Molestation

ఎఫైర్: ఆ సంబంధం కోసం ఇంటికొస్తే... దిమ్మతిరిగే షాకిచ్చిన మహిళ

Submitted by arun on Fri, 08/17/2018 - 09:48

వివాహేతర సంబంధం కొనసాగించాలని వేధించిన మాజీ ప్రియుడిని హత్య చేసి పోలీసులకు లొంగిపోయింది ఓ మహిళ. ఈ ఘటన  కర్నూల్ జిల్లాలో జరిగింది. తాలూకా సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు.. నిడ్జూరు గ్రామానికి చెందిన మహిళ (42) గ్రామంలో కూలీపని చేసుకుని జీవనం సాగిస్తోంది. ఈమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన గొళ్ల విజయుడుతో ఆ మహిళకు వివాహేతర సంబంధం ఉండేది. తన కుమారుడికి, కుమార్తెకు వివాహమైందని.. ఈ సంబంధానికి స్వస్తి పలికాలని చెప్పినా అతను వినేవాడు కాదు. తన కోర్కె తీర్చాలంటూ వేధింపులకు గురిచేసేవాడు.

పెళ్లైన మహిళలే టార్గెట్: 10 మందికి కారులో లిఫ్టిచ్చి రేప్

Submitted by arun on Thu, 08/16/2018 - 11:02

చెన్నైలో రోడ్డుపై వెళ్లే మహిళలను కత్తితో బెదిరించి కారులో అత్యాచారాలు జరుపుతూ వచ్చిన కామాంధుడిని పోలీసులు ఎట్టకేలకూ మంగళవారం అరెస్టు చేశారు.తమిళనాడు రాష్ట్రంలోని  చెన్నై, ఈస్ట్‌కోస్ట్ రోడ్డులో ఒంటరిగా వెళ్లే మహిళలను  లక్ష్యంగా చేసుకొని  నిందితుడు అత్యాచారాలకు పాల్పడుతున్నాడు. ఈ విషయమై పోలీసులకు అందించిన సమాచారం మేరకు  పక్కా ప్లాన్ ప్రకారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే  ఓ 35 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేశారు. 

అత్యాచార నిందితులకు మరణ శిక్షే సరి : మోడీ

Submitted by arun on Wed, 08/15/2018 - 12:27

72వ స్వాతంత్ర్య దినోవత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ ఢిల్లీలో జాతీయ జెండాను ఎగురవేశారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత ప్రధాని హోదాలో ఐదవ సారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోడీ గంటా 20 నిమిషాల పాటు జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రసంగం ఆరంభంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాలికల గురించి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిజోరాం, ఉత్తరాఖండ్ గిరిజన ప్రాంతాలకు చెందిన బిడ్డలు ఎవరెస్ట్‌పై జాతీయ జెండాను ఎగరవేసి దేశ ఔనత్యాన్ని మరింత ఇనుమడింపచేశారని కొనియాడారు.

ఎట్టకేలకు లొంగిపోయిన సంజయ్‌..

Submitted by arun on Mon, 08/13/2018 - 10:02

లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్యసభ సభ్యుడు డీఎస్ తనయుడు సంజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజులు పరారీలో ఉన్న సంజయ్ నిన్న తన లాయర్‌తో పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. నేడు ఎస్సీ, కోర్టులో సంజయ్‌ని హాజరుపరచనున్నారు నిజామాబాద్ పోలీసులు.

సిపాయి కాదు..సెక్స్ నేరగాడు..కాపాడాల్సిన జవానే..కీచకుడయ్యాడు..

Submitted by arun on Thu, 07/26/2018 - 11:21

దేశ రక్షణకు ప్రాణాలు ఒడ్డాల్సిన జవాను రాక్షసుడిలా మారాడు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వాడు అఘాయిత్యానికి ఒడి గట్టాడు. ఓ ప్రేమ జంటపై దాడి చేయడమే కాదు కీచక పర్వానికి యత్నించి కటకటాలపాలయ్యాడు. అయితే ఈ క్రైమ్ స్టోరీలో ఆర్మీ జవానును వెంటాడి వెంటాడి పడ్డుకున్నది పోలీసులే కావడం విశేషం.

బర్త్‌డే పార్టీలో అత్యాచారం...ఆ వీడియోని రూ. 10లక్షలకు బేరంపెట్టిన వారి స్నేహితుడు

Submitted by arun on Sat, 06/30/2018 - 12:37

విశాఖపట్టణంలో దారుణం జరిగింది. స్నేహితుల బర్త్‌డే పార్టీకెళ్లిన బీటెక్ విద్యార్థినిపై తోటి స్నేహితులు అత్యాచారం చేస్తూ వీడియో తీశారు. ఆ తర్వాత ఆ వీడియోను డబ్బులకు విక్రయించేందుకు ప్లాన్ వేశారు. పైగా, ఈ వీడియోను అడ్డుపెట్టుకుని ఆ విద్యార్థినికి నరకం చూపించారు. చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగుచూసింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే...ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడు ఎన్‌ఆర్‌ఐ కళాశాల స్టూడెంట్ వంశీకృష్ణ.. గతేడాది ఓ విద్యార్థినిని తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి ఆహ్వానించాడు. ఓ హోటల్‌లో వేడుకల కోసం ప్రత్యేకంగా గది తీసుకున్నామని చెప్పి యువతిని నమ్మించాడు.

దారుణం.. వివాహితపై నలుగురు యువకులు అత్యాచారం..

Submitted by arun on Tue, 06/19/2018 - 17:43

నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. నలుగురు ముస్లిం యువకులు వివాహితపై సామూహిక అత్యాచారం చేశారు. ఒంటరిగా ఉన్న వివాహితను అపహరించి ఈ దారుణానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో సోమవారం (జూన్ 18) రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. బాధిత మహిళ 100కు డయల్‌ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు 100కు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులపై కేసు నమోదు చేశారు.

అమ్మాయిలకు స్వీట్‌పాన్‌ ఇచ్చి..

Submitted by arun on Fri, 06/08/2018 - 11:31

హైదరాబాద్‌లో ఓ కామాంధుడి వికృత రూపాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. మయూర్ పాన్ హౌస్ పేరిట నగరంలో అనేక చోట్ల పాన్ వ్యాపారాన్ని చేస్తున్న  ఉపేందర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉపేందర్ చేతిలో మోసపోయిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు రంగంలో దిగి  ఉపేందర్ గుట్టు రట్టు చేశారు. ఫేస్ బుక్ ద్వారా చాలా మంది అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న ఉపేందర్ తన వద్ద ఉన్న పాన్‌లలో మత్తు మందును చల్లి అమ్మాయిలకు ఇచ్చేవాడు. వారు స్మృహకోల్పోయిన తర్వాత వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఆ తర్వాత వారిని బెదిరించేవాడు. వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తానని యువతులను బెదిరించేవాడు.