galla jayadev

మోదీని అంత మాట అంటావా? గల్లాపై మండిపడిన నిర్మలా సీతారామన్

Submitted by arun on Fri, 07/20/2018 - 14:09

అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుండగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్  ప్రధాని మోడీ పై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. రికార్డుల నుంచి జయదేవ్ వ్యాఖ్యలు తొలగించాలన్నారు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీని ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ‘మోసగాడు’ అనే పదాన్ని ఉపయోగించారని, ఆ పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని బీజేపీ ఎంపీలు సభలో ఆందోళన చేశారు. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధానిని అలా అనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పదాన్ని వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

గల్లా జయదేవ్ వ్యాఖ్యలను ఖండించిన జితేందర్ రెడ్డి

Submitted by arun on Fri, 07/20/2018 - 13:19

ఆంధ్రప్రదేశ్ ని అడ్డగోలుగా విభజించారంటూ లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఖండించింది. ఆ పార్టీ ఎంపీ జితేందర్ రెడ్డి గల్లా జయదేవ్‌పై మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధంగా, అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన జరిగిందని చేసిన వ్యాఖ్యలను ఖండించారు. లోక్ సభ, రాజ్యసభలలో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందిందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ఆత్మాబలిదానాలకు పాల్పడ్డారని ఈ నేపథ్యంలో రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీని, బీజేపీని తాము ఒప్పించామని తదనంతరం పార్లమెంటు ఉభయసభల్లో బిల్లు పాస్ అయిందని చెప్పారు.

పార్లమెంట్‌లో ‘భరత్ అనే నేను’ సినిమాను ప్రస్తావించిన గల్లా జయదేవ్!

Submitted by arun on Fri, 07/20/2018 - 11:54

లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ గల్లాజయదేవ్ భరత్ అనే నేను సినిమా ప్రస్తావించారు. ముందుగా అవిశ్వాసంపై సభలో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు, అవిశ్వాసానికి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ సహా ఇతర పార్టీలకు కృతజ్ఞతలు తెపిన  జయదేవ్ భరత్ అనే సినిమా సన్నివేశాన్ని వివరించారు. అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన ఓ ఎన్‌ఆర్‌ఐ కథే ‘భరత్ అనే నేను’ అని స్పీకర్‌కు గల్లా వివరించారు. ఆ సినిమాలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని హీరో తల్లి చెప్పిన మాటకు కట్టుబడి సీఎంగా సేవలందిస్తాడని గల్లా చెప్పుకొచ్చారు.

ఎంపీ గల్లా ప్రసంగంపై టీఆర్ఎస్ ఎంపీల అభ్యంతరం

Submitted by arun on Fri, 07/20/2018 - 11:38

అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. టీడీపీ ఎంపీ కేశినేని నాని సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. మరో ఎంపీ గల్లా జయదేవ్‌ చర్చను ప్రారంభించారు. ఎన్డీయే నుంచి బయటకు రాగానే టీడీపీపై కేంద్రం యుద్ధం ప్రకటించిందని ఈ సందర్భంగా గల్లా వ్యాఖ్యానించారు. అయితే గల్లా మాట్లాడుతున్న సమయంలోనే సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. అప్రజాస్వామికంగా ఏపీని విభజించారంటూ ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీలు అభ్యంతరం తెలిపారు. విభజన తర్వాత కొత్త రాష్ట్రం ఏపీనే అని అన్నారు. రాజధాని లేదు ఆదాయంలో లోటు ఉందని, ఏపీ అనిశ్చతిలో ఉందని గల్లా పేర్కొన్నారు.

గల్లా జయదేవ్ సరికొత్త ఛాలెంజ్ ‘హగ్ ఏ ట్రీ’!

Submitted by arun on Thu, 06/07/2018 - 16:16

‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ పేరిట కొత్త విధానానికి కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల వేదికగా తమ ఫిట్ నెస్ వీడియోలను పోస్ట్ చేయాలంటూ పలువురు ప్రముఖులకు ఆయన సవాల్ విసరడం విదితమే.కాగా, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ కూడా సరికొత్త ఛాలెంజ్‌కు నాంది పలికారు. మన జీవితంలో పర్యావరణం, చెట్లు పోషిస్తున్న పాత్రను తెలియజెప్పే నిమిత్తం 'హగ్‌ ఏ ట్రీ' పేరిట కొత్త ఛాలెంజ్‌కు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఓ ట్వీట్‌ చేశారు. మన జీవితంలో ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తున్న చెట్లను గౌరవిస్తూ ఆప్యాయంగా హత్తుకుందామని ఆ ట్వీట్‌ లో పేర్కొన్నారు.