congress jeevan reddy

ఆర్టీసీ ఉద్యోగులను కేసీఆర్‌ బెదిరిస్తున్నారు : జీవన్‌రెడ్డి

Submitted by arun on Fri, 06/08/2018 - 16:08

ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. సమ్మె చేస్తామన్న కార్మికులను...ఉద్యోగాల నుంచి తీసేస్తామని హెచ్చరించడం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలకంగా వ్యవహరించారని జీవన్‌రెడ్డి గుర్తు చేశారు. ఆర్టీసీకి ప్రభుత్వం రాయితీలు కల్పించకుండా...డ్రైవర్లు, కండక్లర్లను బాధ్యుతలను ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆర్టీసీ దివాళా తీయడానికి ప్రభుత్వ వైఖరే కారణమని జీవన్‌రెడ్డి ఆరోపించారు.