cabinet

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

Submitted by arun on Wed, 09/19/2018 - 16:36

ట్రిపుల్ తలాక్ చెబితే ఇకపై నేరంగా పరిగణిస్తారు. ట్రిపుల్ తలాక్ శిక్షార్హమైన నేరమని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. మూడుసార్లు తలాక్ చెప్పిన వ్యక్తికి మూడేళ్ళ జైలుతో పాటు భార్యకు భరణం ఇచ్చేలా అత్యవసర చట్టాన్ని తెచ్చారు. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లు చట్టంగా మారకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది.

ప్రగతి నివేదన సభకు గంట ముందు కేబినెట్ భేటీ

Submitted by arun on Sat, 09/01/2018 - 10:29

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమైందా? టీఆర్‌ఎస్‌ కొంగర కలాన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రగతి నివేదన సభకు కేవలం కొన్ని గంటల ముందే కేబినెట్ భేటీ కానుండటం ఇవే సంకేతాలిస్తోంది. ప్రగతి నివేదన సభకు ఒక రోజు ముందు లేదా ఒక రోజు తరువాత కేబినెట్‌ భేటీ నిర్వహించుకునే అవకాశం ఉన్నా బహిరంగ సభ ప్రారంభానికి గంట ముందే ఈ సమావేశం జరగనుండటం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

Submitted by arun on Tue, 04/17/2018 - 11:37

సోమవారం నాలుగు గంటలపాటు జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే పలు కొత్త నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు. అలాగే చంద్రబాబు దీక్ష ఏర్పాట్లు చూడటానికి మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారు. చంద్రబాబు దీక్షకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు దీక్షలో పాల్గొనాలని కేబినెట్ పిలుపునిచ్చింది. 

ఎంపీల అలవెన్సులు పెంచిన కేంద్రం

Submitted by arun on Thu, 03/01/2018 - 10:13

ఎంపీల అలవెన్సులు భారీగా పెరగనున్నాయి. నియోజకవర్గ, కార్యాలయ నిర్వహణ, ఫర్నిచర్ అలవెన్సులను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి అవసరమైన నిబంధనల సవరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎంపీలకు ఇచ్చే అలవెన్సులు పెంచాల్సిందిగా చేసిన ప్రతిపాదనను కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది. 

మోదీ కొలువుల్లో నవ దుర్గలు

Submitted by lakshman on Thu, 09/21/2017 - 20:30

ఇది మన జాతిపిత మహాత్మా గాంధీ గొంతుక. 1930లో గాంధీ ఈ స్టేట్‌మెంట్ చేశారంటే నాలుగు గోడల మధ్యనే కాకుండా బయటి ప్రపంచంలో కూడా మహిళలకు కలిసొచ్చే బలాబలాలను గాంధీ ఎంత చక్కగా చెప్పారో చూడండి.