facebook

త్వరలో ఫేస్‌బుక్‌ లో ప్రత్యక్షం కానున్న పవన్ కళ్యాణ్

Submitted by arun on Sat, 10/27/2018 - 15:04

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో ఫేస్ బుక్ ఎకౌంట్ ఓపెన్ చేయబోతున్నాడు. ఇప్పటికే ట్విటర్ ఫేస్ బుక్ పేజీలు ఓపెన్ చేసిన పవన్. ఇక ఫేస్ బుక్ ఎకౌంట్ కూడ ఓపెన్ చేయబోతున్నాడు ఫ్యాన్స్ కోసం ఫేస్ బుక్ ఏకౌంట్ ఓపెన్ చేసి లైవ్ ద్వార జనసేన కార్యకర్తలను, అభిమానులను లైవ్ ద్వార పలకరించబోతున్నారు. ట్విటర్ ద్వార అప్పుడప్పుడు స్పందిస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలను ప్రత్యక్షంగా కలసి వారితో చాట్ చేయబోతున్నాడు ఇప్పటికే దీనికి సంబంధించి డిజైన్స్ కూడ రెడీ చేసినట్టు తెలుస్తుంది వారంలో ఒకటి లేద రెండు సార్లు పవన్ కళ్యాణ్ ఫేస్ బుక్ లైవ్ ద్వార మాట్లాడలని చూస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

అమృతపై అసభ్య కామెంట్స్‌.. యువకుడు అరెస్ట్‌

Submitted by arun on Mon, 10/08/2018 - 11:46

పరువు హత్యకు గురైన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ భార్య అమృతను కించపరిచేలా అసభ్య కామెంట్లు చేసిన యువకున్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆదివారం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈశ్వర్‌(25) అనే యువకుడు ప్రణయ్‌ హత్య విషయంలో ఫేస్‌బుక్‌ వేదికగా అమృత వర్షినిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు. దీంతో ఈశ్వర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. 
 
 

జర్నీ హీరోయిన్ ఇల్లు మునక

Submitted by arun on Mon, 08/20/2018 - 16:01

ప్రకృతి.. జనం మధ్య తేడాలు చూపదు. ధనిక, పేద, హీరో, సామాన్యుడు అనే తేడాలేం వుండవు. అఆ, జర్నీ తదితర చిత్రాల్లో నటించి తెలుగువారికి కూడా చేరువైన నటి అనన్య కష్టాల్లో ఉంది. కేరళ వరదల్లో ఆమె ఇల్లు కూడా మునిగిపోయింది. దీంతో ఆమె స్నేహితురాలైన సహనటి ఆశా శరత్ ఇంట్లో తలదాచుకుంటోంది. `మా ఇల్లు పూర్తిగా మునిగిపోయింది. నిమిషాల వ్య‌వ‌ధిలోనే నీటిమ‌ట్టం పెరిగిపోతోంది. ఇప్ప‌టికీ వ‌ర్షం కురుస్తోంది. మా స‌న్నిహితులు, బంధువుల ఇళ్లు కూడా మునిగిపోయాయి. శుక్ర‌వారం ఉద‌యం వ‌ర‌కు మా ఇంట్లో ఉండ‌గ‌లిగాం. ఇప్పుడు న‌టి ఆశా శ‌ర‌త్ ఇంట్లో త‌ల దాచుకుంటున్నాం.

నిజమైన హీరో పరిటాల రవి...గడ్డం పెంచి గట్టిగా ప్రసంగిస్తే చెగువేరా? : శ్రీరెడ్డి

Submitted by arun on Fri, 07/20/2018 - 16:32

కాస్టింగ్ కౌచ్ విషయంలో ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా వారిపై ఆరోపణలు చేసింది నటి శ్రీరెడ్డి. ఇప్పుడు కోలీవుడ్ కు వెళ్లి అక్కడ తారలపై కూడా ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. ఓ పక్క సినిమా వాళ్లను తిడుతూనే మరోపక్క రాజకీయాలపై కూడా కామెంట్లు చేస్తుంది ఈ నటి. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ వివాదాలకు దారి తీస్తోంది. శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్‌లో ‘బొమ్మ హీరో కాదురా గొర్రెల్లారా, నిజమైన హీరో రా పరిటాల రవి. ఆయనే ఉండుంటే.. గడ్డానికి, జుట్టుకి పెయింటింగ్‌లు వేసుకునేవాళ్లు. గడ్డం పెంచుకుంటే, ప్రసంగాల్లో అరుస్తూ డైలాగులు చెబితే చెగువేరా అవుతారా.. నిద్ర లేవండి గొర్రెల్లారా..

ఫేస్‌బుక్‌ ప్రేమికుని ఆత్మహత్య .. పరారీలో ప్రియురాలు

Submitted by arun on Tue, 06/19/2018 - 12:18

ఫేస్ బుక్ కేంద్రంగా తాను సాగించిన ప్రేమ విఫలమైందన్న కారణంతో ఓ ప్రియుడు ఆత్మహత్య చేసుకోగా, ప్రస్తుతం పరారీలో ఉన్న అతని ప్రియురాలు, ఆమె సోదరుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కర్ణాటకలోని గౌరిబిదనూరు సమీపంలో జరిగిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే, గౌరిబిదనూరులోని నెహ్రూ నగర్‌లో నివసిస్తున్న రంజిత్‌కుమార్‌ (24) అనే యువకుడు తన ప్రేమ వైఫల్యంపై సెల్‌ఫోన్‌లో మరణ వాంగ్మూలాన్ని వీడియో రికార్డ్‌ చేసి శనివారం ఫేస్‌బుక్‌లో పెట్టాడు. ఆవేదన తట్టుకోలేక ఆదివారం ఉదయం పురుగుల మందు తాగి తరువాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే.

ఫేస్‌బుక్‌ లో మరో కేటుగాడు

Submitted by arun on Tue, 06/12/2018 - 11:28

ఫేస్‌బుక్‌ అడ్డగా.. ఆడవారిని నయవంచన చేసే గుంట నక్కల సంఖ్య.. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ పెరిగిపోతోంది. మొన్నటికి మొన్న పాన్ షాప్ ఓనర్ ఆగడాలు మరువక ముందే.. తాజాగా ఏలూరులో అలాంటి ఘటనే వెలుగుచూసింది. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని అమ్మాయిల నుంచి బంగారు ఆభరాణాలను దోచుకునే ఓ వ్యక్తిని కటకటాల్లోకి పంపారు.. పోలీసులు. 

ఫ్రెండ్ రిక్వెస్ట్‌ పంపిస్తూనే.. ప్రేమను నటిస్తారు.. ముద్దులొలికే మాటలతో ఛాటింగ్ చేస్తారు.. నేనున్నా అంటూ భరోసా ఇస్తారు.. పర్సనల్ డిటైల్స్ అడుగుతారు.. ఫోటోస్ పంపమంటారు.. 

ఫేస్‌బుక్‌లో ‘కాలా’ ప్రీమియర్ షో లీక్!

Submitted by arun on Thu, 06/07/2018 - 12:13

సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా చిత్రానికి కూడా కష్టాలు తప్పలేదు , ఆన్ లైన్ లో ఆ సినిమా లైవ్ స్ట్రీమింగ్ పెట్టి సంచలనం సృష్టించాడు ఓ అభిమాని . కాలా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు విడుదల అవుతున్నప్పటికీ , ఓవర్ సీస్ లో మాత్రం ముందుగానే ప్రీమియర్ షోలు పడ్డాయి అందునా సింగపూర్ లో రజనీకాంత్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో అక్కడ ముందుగానే షో వేశారు . అయితే ఆ సినిమాకు వెళ్లిన ప్రవీణ్ దేవర అనే వ్యక్తి కాలా చిత్రాన్ని దాదాపు 45 నిమిషాల పాటు ఫేస్ బుక్ లో లైవ్ ఇచ్చేసాడు . సింగపూర్ లో జరిగిన ఈ ఘటనను నిర్మాత ధనుంజయన్ ట్విట్టర్ ద్వార టీఎఫ్పీసీ అధ్యక్షుడు విశాల్ కు షేర్ చేశారు.

డేటా లీకేజీతో ఫేస్ బుక్ వ్యాపారం

Submitted by lakshman on Sat, 03/24/2018 - 01:43

ఫేస్ బుక్ డేటా గ‌ల్లంతుపై స్పందించిన వైట్ హౌజ్ మాజీ అధికారి స్టీవ్ బ‌న్నోన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ్యాపారం కోసం వ్య‌క్తిగ‌త డేటాను ఫేస్ బుక్ అమ్ముతున్న‌ట్లు ఆరోపించారు. 

యూజర్ల వ్యక్తిగత సమాచారం లీకవడంలో అసలు ఫేస్‌బుక్ పాత్రేంటి?

Submitted by arun on Wed, 03/21/2018 - 16:44

యూజర్ల వ్యక్తిగత సమాచారం లీకవడంలో అసలు ఫేస్‌బుక్ పాత్రేంటి? ఇందులో ఫేస్‌బుక్ స్వార్థం ఉందా? లేకుంటే మోసానికి గురైందా? అనే ప్రశ్నలు ఈ వివాదంలో తలెత్తుతున్నాయి. అయితే విద్యాప్రయోజనాల నిమిత్తమే యూజర్ల వ్యక్తిగత సమాచారం ఇచ్చామనే ఫేస్‌బుక్ ప్రకటనతో దానిపై విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది.

భారీ కుంభకోణంతో ఫేస్‌బుక్ కుదేలు

Submitted by arun on Wed, 03/21/2018 - 14:24

మీ ఫేస్ బుక్ ఎకౌంట్ సేఫేనా... సరదాగా మీరు షేర్ చేసే మీ వ్యక్తిగత సమాచారం ఎంత వరకు భద్రం... ఫేస్ బుక్ లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే బుక్కైపోయినట్టేనా...? అవును ఇప్పుడు ఫేస్ బుక్ ఇరుక్కున్న స్కాం చూస్తే ఇలాంటి అనుమానాలు రాకతప్పదు.  సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్.. అతి పెద్ద కుంభకోణంలో చిక్కుకుంది. ఆర్ధికంగా తీవ్ర నష్టాలబాట పట్టడంతోపాటు సంస్థ విశ్వసనీయత భారీగా దెబ్బతినే ప్రమాదం వచ్చిపడింది.