ys jagan

జగన్ పై దాడి కేసులో నయాట్విస్ట్...వైసీపీ నేతలకు నోటీసులు

Submitted by arun on Sun, 11/04/2018 - 10:45

వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ కు పోలీసులు నోటీసు జారీ చేశారు. వై.ఎస్ .జగన్ పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త అని ఆరోపించడంపై ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఈనెల 6న విచారణ కోసం గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్ కు హాజరుకావాలని నోటీసు ఇచ్చారు. తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని పోలీసులు నోటీసులో కోరారు. అధికారాన్ని ఉపయోగించుకుని ప్రతిపక్ష నేతలను పోలీసు కేసుల్లో ఇరికించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జోగి రమేష్ అన్నారు.

నేటితో ముగియనున్న శ్రీనివాస్‌ కస్టడీ...కీలక విషయాలు రాబట్టిన...

Submitted by arun on Fri, 11/02/2018 - 14:11

జగన్‌పై దాడి కేసులో సిట్‌ విచారణ ఆరో రోజు కొనసాగుతోంది. నేటితో నిందితుడు శ్రీనివాసరావు కస్టడీ ముగియనుంది. దీంతో శ్రీనివాసరావు కస్టడీ పొడగింపుపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే శ్రీనివాసరావు నుంచి కీలక విషయాలు రాబట్టిన సిట్‌ అధికారులు  నిందితుడితో కలిసి క్యాంటీన్‌లో పనిచేస్తున్న రమాదేవి, జ్యోతితో పాటు మరో యువతిని విచారించారు. ఇప్పటివరకూ మొత్తం 26మందిని విచారించి సిట్‌ అధికారులు శ్రీనివాసరావు వినియోగించిన 4సెల్‌ఫోన్లు సీజ్‌ చేశారు. నిందితుడు శ్రీనివాసరావుకు లై డిటెక్టర్ పరీక్షలు జరిపే యోచనలో సిట్‌ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. 

జగన్‌పై దాడి కేసులో కొత్త కోణాలు...ఇప్పటి వరకు 321 మంది...

Submitted by arun on Thu, 11/01/2018 - 10:44

జగన్ పై దాడి కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు శ్రీనివాస్ కాల్ డేటా సమాచారం దర్యాప్తులో కీలకంగా మారింది. ఘటన జరగడానికి కొద్ది నిమిషాల ముందు ఓ మహిళతో శ్రీనివాస్ జరిపిన సంభాషణ..ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆదిశగా పోలీసులు కూపీ లాగుతున్నారు. అయితే నిందితుడు శ్రీనివాస్‌ దర్యాప్తునకు సహకరించడంలేదని పోలీసులు చెబుతున్నారు. 

హైకోర్టులో సిట్ అధికారులు రిట్ పిటిషన్...దాడి సమయంలో వేసుకున్న చొక్కా అప్పగించాలన్న అధికారులు..

Submitted by arun on Wed, 10/31/2018 - 17:53

వైసీపీ అధినేత జగన్ తనపై జరిగిన హత్యాయత్నం కేసులో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడం లేదని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు.  ప్రభుత్వ వైఫల్యం వల్లే తనపై కుట్ర జరిగిందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ దాడి ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో సీఎం చంద్రబాబుతో సహా 8మందిని ప్రతివాదులుగా ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం రేపు విచారణ జరపనుంది. 

హత్యాయత్నం ఘటనపై హైకోర్టులో జగన్ రిట్ పిటిషన్

Submitted by arun on Wed, 10/31/2018 - 16:07

వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ తనపై జరిగిన హత్యాయత్నంపై హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే తనపై కుట్ర జరిగిందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ దాడి ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో సీఎం చంద్రబాబుతో సహా 8మందిని ప్రతివాదులుగా ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం రేపు విచారణ జరపనుంది. 
 

శ్రీనివాసరావు గురించి నిజాలు బయటపెట్టిన అతని కుటుంబ సభ్యులు

Submitted by arun on Wed, 10/31/2018 - 11:21

ఠాణే లంక...తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలోని ఊరు అంటే.. పెద్దగా తెలియక పోవచ్చు...కానీ...వైఎస్‌ జగన్ పై కత్తి దాడి చేసిన వ్యక్తి శ్రీనివాసరావు ఊరంటే ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. అవును...ఒక్క ఘటనతో ఠాణే లంక పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది. జగన్‌పై కత్తితో దాడి చేసిన జనుపల్లె శ్రీనివాసరావుది ఈ ఠాణే లంక గ్రామమే. శ్రీనివాసరావుది నిరుపేద కుటుంబం. తల్లితండ్రులు ఉపాది పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. అతని అన్నదమ్ములు కూడా కూలీనాలీ చేస్తూ పొట్టపోసుకుంటున్నారు. శ్రీనివాస రావు గత ఐదేళ్లలో గ్రామంలో ఎక్కువ రోజులు ఉన్నది లేదు.

ఈ సస్పెన్స్‌‌కు జగన్‌ తెరదీయబోతున్నారా ...అందుకు నవంబర్‌ 6ని...

Submitted by arun on Wed, 10/31/2018 - 11:01

తనపై జరిగిన దాడిపై జగన్‌‌ ఎప్పుడు నోరు విప్పుతారు? అటాక్‌ గురించి ఏం చెబుతారు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఇటు పార్టీ నేతల్లోనూ అటు రాజకీయ వర్గాల్లోనూ సస్పెన్స్‌గా మారాయి? అయితే ఈ సస్పెన్స్‌‌కు జగన్‌ తెరదీయబోతున్నారా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి ఇంతకీ దాడి ఘటనపై జగన్‌‌ ఎప్పుడు నోరు విప్పబోతున్నారు? 

దేవుడే నా కొడుకుని కాపాడారు : విజయమ్మ

Submitted by arun on Tue, 10/30/2018 - 12:05

దేవుడే నా కొడుకుని కాపాడారన్నారు వైసీపీ నేత విజయమ్మ. 34సెంటీమీటర్ల లోతుకు కత్తి దిగిందని, ఆ కత్తి గొంతుకు తగిలితే ప్రాణం పోయేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సానుభూతి తెలిపాల్సింది పోయి ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రక్తం రాలేదని అవహేళన చేస్తున్నారని, ఫస్ట్ ఎయిడ్ తర్వాత చొక్కా మార్చుకున్నాడని చెప్పారు. అన్యాయంగా మాట్లాడిన వారికి ప్రజలు, దేవుడు బుద్ది చెబుతారని అన్నారు విజయమ్మ. 
 

జగన్‌కు ఏపీలో పోటీచేసే హక్కు లేదు

Submitted by arun on Tue, 10/30/2018 - 11:53

ఏపీ పోలీసులు, అధికారులపై నమ్మకం లేదని చెబుతున్న ప్రతిపక్ష నేత జగన్‌కు ఈ రాష్ట్రంలో పోటీ చేసే హక్కు లేదని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. దాడి జరిగిన వెంటనే జగన్‌ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి చికిత్స తీసుకోకుండా నవ్వుతూ విమానం ఎక్కి వెళ్లిపోవడమేంటని నిలదీశారు. కత్తి దాడి జరిగితే ఎవరైనా కంగారు పడతారని.. కానీ జగన్‌లో అలాంటి ఆందోళన ఏదీ కనిపించలేదన్నారు. తనపై దాడి జరిగి ఐదు రోజులైనా జగన్‌ స్పందించలేదని మీడియా ఎదుట మాట్లాడితే నిజాలు బయటపడతాయని కంగారు పడుతున్నారని నక్కా ఆనందబాబు ఆరోపించారు.

జగన్‌కు జడ్ ప్ల‌స్ సెక్యూరిటీ కల్పించాలని వైసీపీ డిమాండ్

Submitted by arun on Tue, 10/30/2018 - 11:30

వైసీపీ అదినేత‌ జ‌గ‌న్ భద్రతపై ఆ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. విశాఖ ఎయిర్ పోర్టులో దాడి నేపథ్యంలో జగన్‌కు భద్ర‌త మరింత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మ‌రో నాలుగు రోజుల్లో పాద‌యాత్ర ప్రారంభం కానున్న నేప‌ద్యంలో జ‌గ‌న్ సెక్యురిటీపై వైసీపీ నేతలు ప్ర‌త్యేక శ్ర‌ద్ద పెట్టారు. విశాఖలో కత్తి దాడి జరిగాక వైద్యుల సూచన మేరకు ప్రజా సంకల్ప యాత్రకు విరామమిచ్చిన జగన్ మూడు రోజుల్లో మళ్ళీ పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. న‌వంబ‌ర్ మూడ‌వ తేదీన‌ విజ‌య‌న‌గ‌రం జిల్లా సాలూరు నియోజ‌క‌ర్గం నుంచి పాద‌యాత్ర మొద‌లు పెడుతున్నారు.