శునకంపైకి పామును ఊసిగొల్పిన స్థానికులు

Submitted by arun on Thu, 09/20/2018 - 13:11

ఒడిషాలోని భద్రక్‌లో విషాదం చోటు చేసుకుంది. కుక్క పిల్లలను భారీ నాగుపాము కాటేసింది. పాముకాటుకు కుక్క పిల్లలు మృతి చెందాయి. తల్లి శునకాన్ని కూడా పాము కాటేసేందుకు ప్రయత్నం చేస్తుండగా స్థానికులు కాపాడారు. 
భద్రక్ లో కొద్ది రోజుల క్రితం ఓ శునకం పిల్లలను కనింది. రాత్రి వేళ కుక్క పిల్లల వద్దకు భారీ నాగు పాము వచ్చింది. పాము దాడి నుంచి పిల్లలను తల్లి శునకం అడ్డుకుంది. కాసేపటికి పాము మళ్లీ బుసలు కొట్టింది. కుక్క ఎదురుతిరగడంతో పాము వెనుదిరిగే ప్రయత్నం చేసింది. అయితే, ఈ దృశ్యాలను సెల్ ఫోన్ లో బంధిస్తున్నస్థానికులు పామును మళ్లీ శునకంపైకి ఊసిగొల్పారు. 

Tags

రైల్లో పాము.. ప్రయాణికులు హడల్

Submitted by arun on Fri, 08/03/2018 - 12:14

ముంబై లోకల్‌ ట్రెయిన్‌లో పాము కలకలం సృష్టించింది. సబర్బన్ రైలులో సీలింగ్ ఫ్యాన్‌ నుంచి వేలాడుతూ ప్రయణీకులను షాక్‌కు గురి చేసింది. రైలులోని ఫస్ట్ క్లాస్ కోచ్‌లో దర్శనమిచ్చిన పసిరిక పాము  రైలులోని వందల మంది ప్రయాణికులను భయాందోళనలకు గురి చేసింది. టిట్వాలా -సిఎస్ఎంటీ లోకల్‌ రైలులో థానే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పామును గుర్తించిన ప్రయాణీకులు చెయిన్‌లాగి అధికారులకు సమాచారం అందించారు. దాదాపు మూడు అడుగులున్న ఈ పాముకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నాగుపాము ఎలా చనిపోయింది..పాము మృతికి కారకులెవరు..?

Submitted by arun on Thu, 08/02/2018 - 14:54

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడలో నాగుపాము మృతి చెందింది. 27 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన పాము కాసేపటి క్రితమే అనారోగ్యంతో మృతి చెందింది. ఈ 27 రోజుల పాటు పాము ప్రత్యేక పూజలను అందుకుంది. సుబ్రహ్మణ్యస్వామి ప్రతిరూపంగా స్థానికులు, నాగ భక్తులు పామును కొలిచారు.

రక్తపింజరి కడుపులోంచి బయటపడ్డ 35 పాము పిల్లలు

Submitted by arun on Wed, 07/04/2018 - 13:01

రక్తపింజరి కడుపులో  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 35  పిల్లలు బయటపడ్డాయి. ఈ దృశ్యాన్ని చూసి స్థానికులు విస్తుపోవాల్సి వచ్చింది. కృష్ణాజిల్లా ఉంగుటూరులో బుడమేరు పక్కనే ఉన్న పొలంలో ఈ ఘటన దర్శనమిచ్చింది.  నారుమడికి నీరు పెట్టడానికి వచ్చిన రైతుకు సడన్‌గా  రక్తపింజరి కనిపించడంతో  వెంటనే చంపేశారు.  తర్వాత దాని కడపులోంచి 35 పాము పిల్లలు బయటకు వచ్చాయి.  భయాందోళనకు గురై న రైతులు వాటిని కూడా చంపేశారు. 

Tags

పించన్ ఇవ్వడం లేదని కుష్టురోగి పాముతో ఆఫీసుకు వచ్చినవేళ...

Submitted by arun on Sat, 06/09/2018 - 12:54

కర్ణాటక రాష్ట్రంలో ఓ కుష్ఠి రోగి తన సమస్యను వినూత్నంగా పరిష్కరించుకున్నాడు. గత 8 నెలలుగా తనకు పెన్షన్ రాకపోవడంతో మెడలో పామును వేసుకుని పెన్షన్ ఆఫీస్‌కు వెళ్లాడు. అధికారులకు దడ పుట్టించాడు. అనుకున్నది సాధించాడు.