payakararaopeta

అభిమాని ఇంట పవన్ భావోద్వేగం

Submitted by arun on Fri, 06/08/2018 - 17:42

విశాఖ జిల్లా పాయకరావుపేటలో ప్రజా పోరుయాత్ర ఫ్లెక్సీలు కడుతూ....మృతి చెందిన కుటుంబాలను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పరామర్శించారు. తన కోసం ఫ్లెక్సీలు కడుతూ ప్రాణాలు కోల్పోయిన శివకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. మృతుడు భీమవరపు శివ భార్యను పరామర్శించిన పవన్‌....3 లక్షల రూపాయల చెక్‌ను అందజేశారు.  అంతేగాక శివ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. శివ మూడు నెలల బిడ్డకు అనిరుధ్ అని నామకరణం చేశారు. ఆ చిన్నారిని తన ఒళ్లో పెట్టుకుని భావోద్వేగానికి గురయ్యారు. దీంతో అక్కడి వాతావరణమంతా ఉద్విగ్నభరితమైంది. చుట్టూ గుమిగూడిన అభిమానులు, శివ మిత్రులు..