ys jagan

జగన్‌పై దాడి కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం ...నిందితుడు కాల్ డేటా ఆధారంగా పలువురికి నోటీసులు

Submitted by arun on Tue, 10/30/2018 - 09:59

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డిపై జరిగిన దాడి కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు అకౌంట్లను సిట్ బృందం తనిఖీ చేసింది. దర్యాప్తులో భాగంగా ఎస్‌బీఐ, విజయా, ఆంధ్రా బ్యాంకుల అకౌంట్లను పరిశీలించిన అధికారులు ... మొత్తం మీద 13 వందల 65 రూపాయలు ఉన్నట్టు గుర్తించారు. అయితే గత ఏడాది కాలంలో జరిగిన లావాదేవీలను కూడా పరిశీలించాలని నిర్ణయించారు. మరో వైపు నిందితుడి కాల్ డేటా ఆధారంగా పలువురిని ప్రశ్నించాలని సిట్ అధికారులు నిర్ణయించారు.  

జగన్‌పై దాడి... ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Mon, 10/29/2018 - 16:57

జగన్‌పై జరిగిన హత్యాప్రయత్నం గురించి భిన్నవాదనలు వినిపిస్తున్నాయన్నారు టీడీపీ ఎమ్మెల్సీ వై.బి.రాజేంద్రప్రసాద్. జగన్‌కు ఏదైనా జరిగితే టీడీపీకి ఎలాంటి ఉపయోగం ఉండదని, వైసీపీకి, జగన్ కుటుంబానికి లాభం ఉంటుందని చెప్పారు. అందువల్ల జగన్‌పై దాడి వెనుక తమకు అనుమానాలున్నాయన్నారు. జగన్ ఇంట్లో వాళ్లను అణగదొక్కుతున్నారని, అందువల్ల వాళ్ల కుటుంబ సభ్యులే కుట్ర చేయించి ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తపరిచారు. పోలీసులు ఆ కోణంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రాజేంద్రప్రసాద్. 

మలుపులు తిరుగుతున్న వైఎస్‌ జగన్‌పై దాడి కేసు...రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

Submitted by arun on Mon, 10/29/2018 - 11:10

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌పై దాడి వెనక కుట్ర కోణం ఉందా ? హత్య చేసే ఉద్దేశంతోనే నిందితుడు శ్రీనివాస్ దాడి చేశాడా ? పథకం ప్రకారమే శ్రీనివాస్ రావు ప్రతి అడుగు  పడిందా ? ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన  రిమాండ్ రిపోర్ట్‌లో ఏముంది ? నిందితుడి అసలు టార్గెట్ ఏంటి ? 

‘అతడు’ సినిమా‌ను జగన్ ఫాలో అయ్యారు: సోమిరెడ్డి

Submitted by arun on Sat, 10/27/2018 - 13:12

జగన్‌ నాటకం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందన్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. ‘అతడు’ సినిమాలో సీన్‌‌ను జగన్ ఫాలో అయ్యారని సానుభూతి కోసం ప్రయత్నించారని విమర్శించారు. స్కెచ్‌లో భాగంగానే దాడి చేయించుకున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు భాష మార్చుకోవాలని హితవు పలికారు. ఏపీ పోలీసులపై జగన్‌ నమ్మకం లేదంటారని వాంగ్మూలం ఇవ్వకుండా నిరాకరించడమేంటి అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంటే గవర్నర్‌ పట్టించుకోరని మండిపడ్డారు. జగన్‌కు కోడికత్తి గుచ్చుకుంటే బీజేపీ నేతలు రాష్ట్రపతి పాలనకు డిమాండ్‌ చేస్తున్నారని మంత్రి సోమిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘జగన్నాటకం విఫలం’

Submitted by arun on Sat, 10/27/2018 - 11:33

వై.ఎస్. జగన్ పై టీడీపీ ఎంపీలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ హత్యాయత్నం నాటకం చేస్తున్నారని ఎంపీ కేశినేని నాని అన్నారు. కత్తి దాడి ద్వారా సానుభూతి పొందాలనుకుంటున్నారని చెప్పారు. కోడి కత్తి ద్వారా ఆదరణ పొందాలనుకున్నజగన్ నాటకం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. హత్యా రాజకీయాలు సృష్టించి  పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. జగన్ పై జరిగిన దాడి కేవలం ప్రజల్లో సానుభూతి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
 

మేం ప్లాన్‌ చేస్తే రాజారెడ్డి, వైఎస్‌ఆర్‌ స్థాయిలో ప్లాన్‌ చేసేవాళ్లం

Submitted by arun on Fri, 10/26/2018 - 14:39

జగన్‌పై దాడి ఘటనపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. పిల్ల కుంకను పంపి.. హత్యకు ప్లాన్‌ చేస్తామా అని అన్నారు. ఏదైనా చెయ్యాలనుకుంటే చేతిపై గుచ్చి రమ్మని పిల్లాడిని పంపుతామా అని ప్రశ్నించారు. మేం హత్యకు ప్లాన్‌ చేస్తే రాజారెడ్డి, వైఎస్‌ఆర్‌ స్థాయిలో ఉంటుందని.. వైసీపీ ఇకనైనా డ్రామాలు ఆపాలని అన్నారు. 
 

ఆస్పత్రి నుంచి వైఎస్ జగన్ డిశ్చార్జ్

Submitted by arun on Fri, 10/26/2018 - 13:05

సిటీ న్యూరో ఆస్పత్రి నుంచి వైసీపీ అధినేత జగన్‌ డిశ్చార్జ్‌ అయ్యారు. నిన్న విశాఖ ఎయిర్‌పోర్టులో దాడికి గురైన.. హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందారు. శస్త్ర చికిత్స తర్వాత ఆయన్ని అబ్జర్వేషన్‌లో ఉంచారు. అయితే ఈ ఉదయం సిట్‌ అధికారులు ఆస్పత్రికి వచ్చి జగన్‌ స్టేట్‌ మెంట్‌ను రికార్డ్‌ చేశారు. తొలుత జగన్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వరని వైసీపీ నాయకులు చెప్పారు. అయితే చివరకు జరిగిన దాడిపై సిట్‌కు.. జగన్‌ తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేసిన తర్వాత.. వెంటనే ఆయన్ని డిశ్చార్జ్‌ చేశారు. కాసేపట్లో ఆయన లోటస్‌ పాండ్‌కు చేరుకోనున్నారు. 

Tags

టీడీపీ డ్రామాలు నడుపుతోంది

Submitted by arun on Fri, 10/26/2018 - 12:32

టీడీపీ ఓ డ్రామా కంపెనీ అని.. వారి చిల్లర రాజకీయాలు తెలంగాణలో నడవవని.. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జగన్‌ను పరామర్శించిన ఆయన.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. జగన్‌పై దాడి జరిగితే.. తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టారు. ఘటనను కేంద్రం, తెలంగాణపైకి తోసేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

జగన్‌పై దాడి కాదు.. హత్యాయత్నం...అసలు ఫ్లెక్సీలోకి గరుడ పక్షి ఎలా వచ్చింది...

Submitted by arun on Fri, 10/26/2018 - 11:50

జగన్‌పై జరిగింది.. దాడి కాదని అది ముమ్మాటికీ హత్యాయత్నమే అని వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సిటీ న్యూరో ఆస్పత్రిలో జగన్‌ను పరామర్శించిన ఆయన దుండగుడు శ్రీనివాసరావు కత్తితో జగన్‌ గొంతుపైకి దూసుకొచ్చాడని అయితే అకస్మాత్తుగా జగన్‌ జరగడంతో కత్తి వేటు చేయిపై పడిందన్నారు. దీంతో భారీ ప్రమాదం తప్పిందని సుబ్బారెడ్డి తెలిపారు. 

జగన్‌పై దాడి జరిగిన తీరు చూస్తే అనుమానం: సీఎం చంద్రబాబు

Submitted by arun on Fri, 10/26/2018 - 10:56

ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన దాడి  తీరు చూస్తే అనుమానం కలుగుతుందన్నారు సీఎం చంద్రబాబు. ఎయిర్‌పోర్టు లోపల జరిగితే బాధ్యత ఎవరిదని ఆయన ప్రశ్నించారు. ఈ దాడిని రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి జరిగిన వెంటనే గాయపడిన వ్యక్తి హైదరాబాద్ వెళ్లిపోయారని, ప్రతిపక్ష నాయకుడు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఈ ఘటనపై గవర్నర్ ఫోన్ చేసి డీజీపీని నివేదిక ఎలా అడుగుతారు ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పనిచేయకుండా కేంద్ర సర్కార్ కుట్రలు పన్నుతోందని సీఎం ఆరోపించారు.